పర్యటక మంత్రిత్వ శాఖ
దేఖో అప్నా దేశ్ వెబినార్ సీరీస్ క్రింద “ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో ఒక నివేదన ”- యోగా & వెల్నెస్ అనే 33వ వెబినార్ను నిర్వహించిన కేంద్ర పర్యాటక శాఖ
శ్వాస సంబంధిత ఆరోగ్య పరిరక్షణకు మరియు రోగ నిరోధకత పెంచుకోవడానికి యోగాను ఒక సాధనంగా మలచుటపై ఈ వెబినార్ దృష్టి ముఖ్యంగా సారించింది
Posted On:
20 JUN 2020 2:49PM by PIB Hyderabad
దేఖో అప్నా దేశ్ 33వ వెబినార్ సీరీస్ క్రింద కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జూన్ 19 2020న యోగా మరియు వెల్నెస్ శీర్షికలో “ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో ఒక నివేదన” నిర్వహించిన కార్యక్రమం శ్వాస సంబంధిత ఆరోగ్య పరిరక్షణకు మరియు రోగ నిరోధకత పెంపుపై ముఖ్యంగా దృష్టిసారించింది. విశ్వ మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ అంటువ్యాధి సోకకుండా అరికట్టడం మరియు సోకిన తరువాత అందులో నుండి కోలుకోవడం ఇందులో ముఖ్య భాగాలు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం క్రింద విశ్వమహమ్మారిని అడ్డుకోవడానికి భారత్ చేపడుతున్న చర్యలను ఈ దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ చూపుతుంది.
జూన్ 19 2020న నిర్వహించిన ఈ వెబినార్ సిరీస్లో ముగ్గుర ప్రముఖ యోగా గురువులు, ప్రపంచ స్థాయి యోగా సాధకులు మరియు ఆధ్యాత్మిక గురువు భరత్ ఠాకూర్, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ ఉప కులపతి డా. చిన్మయ పాండ్య, నాడి విజ్ఞానములో నిపుణులు డా. లక్ష్మినారయణ్ జోషి పాల్గొని ఆరోగ్యకరమైన, సంతోషదాయకమైన మరియు ఒత్తిడి లేని జీవనానికి ప్రాచీన యోగా విజ్ఞానము ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంపై కూలంకుషంగా మాట్లాడారు.
డా. లక్ష్మినారాయణ్ జోషి తన ప్రసంగంలో రిషీకేష్ ను ప్రపంచ యోగా రాజధానిగా పేర్కొన్నారు. ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన నాడి విద్య గురించి ఆయన ప్రసంగించారరు. సంస్కృతంలో నాడి అనగా నాళము లేదా గొట్టము కానీ నాళము అనేది శక్తిని అనగా ప్రాణాన్ని తీసుకు వెళ్ళే మార్గంగా చెప్పబడింది, జీవాత్మ మరియు ఈ ప్రాణం రెండూ శరీరంలో పలు చోట్ల కలిసే స్థానాలను నాడి చక్రాలు అంటారు. మొత్తం శరీరంలో 72000 నాడీ చక్రాలు ఉండగా అందులో 7 ప్రధానమైనవి అందులో 3 కీలకమైనవి. కీలకమైన ఈ 3 నాడులు వెన్ను నుండి తలవరకు ఉంటాయి, ఎడమ వైపు నాడి ఇదా, మధ్యలోనిది సుషుమ్న మరియు కుడివైపు నాడి పింగళ. కాగా యోగా సాధనలో నాడి కీలక పాత్రను పోషిస్తుంది, ’షట్కర్మలు’, ’ముద్రలు’ మరియు ’ప్రాణాయామం’లో మూసుకుపోయిన నాడులను తెరచేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నాడీ విద్యతో శరీర సమరేఖనం, స్థితి మరియు తగిన రక్త ప్రసరణ వంటివి ఈ నాడీ విద్య ద్వారా సాధ్యమవుతాయి.
