భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
కండ్లా, అహ్మదాబాద్, ఇందోర్, రైసెన్, ఖజురహో, ఫతేపూర్ మరియు బహ్రెచ్ వరకు ప్రయాణించనున్న రుతుపవనాలు
తూర్పతీరం వెంబడి విస్తారంగా కురియనున్న వర్షాలు
ఈశాన్య భారతం, పశ్చిమ మరియు పశ్చిమ భారతానికి దగ్గరలో ఉన్న మధ్య భారతదేశంలో రానున్న 5 రోజుల్లో విస్తారంగా కురియనున్న భారీ నుండి అతి భారీ వర్షాలు
రానున్న 2-3 రోజుల్లో తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో వేడి నుండి అతి వేడి గాలులు మరియు పశ్చిమ రాజస్థాన్ మరియు పంజాబ్ ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం
Posted On:
17 JUN 2020 2:51PM by PIB Hyderabad
జాతీయ వాతావరణ కేంద్రం/ప్రాంతీయ వాతావరణ కేంద్రం, న్యూఢిల్లీ, భారత వాతావరణ విభాగం(ఐఎండి) వారి సూచనల ప్రకారం:
♦ రుతుపవనాలు కండ్లా, అహ్మదాబాద్, ఇండోర్, రాయిసెన్, ఖజురహో, ఫతేపూర్ మరియు బహ్రెచ్ వరకు ఆవరించి ఉన్నాయి.
♦ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతం వరకు మరియు సముద్ర మట్టానికి 3.6 కి.మీ ఎత్తులో అల్పపీడనం ఆవరించి ఉంది.
♦ సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తులో మధ్య పాకిస్థాన్ నుండి బంగ్లదేశ్ వరకు ఈ ద్రోణి ఆవరించి ఉన్నది.
♦ ఉత్తర కొంకణ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనగా సముద్ర మట్టానికి 3.1 & 7.6 కి.మీ మధ్య ఎత్తులో అల్పపీడన ప్రభావం ఉంటుంది.
♦ సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తులో ఝార్ఖండ్ నుండి కొంకణ్ ప్రాంతం వరకు అల్పపీడన ప్రభావ శీర్ జోన్ ఆవరించి ఉంది.
♦ పైన సూచించిన అల్పపీడన ప్రభావం వలన:
1. జూన్ 17వ తేదీ మరియు 21 తేదీల్లో కర్ణాటక సముద్ర తీరం వెంబడి మరియు తూర్పు కర్ణాటక ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం అవకాశం ఉండగా , కొంకణ్ మరియు గోవా ప్రాంతంలో 17 మరియు 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 18-20 తేదీల్లో కర్ణాటక సముద్ర తీరం వెంట భారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉండగా కొంకణ్ మరియు గోవా ప్రాంతంలో జూన్ 19-21 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కలదు.
2. రానున్న 5 రోజుల్లో ఈశాన్య భారత్, పశ్చిమ మరియు పశ్చిమ భారతానికి దగ్గరలో ఉన్న మధ్య భారతదేశంలో భారీ నుండి అతి భారీ వర్షాలు విస్తారంగా కురియనున్నాయి.
♦ జూన్ 19-21 తేదీల్లో తూర్పు హిమాలయ ప్రాంతంలో మరియు వాయువ్య భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది.
♦ రానున్న 2-3 రోజుల్లో తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో వేడి నుండి అతి వేడి గాలులు మరియు పశ్చిమ రాజస్థాన్ మరియు పంజాబ్ ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం కలదు.
తాజా సమాచారం కోసంt www.imd.gov.in ను సందర్శించండి.
*****
(Release ID: 1632099)
Visitor Counter : 179