నీతి ఆయోగ్
ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ చొరవను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌తో అటల్ ఇన్నొవేషన్ మిషన్ భాగస్వామ్యం
Posted On:
20 JUN 2020 3:01PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఫ్లాగ్ మిషన్ అయిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ , దేశవ్యాప్తంగా చేపట్టే ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ కార్యక్రమాలకు సానుకూల మద్దతు తెలిపేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ ముందుకు వచ్చింది. అటల్ ఇన్నొవేషన్ మిషన్‌తో ఇది భాగస్వామ్యం వహించేందుకు అంగీకరించింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం)కు , కోల్ ఇండియా లిమిటెడ్ కు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనపై సంతకాలు జరిగాయి. ఇందుకు సంబంధించి జూన్ 19న జరిగిన వర్చువల్ సమ్మిట్‌లో పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం)కు పలు ఆవిష్కరణల కార్యక్రమాలు, ఎంటర్‌ప్రెన్యూరియల్ వాతావరణాన్ని నిర్మించే పలు చర్యలు ఉన్నాయి.అవి పాఠశాల స్థాయిలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు (ఎటిఎల్), సంస్థాగత స్థాయిలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు (ఎఐసి), గ్రామీణ భారతావని, 2 టైర్, 3 టైర్ నగరాలకు అటల్ కమ్యూనిటీ సెంటర్లు (ఎసిఐసి), పరిశ్రమల స్థాయిలో అటల్ న్యూ ఇండియా సవాళ్లు, ఎం.ఎస్.ఎం.ఇ రంగంలో ఆవిష్కరణల ఉద్దీపనకు అనువర్తిత పరిశోధన, ఇన్నొవేషన్ (ఎఆర్ ఐ ఎస్ఇ) కార్యక్రమాలు ఉన్నాయి.
సిఐఎల్, ఎఐఎం ల మధ్య కొలాబరేషన్ కింద పైన పేర్కొన్న ఎఐఎం కార్యక్రమాలు, నవకల్పనల కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించడానికి , దీనిపై అవగాహనను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడానికి ఇది ఉపకరిస్తుంది.
ఉభయ సంస్థల మధ్య ఇందుకు సంబంధించి వర్చువల్ వ్యూహాత్మక ఆసక్తి వ్యక్తీకరణ(ఎస్.ఒ.ఐ) పత్రాలపై నీతిఆయోగ్ అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరక్టర్ శ్రీ ఆర్. రమణన్ , కోల్ ఇండియా లిమిటెడ్ (టెక్నికల్) డైరక్టర్ శ్రీ బినయ్ దయాల్ సంతకాలు చేశారు. కోల్ ఇండియా ఛైర్మన్ ,మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ సమక్షంలో వారు ఈ సంతకాలు చేశారు.
“ సి.ఐ.ఎల్ తో ,ఎస్ఒఐ పై సంతకాలు జరగడం చరిత్రాత్మకమైన , చిరస్మరణీయమైన సందర్భం.ఎ.ఐ.ఎంతో సిఐఎల్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉంది. దేశంలో ప్రతిభ గల యువతకి ఆవిష్కరణలలో సహాయపడుతూ, గొప్ప ఆవిష్కరణలకు దోహదపడడం ద్వారా ఆత్మనిర్భర భారత్‌కు ఇది వీలు కల్పిస్తుంది” అని ఎఐఎం నీతి ఆయోగ్ మిషన్ డైరక్టర్ చెప్పారు. దేశంలో అభివృద్ధికి నోచుకోని, తక్కువ అభివృద్ధి కలిగిన ప్రాంతాలకు ఈ భాగస్వామ్యం అద్భుత వేదికగా ఉపయోగపడుతుందని శ్రీ రమణన్ చెప్పారు. దీని ద్వారా సాధించే వినూత్న ఆవిష్కరణలు , ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ వంటివి రానున్న రోజులలో స్థానికంగా ముమ్మర ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని ఆయన అన్నారు.
కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ ,ఎస్ఒఐ పై సంతకం సందర్భంగా మాట్లాడుతూ “ సిఐఎల్ సంస్థ ఎఐఎం, నీతిఆయోగ్ తో భాగస్వామ్యాన్ని సగర్వంగా ప్రకటిస్తున్ననదని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు తాము ఆసక్తితో ఉన్నామని చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశ ఆవిష్కరణల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయనున్నద”ని చెప్పారు.
ఇదిలా ఉండగా, సిఐఎల్,ఎఐఎం లమద్య సంతకాలు జరిగిన ఎస్.ఒ.ఐ ప్రకారం, ఈ భాగస్వామ్యాన్ని కార్యక్రమాల వారీగా వర్గీకరించడం జరిగింది. ఇందులో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఎటిఎల్ ) కార్యక్రమం కింద సిఐఎల్ ఎంపిక చేసిన ఎటిఎల్ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు అంగీకరించింది. దీనిద్వారా టీచర్ ట్రైనింగ్ సెషన్‌లు నిర్వహించడంలో , ఎటిఎల్ విద్యార్ధులకు మెంటార్స్ ఆఫ్ ఛేంజ్ ద్వారా మెంటారింగ్ మద్దతు కల్పించడంలో సహాయం చేస్తారు.
ఇలాగే అటల్ కమ్యూనిటీ ఇన్నొవేషన్ సెంటర్స్ (ఎసిఐసి) ల కింద, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) తమ కార్యకలాపాలకు దగ్గరగా ఉన్నచోట ఎసిఐసిలన దత్తత తీసుకుని వాటికి మద్దతు నిచ్చేందుకు అంగీకరించింది. దీని ద్వారా యువత సమాజానికి సంబంధించిన ఆవిష్కరణలు సాధించే క్రమంలో వారికి చేయూతనివ్వడం, కమ్యూనిటీ ఇన్నొవేషన్ సవాళ్లను పరిష్కరించడం, దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో చేపడుతున్న ఆవిష్కరణలకు సంబంధించిన వ్యవస్థల ప్రభావాన్ని వ్యాప్తి చేయడానికి ఇతర ఆవిష్కరణల ఆధారిత ఈవెంట్‌లను నిర్వహించడం జరుగుతుంది.
(Release ID: 1632962)
Visitor Counter : 312