శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నక్షత్రాలు వయసుతో నిమిత్తం లేకుండా విశాలమైన తారా సముచ్ఛయాలుగా ఉండవచ్చునని, దీనివల్ల పాలపుంత నక్షత్ర వీధిలో గ్రహ పరిణామానికి ఓ దారి దొరకవచ్చునని ఓ అధ్యయనంలో తేలింది
Posted On:
21 JUN 2020 5:52PM by PIB Hyderabad
నక్షత్రాలు వయసుతో నిమిత్తం లేకుండా విశాలమైన తారా సముచ్ఛయాలుగా ఉండవచ్చు. దీనివల్ల పాలపుంత నక్షత్ర వీధిలో గ్రహ పరిణామానికి ఓ దారి దొరకవచ్చు. మన నక్షత్ర వీధిలో ఉన్న పరమాణు మేఘాలవల్ల తారలు ఏర్పడతాయి. మన నక్షత్ర వీధిలో ఎక్కువ నక్షత్రాలు తారా సముచ్ఛయంలోనే ఏర్పడతాయనీ దీనివల్ల నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
విశాల తారా సముచ్ఛయాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఏర్పడతాయి. ఇవి పరమాణు మేఘాల ద్వారా ఏర్పడతాయి. ఒక సముచ్ఛయంలోని నక్షత్రాలన్నీ వాటి మొదటి ద్రవ్యరాశి ఆధారంగా పరిణామాత్మక క్రమాన్ని సంతరించుకుంటాయి. ఇది వాటికి మొదట ఉన్న ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. విశాలమైన తారా సముచ్ఛయాలు పాలపుంత నక్షత్ర వీధిలో నక్షత్రాల ఏర్పాటును, పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది. ఎందుకంటే ఇవి నక్షత్ర వీధి మండలం నిండా వ్యాపించి ఉంటాయి. ఆర్యభట్ట పరిశీలక శాస్త్ర పరిశోధనా సంస్థ (ఎ.ఆర్.ఐ.ఇ.ఎస్.) లోని ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్ర సముచ్ఛయాల్లో వివిధ వయసులుగల నక్షత్రాలు కలగలసి ఉండవచ్చునని కనుగొన్నారు. ఈ పరిశోధనా సంస్థ భారత ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక విభాగం లో ఉన్న స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ముందు విశాల తారా సముచ్ఛయంలో ఉండే నక్షత్రాలన్నీ ఒకే వయసు గలవి అని ఇంతకు ముందున్న అభిప్రాయాన్ని తాజా పరిశీలన తోసిపుచ్చుతోంది.
ఎన్.జి.సి.381, ఎన్.జి.సి 2360, బర్క్లీ 68 అనే మూడు విశాల తారా సముచ్ఛయాల కాంతిని కొలిచారు. ఈ తారా సముచ్ఛయాల గురించి ఎక్కువగా అధ్యయనం జరగలేదు. హిమాలయ పర్వత సానువుల్లో దేవస్థల్ దగ్గర ఉన్న 1.3-ఎం టెలిస్కోప్ ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఈ నక్షత్ర సముచ్ఛయాల పరిణామక్రమాన్ని అధ్యయనం చేశారు. ఎన్.జి.సి.2360 సముచ్ఛయంలో రెండు భిన్నమైన నక్షత్ర సంబంధ పరిణామ క్రమాలు ఉన్నట్టు ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలపుంత నక్షత్ర వీధిలో ఇలాంటి విశాల తారా సముచ్ఛయాలు తక్కువే. విశాల తారా సముచ్ఛయాలైన ఎన్.జి.సి. 381, ఎన్.జి.సి. 2360, బర్క్లీ 68లో వేలాది నక్షత్రాలు ఉన్నట్టు ఖగోళశాస్త్రవేత్త డా. యోగేశ్ జోషి, ఆయన పరిశోధక విద్యార్థి జయానంద్ మౌర్య కనుగొన్నారు. ఈ తారా సముచ్ఛయాలు సాపేక్షికంగా ప్రాచీనమైనవే. అంటే వీటి వయస్సు 446 మిలియన్ సంవత్సరాల నుంచి 1778 మిలియన్ సంవత్సరాలు ఉంటుంది. నక్షత్రాల పరిణామక్రమాన్నే కాకుండా ఈ పరిశోధకులు ఈ సముచ్ఛయాల గతిశీల పరిణామక్రమాన్ని కూడా మొట్టమొదటి సారి అధ్యయనం చేశారు. ఈ సముచ్ఛయాలకు చెందిన నక్షత్రాల ద్రవ్య రాశిని పరిశీలిస్తే అంతర్భాగంలో ఉన్న పెద్ద నక్షత్రాల ద్రవ్య రాశి ఎక్కువగా ఉన్నట్టు తేలింది. తక్కువ ద్రవ్య రాశి ఉన్న నక్షత్రాలు సముచ్ఛయాల వెలుపలి వైపున ఉన్నాయి.
తక్కువ ద్రవ్య రాశి ఉన్న నక్షత్రాలు తాము ఇంతకు ముందున్న సముచ్ఛయాలను వదిలేసి సూర్యుడిలాగా యదేచ్ఛగా తిరుగుతున్నట్టు కూడా ఈ పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంవల్ల నక్షత్రాల, గతిశీల పరిణామక్రమం గురించి లోతైన అంశాలు తెలిశాయి. విశాల తారా సముచ్ఛయాలు మరి కొన్నింటిని అధ్యయనం చేయాలని ఈ పరిశోధకులు భావిస్తున్నారు. తమ సంస్థల్లో ఉన్న పరిశోధక ఉపకరణాలను వినియోగించి ఈ అధ్యయనం కొనసాగిస్తారు. అంతరిక్ష యాత్రలు సమకూర్చిన అదనపు సమాచారాన్ని కూడా వినియోగించుకుంటారు. యు.కె.లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రాలకు సంబంధించిన రాయల్ అస్ట్రొనామికల్ సొసైటీ ప్రచురించే మంత్లీ నోటీసెస్ సంచికలో ఈ పరిశోధనా ఫలితాలు వెల్లడించారు.
(Publication: Monthly Notices of the Royal Astronomical Society, Volume 494, pp. 4713, April 2020.
For more details, Dr. Yogesh Chandra Joshi (yogesh@aries.res.in) can be contacted.)
*****
(Release ID: 1633270)
Visitor Counter : 278