సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
భారత టెక్నికల్, ఆర్థిక సహకార (ఐటిఇసి) సంస్థ - జాతీయ సత్పరిపాలన జాతీయ కేంద్రంలో కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన కల్లోలిత సమయంలో సత్పరిపాలన విధానాలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సివిల్ అధికారుల వర్క్ షాప్ ముగింపు సమావేశంలో డిఏపిఆర్ జి కార్యదర్శి డాక్టర్ కె.శివాజీ ప్రసంగం
భారతదేశం అనుసరించిన హేతుబద్ధమైన, సమన్వయ పూర్వక, సంఘటిత వ్యూహం పటిష్ఠం, సానుకూలం అని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన వైవిధ్యభరితమైన, స్థానికంగా అనుకూలమైన వ్యూహాలు సమర్థవంతం : డాక్టర్ కె.శివాజీ
Posted On:
19 JUN 2020 10:18PM by PIB Hyderabad
కోవిడ్-19 సమయంలో సత్పరిపాలన విధానాలు అనే అంశంపై ఐటిఇసి-ఎన్ జిజిజిలో జరిగిన రెండు రోజుల వర్క్ షాప్ ముగింపు సమావేశంలో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి డాక్టర్ కె.శివాజీ శుక్రవారంనాడు వెబినార్ ద్వారా ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు భారతదేశం రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో జాతీయ స్థాయిలో హేతుబద్ధమైన, సమన్వయపూర్వక, సంఘటిత వ్యూహం అనుసరించిందని డాక్టర్ కె.శివాజీ చెప్పారు. కేసులను ప్రారంభ దశలోనే గుర్తించి ఆర్ ఏఎఫ్ (ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ) రంగుల్లో జోన్లుగా విభజించి అనుసరించిన క్లస్టర్ తరహా కట్టడి వ్యూహంలో సామాజిక దూరానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల విలువ గల స్వయంసమృద్ధ ఆర్థిక ప్యాకేజి సమ్మిళిత ఆర్థిక వృద్ధిని పునరుజ్జీవింపచేస్తుందని ఆయన అన్నారు. రాష్ర్టాలు స్థానికంగా అనుకూలమైన వైవిధ్యభరితమైన సూక్ష్మ వ్యూహాలు అనురించాయని; కేరళ, ఉత్తరప్రదేశ్, సిక్కిం, ఒడిశా, మహారాష్ట్ర నమూనాల్లో అది దృగ్గోచరం అయిందని ఆయన తెలిపారు. మహమ్మారి కల్లోలిత కాలంలో ప్రభుత్వ సేవలు అందించేందుకు, డిజిటల్ సమాచారం, టెలిమెడిసిన్ సమాచారం అందించడంలో డిజిటల్ మౌలిక వసతులు అత్యంత అనుకూలమైనవిగా నిరూపించుకున్నట్టు ఆయన వెల్లడించారు. కోవిడ్-19 సమయంలో ముందెన్నడూ కనివిని ఎరుగని స్థాయిలో ప్రజాఫిర్యాదుల సంఖ్య పెరిగిందని, కేవలం మూడు రోజుల వ్యవధిలోనే నిర్ణయాత్మకంగా, సమర్థవంతంగా వాటిని పరిష్కరించగలిగామని ఆయన చెప్పారు.
రెండు రోజుల వర్క్ షాప్ లో 18 దేశాలకు చెందిన 150 మంది అంతర్జాతీయ సివిల్ అధికారులు పాల్గొన్నారు. వారిలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, బోస్నియా & హెర్జ్ గోవినా, ఆస్ర్టియా, కెన్యా, మొరాకో, నేపాల్, ఒమన్, సోమాలియా, థాయ్ లాండ్, సోమాలియా, టునీసియా, టోంగా, సూడాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల వారున్నారు.
రెండవ రోజు వర్క్ షాప్ లో జరిగిన టెక్నికల్ సెషన్లలో ఆరోగ్య రంగం సంసిద్ధతపై జరిగిన సెషన్ కు భారత మాజీ ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి సుజాతారావు, వందే భారత్ కార్యక్రమంపై జరిగిన సెషన్ కు ఎయిరిండియా సిఎండి రాజీవ్ బన్సాల్, జిల్లా స్థాయి అత్యుత్తమ ప్రమాణాలపై జరిగిన సెషన్ కు మాజీ కేబినెట్ కార్యదర్శి శ్రీ అజిత్ శేఠ్, రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ప్రమాణాలపై జరిగిన సెషన్ కు డిఏఆర్ పిజి అదనపు కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం సమయంలో పరిపాలనా విభాగంలో భారతదేశం అనుసరించిన అత్యుత్తమ ప్రమాణాలపై ఐటిఇసి దేశాలకు సమాచారం అందంచడం, చైతన్యవంతం చేయడం లక్ష్యంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ; పరిపాలనా సంస్కరణలు & ప్రభుత్వ ఫిర్యాదుల శాఖ; నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉమ్మడిగా ఈ వర్క్ షాప్ నిర్వహించాయి. ఈ వర్క్ షాప్ లో అంతర్జాతీయ సివిల్ అధికారుల నుంచి ఎన్నో పాజిటివ్ సమీక్షలు వచ్చాయని, అంచనాలను మించి ఇది విజయం సాధించిందని డిఏఆర్ పిజి అదనపు కార్యదర్శి, ఎన్ సిజిసి డైరెక్టర్ జనరల్ శ్రీ వి.శ్రీనివాస్ చెప్పారు.
(Release ID: 1632839)
Visitor Counter : 224