భారత ఎన్నికల సంఘం
జులై 6న బిహార్ శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికలు
- మండలి సభ్యులను ఎన్నుకోనున్న శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యే)
Posted On:
15 JUN 2020 2:37PM by PIB Hyderabad
బిహార్ శాసన మండలికి స్థానిక శాసనసభ (ఎమ్మెల్యే) సభ్యుల ద్వారా ఎన్నికైన మొత్తం తొమ్మిది మంది సభ్యుల పదవీకాలం జూన్ 6వ తేదీతో ముగిసింది. వారి వివరాలు ఈ కిందన ఇవ్వబడ్డాయి:
క్రమ సంఖ్య
|
సభ్యుడి పేరు
|
రిటైర్మెంట్ తేదీ
|
1.
|
అశోక్ చౌదరి
|
06.05.2020
|
2.
|
కృష్ణ కుమార్ సింగ్
|
3.
|
ప్రశాంత్ కుమార్ షాహీ
|
4.
|
సంజయ్ ప్రకాశ్
|
5.
|
సతీశ్ కుమార్
|
6.
|
రాధా మోహన్ శర్మ
|
7.
|
సోనేలాల్ మెహతా
|
8.
|
ఎండి. హరూన్ రషీద్
|
9.
|
హీరా ప్రసాద్ వింద్
|
కోవిడ్ -19 కారణంగా నెలకొన్న అనూహ్య ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం 2005లో మార్గదర్శకాలు & ఉత్తర్వుల ప్రకారం సమర్థ ప్రాధికారికత మేరకు ఎన్నికల కమిషన్ 03.04.2020 న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 సూచించిన ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 16 మేరకు ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం పైన పేర్కొన్న సీట్లకు ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తరువాత తరువాతి రోజున ప్రారంభించాలని ఆదేశించింది.
బిహార్ సీఈఓ నుంచి ప్రస్తుత పరిస్థితులను గురించిన సమాచారం స్వీకరించిన తరువాత కమిషన్, బిహార్ శాసన మండలికి పైన పేర్కొన్న ద్వైవార్షిక ఎన్నికలను ఈ క్రింది షెడ్యూలుకు అనుగుణంగా నిర్వహించాలని నిర్ణయించారు:
క్రమ సంఖ్య
|
కార్యక్రమం
|
తేదీలు
|
-
|
నోటిఫికేషన్ జారీ
|
జూన్ 18, 2020 (గురువారం)
|
-
|
నామినేషన్ల దాఖలునకు ఆఖరి తేదీ
|
జూన్ 25, 2020 (గురువారం)
|
-
|
నామినేషన్ల పరిశీలన
|
జూన్ 28, 2020 (శుక్రవారం)
|
-
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
జూన్ 29, 2020 (సోమవారం)
|
-
|
ఎన్నిక తేదీ
|
జులై 06, 20202 (సోమవారం)
|
-
|
పోలింగ్ సమయం
|
ఉదయం 9.00 గం. నుంచి సాయంత్రం 4.00 గం. వరకు
|
-
|
ఓట్ల లెక్కింపు
|
జులై 06, 2020 (సోమవారం) సాయంత్రం 5.00 గంటలకు
|
-
|
ఎన్నికల ప్రక్రియ ముగింపునకు ఆఖరు తేదీ
|
08 జులై, 2020 (బుధవారం)
|
స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నిక ప్రక్రియను నిర్ధారించడానికి పరిశీలకులను నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను దగ్గరగా పర్యవేక్షించేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని సూచించడమైంది.
ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేటప్పుడు కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని సూచనలు పాటించేలా చూడడానికి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ అధికారిని నియమించాలని కమిషన్ బిహార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
***
(Release ID: 1631679)
Visitor Counter : 247