వ్యవసాయ మంత్రిత్వ శాఖ
జోరందుకున్న మిడతల నియంత్రణ కార్యకలాపాలు
రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌ల రాష్ట్ర వ్యవసాయ శాఖలు, స్థానిక పరిపాలన విభాగాలు మరియు బీఎస్ఎఫ్ వారి సమన్వయంతో చర్యలు
21.06.2020 నాటికి, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని 1,14,026 హెక్టార్ల ప్రాంతంలో మిడతల నియంత్రణ
వాహనాలతో నియంత్రిత కార్యకలాపాలు, వాహనాలపై స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, ఫైర్ టెండర్ వాహనాలు మరియు డ్రోన్ల సహాయంతో మిడతల నియంత్రణ చర్యలు
Posted On:
22 JUN 2020 7:38PM by PIB Hyderabad
మిడతల నియంత్రణ చర్యలు ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్య ప్రదేశ్‌లలో జోరందుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో లోకస్ట్ సర్కిల్ కార్యాలయాలు 62 పిచికారి పరికరాలను (21 మైక్రోనైర్ మరియు 41 ఉల్వామాస్ట్ ) ఇందుకు వినియోగిస్తున్నాయి. మిడతల హెచ్చరిక సంస్థలు దాదాపు 200 మంది ఉద్యోగులు సర్వే మరియు నియంత్రణ పనులను నిర్వహించడానికి రంగంలోకి దిగారు. మొత్తం పది లోకస్ట్ సర్కిల్ కార్యాలయాల్లో మరియు జోధ్‌పూర్‌లోని ఎల్‌డబ్ల్యూఓ వద్ద కూడా ఈ పనుల నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. నియంత్రిత ఎడారి ప్రాంతానికి మించి, రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, దౌసా మరియు చిత్తోర్‌గర్ వద్ద తాత్కాలిక బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి; మధ్యప్రదేశ్‌లోని శివపురి; మరియు ఎడారి మిడత (డిసర్ట్ లోకస్ట్) యొక్క సమర్థవంతమైన నియంత్రణ కోసం ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ వద్ద కూడా వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు, స్థానిక పరిపాలన మరియు బీఎస్ఎఫ్ వారి తగిన సహకారం, సమన్వయంతో నియంత్రణ పనులు జోరందుకున్నాయి.
రోజువారీ మిడత నియంత్రణ కార్యకలాపాలు భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల నుండి రెండు మిడత సమూహాలు దేశంలోకి వస్తున్నట్టుగా నివేదికలందాయి. ఇందులో బికనేర్, శ్రీగంగనగర్ జిల్లాలో ఒక్కొక్కటిని గుర్తించారు. ఈ రెండు సమూహాలకు వ్యతిరేకంగా నియంత్రణ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రస్తుతం, పరిపక్వ పసుపు రంగు మిడతలు మరియు అపరిపక్వ గులాబీ రంగు మిడతలు పెద్ద సంఖ్యలో జైసల్మేర్, బార్మెర్, జోధ్పూర్, బికనీర్, శ్రీ గంగానగర్, జైపూర్, నాగౌర్ మరియు రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలు, మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా మరియు ఉత్తర ప్రదేశ్ లోని లలిత్పూర్ జిల్లాలలో చురుకుగా కదలాడుతున్నట్టు గుర్తించారు. ప్రతిరోజు ఉదయం వాహనాలకు అమర్చిన స్ప్రేయర్లు, ట్రాక్టర్లు మరియు ఫైర్ టెండర్ వాహనాల సహాయంతో రోజువారీ మిడత నియంత్రణ కార్యకలాపాలు చేపడుతున్నారు. మిడతల నియంత్రణ కార్యకలాపాలను జిల్లా పరిపాలన మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధిత అధికారుల సహకారం మరియు సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 2142 ట్రాక్టర్లు, 46 ఫైర్ బ్రిగేడ్ వాహనాలను, మధ్యప్రదేశ్‌లో మొత్తంగా 83 ట్రాక్టర్లు, 47 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, ఉత్తరప్రదేశ్ 4 ట్రాక్టర్లు మరియు 16 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, పంజాబ్ మొత్తంగా 50 ట్రాక్టర్లను మరియు 6 ఫైర్ బ్రిగేడ్ వాహనాలను, గుజరాత్ 38 ట్రాక్టర్లను మిడత నియంత్రణకు మొహరించారు. దేశంలో అపరిపక్వ మిడతలు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ కారణంగా వాహనా ప్రదేశంలో సమూహాన్ని నియంత్రించడం కష్టతరంగా ఉంది, ఈ కారణంగా మిడతల సంఖ్యను పూర్తిగా తొలగించడానికి వివిధ ప్రదేశాల్లో 4 నుండి 5 రోజులు పడుతుంది.
