మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలోని ఉన్నత విద్యా సంస్థల కోసం ‘యుక్తి 2.0’ వేదిక‌ను ప్రారంభించిన కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రి


‘యుక్తి’ యొక్క మునుపటి వెర్షన్ యొక్క ఫలితాల విడుద‌ల త్వరలోనే - శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

Posted On: 23 JUN 2020 6:14PM by PIB Hyderabad

            కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు యుక్తి 2.0ను ప్రారంభించారు. ఇది మన ఉన్నత విద్యా సంస్థలలో ఒదిగే స్టార్టప్‌లకు సంబంధించిన వాణిజ్య సామర్థ్యాల‌ను మరియు సమాచారాన్ని కలిగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రమపద్ధతిన‌ సమీకరించడంలో ఇది సహాయ ప‌డ‌నుంది. హెచ్‌ఆర్‌డీ స‌హాయ‌ మంత్రి శ్రీ సంజయ్ షమరావు ధోత్రే, అదనపు కార్యదర్శి (ఉన్నత విద్య) చైర్మన్ శ్రీ రాకేశ్ రంజన్, ఏఐసీటీఈ సంస్థ చైర్మ‌న్  సభ్యుడు ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే, ఏఐసీటీఈ మెంబ‌ర్ సెక్రెట‌రీ డాక్టర్ రాజీవ్ ‌కుమార్, ఎంహెచ్‌ఆర్‌డీ ఇన్నోవేషన్ సెల్ విభాగపు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ అభయ్‌జెరీలు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమానికి హాజ‌రు అయ్యారు.

            మంత్రి అంత‌కు ముందు ఏప్రిల్ 11న యుక్తి (యంగ్ ఇండియా కంబాటింగ్‌ కోవిడ్ విత్ నాలెడ్జ్, టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్‌) వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్ దృష్ట్యా హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్‌ను సిద్ధం చేసింది. కోవిడ్ -19 సవాళ్ల యొక్క విభిన్న కోణాలను చాలా క్షుణ్ణంగాను మరియు చాలా సమగ్రంగా కవర్ చేయ‌డం ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం. పోర్టల్ ద్వారా, ఉన్నత విద్యా సంస్థలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పరిశోధకులు వారి సాంకేతిక పరిజ్ఞానాలు మరియు ఆవిష్కరణలను ముందుకు తీసుకుపోవ‌డానికి గాను కావాల్సిన అవసరాలను తీర్చడానికి తగిన మద్దతు ల‌భించేలా చూసేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుంది.

Launch of YUKTI 2.0 https://t.co/8EK9oN22NR

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 23, 2020

 

            ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి మంత్రి శ్రీ పోఖ్రియాల్ మాట్లాడుతూ యుక్తి 2.0, అనేది కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన ప‌లు ఆలోచనలను గుర్తించడానికి ఎంహెచ్ఆర్‌డీ చొరవ ఇది అన్నారు. యుక్తి యొక్క మునుపటి చొర‌వకు ఇది తార్కిక పొడిగింపు అని అన్నారు. గ‌తంలో అందుబాటులోకి తెచ్చిన‌‌ యుక్తి యొక్క ఫ‌లితాల్ని త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు.  తాజా చొరవను మంత్రి అభినందించారు. భారత్‌ను ఆత్మ నిర్భర్‌ చేయాల‌ని లక్ష్యాన్ని ప్రధాన మంత్రి త‌మ‌కు ఇచ్చారని, యుక్తి 2.0 చొరవ ఆ దిశలో చాలా ముఖ్యమైన దశ అని అన్నారు. మ‌న దేశ యువ‌త వినూత్నంగా ఆలోచించ గల సామర్థ్యంను కలిగి ఉన్నారని.. వారివారి ఆలోచనలను సంస్థలుగా మార్చడంలో వారికి సహాయపడటానికి గాను అన్ని ర‌కాలైన  ప్రయత్నాలు చేయాలని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. మరీ ముఖ్యంగా యుక్తి ‌2.0 వంటి చొరవ విద్యా సంస్థలలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత యొక్క సంస్కృతిని పెంపొందించడానికి కూడా ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

            యుక్తి పోర్టల్‌ను ప్రారంభిస్తూ మంత్రి చాలా ఆనందం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల‌ విద్యార్థులు అధ్యాపక సభ్యులు, అంకుర సంస్థలు మరియు ఉన్నత విద్యాసంస్థల ఇతర వాటాదారులు త‌మ‌ను యుక్తి పోర్టల్లో నమోదు చేసుకోవాలని మరియు వారి సాంకేతికతలు మరియు ఆవిష్కరణలను పంచుకోవాలని ఆయన ఆహ్వానించారు. ఈ ఉన్నత డేటాబేస్ మన ఉన్నత విద్యా సంస్థల ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ యొక్క స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది అని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. దేశంలో ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి అడ్డంకులను గుర్తించడానికి మరియు తగిన విధానాలను రూపొందించడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సమాజానికి పెద్ద మొత్తంలో సహాయపడేందుకు మ‌రియు సృజనాత్మక ఆవిష్కరణలు మరియు సాంకేతికతలకు మద్దతున‌కు మంత్రిత్వ శాఖ ఉత్తమమైన సహాయాన్ని అందిస్తుంది. మన ఉన్నత విద్యా వ్యవస్థలోని ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు దేశ నిర్మాణంలో యువత పాల్గొనేలా చేసేందుకు ఈ పోర్టల్ ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక చొరవ తెచ్చేందుకు కృషి చేసిన ఎంహెచ్‌ఆర్‌డీ ఇన్నోవేషన్ సెల్, ఏఐసీటీఈ మొత్తం బృందాన్ని హెచ్‌ఆర్‌డీ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే అభినందించారు. "వైద్య రంగంలో ఇంజినీర్లు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు మేటి అనిత‌ర సాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలకు దారితీశాయి" అని మంత్రి ధోత్రే అన్నారు. ఇలాంటి మ‌రెన్నోపరిష్కారాలను గుర్తించడానికి యుక్తి 2.0 కూడా మాకు ఎంత‌గానో సహాయ పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

            ఏఐసీటిఈ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే మాట్లాడుతూ అటువంటి వేదిక యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. విద్యావేత్తలతో పాటు వారి స్టార్టప్‌లను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థి పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వవలసిన అవసరాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. ఔత్సాహికుల‌కు యుక్తి 2.0 మార్కెట్ ప్రదేశంగా ఉద్భవించాల్సిన అవసరం ఉందని ఎంహెచ్‌ఆర్‌డీ అదనపు కార్యదర్శి రాకేశ్ రాజన్ తెలిపారు. మ‌నదేశంలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టుబడిదారులతో అనుసంధానం చేయడం, తద్వారా దానిని వాణిజ్యీకరణం చేయ‌డం ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్లవచ్చున‌ని అన్నారు.

 

మరిన్ని వివరాల కోసం www.mind.mic.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి

*****


(Release ID: 1633793) Visitor Counter : 275