భారత పోటీ ప్రోత్సాహక సంఘం

మెట్సో ఓజ్‌కు చెందిన ఖనిజాల వ్యాపారాన్ని ఔటోటెక్‌ ఓజ్‌ కొనుగోలు చేయడానికి సీసీఐ అనుమతి

Posted On: 18 JUN 2020 6:34PM by PIB Hyderabad

మెట్సో ఓజ్‌ (మెట్సో)కు చెందిన ఖనిజాల వ్యాపారాన్ని ఔటోటెక్‌ ఓజ్‌ (ఔటోటెక్‌) సంస్థ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పచ్చజెండా ఊపింది. కాంపిటీషన్ చట్టం 2002లోని సెక్షన్‌ 31(1) ప్రకారం ఈ కొనుగోలుకు ఆమోదముద్ర వేసింది.

    ప్రతిపాదిత కలయిక.., మెట్సో ఖనిజ వ్యాపారం (“మెట్సో మినరల్స్”)ను ఔటోటెక్ పొందటానికి సంబంధించినది.    మెట్సోకు చెందిన అన్ని ఆస్తులు, అప్పులు, హక్కులు, బాధ్యతలు, ఖనిజాల వ్యాపారం (గనుల తవ్వకం, కంకర, ఖనిజ వినియోగాలు, ఖనిజ సేవలు, పంపులు మరియు పునరుద్ధరణ వ్యాపారాలతో సహా) ఔటోటెక్‌కు చెందుతాయి. ఇదే ప్రతిపాదిత కలయిక.

    ఫిన్‌లాండ్‌ కంపెనీల చట్టానికి అనుగుణంగా, మెట్సో మినరల్స్ పాక్షిక విభజన ద్వారా 'ప్రతిపాదిత కలయిక' సాధ్యమవుతుంది. మెట్సో మినరల్స్‌ను ఔటోటెక్‌కు బదిలీ చేసినందుకుగాను, ఔటోటెక్‌లో కొత్తగా జారీ చేసే వాటాలను మెట్సో వాటాదారులు పొందుతారు. కొత్త షేర్లలో ఎక్కువ భాగాన్ని (సుమారు 78 శాతం) కలిగి ఉంటారు. మెట్సో ఔటోటెక్‌ పేరిట ఈ సంస్థ నడుస్తుంది. మెట్సోకు చెందిన మిగిలిన వ్యాపారాలు 'నెలెస్‌' పేరిట స్వతంత్ర్యంగా పనిచేస్తాయి.

    ఔటోటెక్‌, ఫిన్‌లాండ్‌ చట్టాల ప్రకారం స్థాపితమైన ప్రభుత్వ రంగ సంస్థ. ఔటోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, లారొక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఈ గ్రూపునకు భారతదేశంలో రెండు సంస్థలున్నాయి. ఖనిజాల ప్రాసెసింగ్‌, లోహాల శుద్ధితోపాటు సేవల రంగంలో వ్యాపారాలున్నాయి.

    మెట్సో కూడా ఫిన్‌లాండ్‌ చట్టాల ప్రకారం నమోదైన ప్రభుత్వ రంగ సంస్థ. మెట్సో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్‌ఎంఈబీఎస్‌ కంట్రోల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఈ గ్రూపునకు మన దేశంలో రెండు సంస్థలున్నాయి. మైనింగ్‌, కంకర, వాల్వ్‌ల తయారీ వ్యాపారాలను ఈ సంస్థలు చేస్తాయి.

    'కాంపిటీషన్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా నిబంధనలు-2011'లోని 25 (1ఏ) నిబంధన కింద, ఇరు పార్టీలు ప్రతిపాదించిన సవరణలకు లోబడి ప్రతిపాదిత కలయికను కమిషన్ ఆమోదించింది.


(Release ID: 1632463) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Tamil