బ్రిటన్‌కు చెందిన కంపెనీ నుంచి పరికరాలు మిడతల నియంత్రణకు దాదాపుగా 60 అదనపు స్ప్రేయర్ల సరఫరా నిమిత్తం బ్రిటన్‌కు చెందిన మెస్సర్స్ మైక్రాన్‌కు ఆర్డర్ ఇవ్వడమైంది. మే 22న సరఫరా ప్రణాళిక వివరాలను చర్చించడానికి మైక్రాన్ మరియు ఇండియన్ హై కమిషన్ ప్రతినిధులతో యుకేలో ఒక వీసీని కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు 15 పరికరాలు భారత్‌కు చేరుకున్నాయి. వీటితో మిడతల నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మిగతా పరికరాల పంపిణీ కూడా నిర్ణీత సమయంలో షెడ్యూల్ చేయబడింది.
అటామైజర్ కిట్ల సప్లయికి ఆర్డర్‌బ్రిటన్ ఆధారిత సంస్థ నుండి వైమానిక స్ప్రే సామర్ధ్యాల కోసం జీపీఎస్ ట్రాకర్లతో 5 సీడీ అటామైజర్ కిట్ల సప్లయి ఆర్డర్‌ను కూడా భారత ప్రభుత్వం జారీ చేసింది. మొదటి రెండు కిట్లు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అందుబాటులోకి రానున్నాయి. వీటిని పరీక్షించిన ఒక నెల తర్వాత మిగిలిన మూడు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కిట్లు భారత వైమానిక దళం యొక్క హెలికాప్టర్లలో అమర్చబడతాయి (వారు అంగీకరం మేరకు) వీటిని ఎడారి మిడతలను నియంత్రించేలా వాయు కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ప్రాప్యత చేయలేని ప్రదేశాలలో మరియు పొడవైన చెట్ల పైన మిడతలను సమర్థవంతంగా నియంత్రించడానికి డ్రోన్ల వాడకాన్ని వినియోగించే దిశగా యోచన చేస్తున్నారు.
మిడతల నివారణకు గాను పురుగుమందుల వైమానిక స్ప్రే కోసం డ్రోన్ల సేవలను అందించడానికి ఈ-టెండర్ ఆహ్వానించబడింది.
డ్రోన్ల సహాయంతోనూ నియంత్రణ దేశంలో మిడత నియంత్రణకు షరతులతో కూడిన మినహాయింపులకు గాను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదించింది. మిడతల నియంత్రణ చర్యగా వైమానిక నియంత్రణ సామర్ధ్యం యొక్క అవకాశాన్ని అంచనా వేయడానికి మరియు సులభతరం చేయడానికి గాను డీఏసీ మరియు ఎఫ్‌డబ్ల్యూ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. దీని సిఫారసు మేరకు 06.06.2020న 5 కంపెనీలకు డ్రోన్‌ల వాడకం కోసం వర్క్ ఆర్డర్ జారీ చేయబడింది. ఈ కంపెనీలు బార్మెర్, జైసల్మేర్, ఫలోడి, బికనీర్ మరియు నాగౌర్ ప్రాంతాల్లో పనిని ప్రారంభించాయి మరియు ఇప్పటి వరకు 12 డ్రోన్లను మోహరించారు. నియంత్రణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 55 అదనపు వాహనాల కొనుగోలుకు సరఫరా ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి. మిడత నియంత్రణ కార్యకలాపాలలో 33 వాహనాలు పంపిణీ చేయబడ్డాయి. పరిస్థితిని ఉన్నత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు మరియు అవసరమైన కార్యకలాపాలు ప్రాధాన్యత ప్రాతిపదికన జరుగుతున్నాయి.
21.06.2020 నాటికి, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని 1,14,026 హెక్టార్ల ప్రాంతంలో మిడతల నియంత్రణ జరిగింది. నియంత్రణ చర్యలు చేపట్టిన కార్యక్రమాల వివరాలను
ఈ కింది పట్టికలో అందించబడింది.