స్వామీ వివేకానంద ప్రసంగంలోని ప్రముఖ వాక్యాలైన ’’ప్రతీ ఆత్మ దైవికమైనదే. విశ్వంలోని అన్ని శక్తులూ ఇంతకు మునుపే మనలో ఉన్నాయి. కానీ ఆ వెలుగును గుర్తించలేక మనం మన కళ్ళకు చేతులను అడ్డుపెట్టుకుని చీకటిగా భావించి ఏడుస్తున్నాము’’ అని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు డా. చిన్మయ్ పాండ్య.
ఆయన ప్రకారం యోగా అనేది వ్యక్తిలో సకారాత్మక మార్పును తెచ్చి సరియైన దిశలో నడిపించేది. జీవితం యొక్క ముఖ్య లక్ష్యం స్వకీయమైన జ్ఞానం మరియు ఆత్మ యొక్క పరిశుద్ధత. అదియే మనం ఈ భూమి మీదకు వచ్చిన ముఖ్య కారణంగా గుర్తించవలసింది. విశ్వంలో వివిధ రకాల జీవాలు ఉండగా మానవుడు మాత్రమే ఈ రకమైన జ్ఞానం మరియు ఆత్మ పరిశీలన ఉండి అన్ని రకాల జీవాలను పాలించే సర్వోత్కృష్ట అధికారం పొందాడు.
యోగా గురు భరత్ ఠాకూర్ మాట్లాడుతూ యోగా 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగాన ప్రాచీన విజ్ఞానశాస్త్రం, జీవితానికి పరమార్థం వెతుక్కుంటూ ఎందరో యోగులు హిమాలయాల్లో తపస్సుతో సాధనచేసారు. ప్రస్తుత కాలంలో పిల్లల నుండి వయోజనుల వరకు చాలా మంది భౌతిక, మానసిక, ఉద్విగ్న మరియు ఆధ్యాత్మిక క్షేమం కోసం యోగా సాధన చేస్తున్నారు.
యోగా యొక్క ముఖ్య లక్ష్యం అన్ని కోణాల్లో మానవుని పూర్తి వికాసం. ప్రస్తుత విపత్కర విశ్వమహమ్మారిని తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు మరియు ప్రాణాయామం ఎంతో ఉపరిస్తాయని, వాటి ద్వారా భౌతికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మిక పరంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని శ్రీ భరత్ ఠాకూర్ అన్నారు.
జాతీయ పరిపాలనా విభాగం(ఎన్జిడి)వారి సంయుక్త సహకారంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఇఐటివై) వారు దేఖో అప్నా దేశ్ వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వెబినార్ కార్యక్రమం ఇపుడు https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured వెబ్సైట్లో మరియు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లైన incredibleindia.org మరియు tourism.gov.in లలో చూడవచ్చు మరియు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు నిర్వహించే అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ లభ్యం.
దేఖో అప్నా దేశ్ క్రింద కేంద్ర పర్యాటక శాఖ వారి తదుపరి కార్యక్రమం సద్గురు జగ్గీ వాసుదేవ్తో సంభాషణ. ’భారత్: సాంస్కృతిక నిధి’ అనే శీర్షికన 20 జూన్ 2020న మధ్యహ్నాం 2.00 నుండి 3.00 గం వరకు నిర్వహించబడు ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు(స్వతంత్ర ప్రతిపత్తి) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ మరో ప్రముఖ సభ్యుల మండలితో కూడి ఈ సంభాషణను సాగిస్తారు. ఇందులో స్పైస్ జెట్ సిఎండి శ్రీ అజయ్ సింగ్, ఓయో శ్రీ రితేష్ అగర్వాల్, ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే, ప్రముఖ చెఫ్ శ్రీ రన్వీర్ బ్రార్, మారియట్ మార్కెటింగ్ ఉపాధ్యక్షులు రన్జు అలెక్స్ ఇందులో పాల్గొంటారు.
ఈ కార్యక్రమం ఇంక్రెడిబుల్ ఇండియా సామాజిక మాధ్యమం నిర్వహించే facebook.com/incredibleindia/ మరియు Youtube.com/incredibleindia లలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.
(Release ID: 1633007)
Visitor Counter : 155