శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారత నావికాదళం రూపొందించిన నవరక్షక్ పిపిఇ సూట్ తయారీ పరిజ్ఞానం ఐదు ఎమ్ ఎస్ ఎమ్ ఇ లకు అందజేత

Posted On: 18 JUN 2020 5:06PM by PIB Hyderabad

జాతీయ పరిశోధనా అభివృద్ధి సంస్థ ( ఎన్ ఆర్ డి సి) పిపిఇ సూట్స్ తయారీ పరిజ్ఞానపు లైసెన్స్ ను ఐదు  ఎమ్ ఎస్ ఎమ్ ఇ సంస్థలకు ఇచ్చింది. నవ రక్షక్ పేరుతో ఈ పరిజ్ఞానాన్ని అందుకుంటున్న సంస్థలలో గ్రీన్ ఫీల్డ్ విన్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ( కొల్ కతా), వైష్ణవి గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ( ముంబయ్), భారత్ సిల్క్స్ ( బెంగళూరు), ష్యూర్ సేఫ్టీ ( ఇండియా) లిమిటెడ్ ( వడోదర), స్వాప్స్ కౌచర్ ( ముంబయ్) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు నాణ్యమైన పిపిఇ సూట్స్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ఐదు సంస్థలకూ లైసెన్స్ ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఏడాదికి కోటికి పైగా ఉత్పత్తి చేయగలుగుతాయని భావిస్తున్నారు.


ఈ నవ రక్షక్ పిపిఇ తయారీ పరిజ్ఞానాన్ని భారత నౌకాదళానికి చెందిన  ముంబయ్ లోని ఐ ఎన్ హెచ్ ఎస్  ఆస్పత్రి వారి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేవల్ మెడిసిన్ ఆవిష్కరణల విభాగం అభివృద్ధి చేసింది. అందుకే దీని పేరును నవ్ రక్షక్ గా నిర్ణయించారు. పిపిఇ ల తయారీకి సంబంధించి నమూనాలను పరీక్షించి ఇప్పుడున్న ఐఎస్ వో ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరించటానికి జౌళి మంత్రిత్వశాఖ అనుమతించిన ఎన్ ఎ బి ఎల్ లాబ్స్ లో ఒకటైన డిఆర్ డిఓ వారి ఇన్మాస్  లో దీన్ని పరీక్షించి చూశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, జౌళి మంత్రిత్వశాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కృత్రిమ రక్తం చొచ్చుకుపోవటాన్ని నిరోధించగల సామర్థ్యం దీనికుందని గుర్తించారు. బట్టకు, సూట్ కి కూడా ఈ లక్షణం ఉన్నట్టు నిర్థారించుకున్నారు. 
దీనికి భారీ పెట్టుబడి అవసరం లేకపోవటం, మామూలు గౌన్ల తయారీదారులు సైతం సాధారణ కుట్టు పరిజ్ఞానంతో రూపొందించగలగటం దీని ప్రత్యేకతలు. టెక్నాలజీ, బట్ట కూడా నాణ్యమైనవి కావటం వలన కుట్టు చుట్టూ ఎలాంటి సీలింగ్ అవసరం కూడా లేదని తేల్చారు.  దీనివలన ఖరీదైన సీలింగ్ యంత్రాలు, టేపులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా ఈ బట్టకు ఎలాంటి పాలిమర్ లేదా ప్లాస్టిక్ పొరతో లామినేషన్ చేయనక్కర్లేదు. దీనివలన దీన్ని ధరించిన వారి చర్మం నుంచి వచ్చే చేడి, చెమట బయటికి వెళ్ళిపోయే వీలుంటుంది. ఒకవైపు రక్షణ ఇస్తూనే వాడే వాళ్ళ  సౌకర్యం విషయంలో రాజీపడదు. ఈ ప్రత్యేకత కారణంగా ఇది ఇప్పుడు వాడుతున్న పిపిఇ కిట్స్ కి భిన్నంగా ఉంటుంది. ఇది ఒక పొర, రెండు పొరలు అనే రెండు వెర్షన్లుగా అందుబాటులోకి వస్తుంది. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఏది ఎంచుకొవాలో నిర్ణయించుకోవచ్చు. దీనితోబాటే తలకు ధరించే పరికరాలు, ముఖానికి మాస్కులు, మోకాళ్లమీది వరకు వచ్చే షోస్ కూడా వస్తాయి.
పిపిఇ సూట్స్ కోసం దిగుమతులమీద ఆధారపడకూడదని దేశం ప్రయత్నిస్తున్న సమయంలో నాసిరకం పిపిఇ సూట్స్ మార్కెట్ ను ముంచెత్తున్నట్టు వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని చెబుతున్న సమయంలో నాణ్యమైన ఉత్పత్తులు కూడా ఎంతో అవసరం. ఈ అవసరం దృష్ట్యా నావికాదళ డాక్టర్ పిపిఇ వాడకంలో  తన వ్యక్తిగత అనుభవాన్ని ఉపయోగించి సౌకర్యవంతంగా ఎలా ఉండాలో ఆలోచించి డాక్టర్లకోసం దీన్ని రూపొంచించారు. గాలిపీల్చుకోగలగటం పెరగటమన్నది దీని పట్ల అందరూ ఆకర్షితులు కావటానికి దోహదం చేస్తుంది. చాలా గంటలపాటు ధరించి అసౌకర్యం ఎదుర్కోవాల్సినవాళ్ళకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తుల విభాగం, భాత నావికాదళం, ఎన్ ఆర్ డి సి ఉమ్మడిగా  దీని  మేధోసంపత్తి హక్కులను, వాణిజ్యపరమైన ఉత్పత్తిని నియత్రించటానికి నాణ్యతా హామీ  డైరెక్టరేట్ జనరల్ కు చెందిన మేధోసంపత్తి విభాగం సాయం తీసుకున్నాయి. కోటింగ్ అవసరం లేని, లామినేషన్ చేయనక్కర్లేని తయారు చేయగలగటం ఇదే మొదటిసారి. అందుకే దీని మేధోసంపత్తి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరముంది. దీని రూపకర్తలు నవ్ రక్షక్ పిపిఇ కోసం ఎన్ ఆర్ డి సి ద్వారా పేటెంట్ దరఖాస్తు చేసుకోవటం పూర్తయింది.


ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేక సమస్యలను ఒక దెబ్బతో పరిష్కరించగలదు. భారీ పెట్టుబడి అవసరం లేకుండా సులువుగా తయారు చేయటానికి దోహదం చేస్తుంది. కోటింగ్ గాని టేప్ వేయాల్సిన అవసరం గాని, అందుకోసం వాడే పరికరాల అవసరం గాని లేకుండా చేస్తుంది. అందువలన విదేశీ దిగుమతులు, ఖరీదైన యంత్రాలు అవసరం లేదు. రక్షణతోబాటు వాడే వాళ్ళకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అనిటికంటే ముఖ్యంగా దేశానికి స్వావలంబన ఇస్తుంది. భవిష్యత్తులో పిపిఇ సూట్ కు ఇదే ఒక ప్రమాణంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.


****



(Release ID: 1632462) Visitor Counter : 253