నియంత్రణ డేటా యొక్క జిల్లా వారీ సారాంశం (21.06.2020 నాటికి)
క్రమ సంఖ్య
|
జిల్లా పేరు
|
స్పాట్‌ల సంఖ్య
|
నివారణ చర్యలు చేపట్టిన ప్రాంతం (హెక్టార్లు)
|
-
|
అజ్మీర్
|
24
|
5339
|
-
|
ఆల్వార్
|
2
|
185
|
-
|
బార్మర్
|
144
|
19750
|
-
|
బిల్వారా
|
13
|
2505
|
-
|
బికనీర్
|
49
|
8564
|
-
|
బుందీ
|
2
|
235
|
-
|
చిత్తోర్‌గర్
|
12
|
2235
|
-
|
చురు
|
4
|
830
|
-
|
దౌసా
|
7
|
2135
|
-
|
హనుమాన్‌గర్
|
4
|
575
|
-
|
జైపూర్
|
12
|
2435
|
-
|
జైసల్మేర్
|
74
|
10609
|
-
|
జలోర్
|
8
|
1444
|
-
|
జలావర్
|
1
|
205
|
-
|
ఝున్‌ఝునూ
|
1
|
60
|
-
|
జోధ్‌పూర్
|
103
|
16645
|
-
|
కరౌలీ
|
1
|
25
|
-
|
కోట
|
3
|
505
|
-
|
నాగౌర్
|
56
|
10490
|
-
|
పాలీ
|
15
|
1985
|
-
|
ప్రతాప్‌గర్
|
2
|
370
|
-
|
సవాయ్ మధోపూర్
|
1
|
130
|
-
|
సికార్
|
5
|
1110
|
-
|
సిరోహీ
|
3
|
560
|
-
|
శ్రీ గంగా నగర్
|
68
|
4875
|
-
|
టోన్క్
|
2
|
425
|
-
|
ఉదయ్‌పూర్
|
3
|
715
|
-
|
ఫిజిల్‌కా
|
20
|
640
|
-
|
బనాస్‌కంతా
|
7
|
225
|
-
|
కచ్
|
10
|
560
|
-
|
మేసనా
|
2
|
190
|
-
|
పఠాన్
|
2
|
55
|
-
|
సబర్‌కంటా
|
1
|
40
|
-
|
బాందా
|
1
|
100
|
-
|
హమీర్‌పూర్
|
1
|
90
|
-
|
ఝాన్సీ
|
3
|
255
|
-
|
లలిత్‌పూర్
|
2
|
235
|
-
|
మహోబా
|
2
|
170
|
-
|
ప్రయాగ్‌రాజ్
|
2
|
170
|
-
|
సోమ్‌భద్ర
|
1
|
10
|
-
|
అమరావతి
|
3
|
146
|
-
|
బంధారా
|
4
|
410
|
-
|
గోండియా
|
3
|
470
|
-
|
నాగ్‌పూర్
|
11
|
409
|
-
|
అగర్ మాల్వా
|
4
|
292
|
-
|
అనుప్పూర్
|
1
|
60
|
-
|
అశోక్‌నగర్
|
13
|
895
|
-
|
బాలాఘాట్
|
3
|
262
|
-
|
బేతూల్
|
6
|
201
|
-
|
భోపాల్
|
6
|
340
|
-
|
ఛత్తార్‌పూర్
|
9
|
485
|
-
|
చింద్వారా
|
9
|
156
|
-
|
దామోహ్
|
6
|
472
|
-
|
దేవాస్
|
5
|
210
|
-
|
దిన్దోరీ
|
1
|
7
|
-
|
గుణ
|
5
|
332
|
-
|
గ్వాలియర్
|
2
|
120
|
-
|
హర్ధా
|
3
|
239
|
-
|
హోషంగాబాద్
|
2
|
150
|
-
|
జబల్‌పూర్
|
2
|
37
|
-
|
కంద్‌వా
|
3
|
124
|
-
|
కర్గాన్
|
1
|
150
|
-
|
మంద్‌లా
|
8
|
328
|
-
|
మంద్‌సూయార్
|
5
|
1075
|
-
|
మొరేనా
|
4
|
279
|
-
|
నీమూచీ
|
9
|
1316
|
-
|
నివారీ
|
4
|
300
|
-
|
పన్నా
|
4
|
185
|
-
|
రైసెన్
|
4
|
88
|
-
|
రాజ్‌ఘర్
|
6
|
152
|
-
|
రత్లామ్
|
5
|
816
|
-
|
రెవా
|
3
|
127
|
-
|
సాగర్
|
3
|
139
|
-
|
సత్‌నా
|
14
|
565
|
-
|
సెహోర్
|
3
|
147
|
-
|
సియోనీ
|
3
|
187
|
-
|
సహదోల్
|
3
|
29
|
-
|
షియోపూర్
|
5
|
223
|
-
|
షాజాపూర్
|
2
|
52
|
-
|
శివ్‌పురి
|
24
|
1566
|
-
|
సిద్ది
|
6
|
156
|
-
|
ఉజ్జయిన్
|
5
|
1853
|
-
|
విదిశా
|
10
|
713
|
-
|
కబీర్‌దామ్
|
4
|
82
|
|
|
909
|
114026
|
****
(Release ID: 1633478)
Visitor Counter : 194