జల శక్తి మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో 100% గృహాలకు కుళాయి కనెక్షన్ అందించేందుకు జోరుగా చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 06 JUN 2020 5:51PM by PIB Hyderabad
దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో జల్ జీవన్ మిషన్ ఒకటి. గత ఏడాది ప్రారంభమైన ఈ మిషన్ లో గ్రామీణ గృహాలన్నిటికి శుభ్రమైన తగు నీరు సమృద్ధిగా అందించాలన్నది ధ్యేయం. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమమిది. ఈ మిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకుని గ్రామీణ ప్రజలలో ముఖ్యంగా మహిళలకు సులభతరం జీవనాన్ని అందించడానికి కృషి జరుగుతోంది. జీవితాల్లో పరివర్తన తెచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీరు నేరుగా చేరే ప్రయత్నం జరుగుతోంది. 
మిషన్ ని సకాలంలో అమలు చేయాలంటే రాష్ట్రాలు వార్షిక కార్యాచరణ ప్రణాళికలను అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఈ ప్రణాళికలు కేంద్ర మంత్రిత్వ శాఖ కు సమర్పించాయి. ఇంకా పశ్చిమ బెంగాల్ ఈ ప్రణాళిక కేంద్ర జల్ శక్తి జాతీయ కమిటీకి అందజేయాల్సి ఉంది. 
పశ్చిమ బెంగాల్ లో 41,357 గ్రామాలలో 1.63 కోట్ల గ్రామీణ గృహాలుండగా 2 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 2019-20లో 32.24 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం 4,720 ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగారు. ఇపుడు 2020-21 లో గత సంవత్సరంవి  కలుపుకుని లక్ష్యం మొత్తం 64.43 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి మరింత వేగవంతంగా ప్రణాళికను రెట్టింపు ఉత్సాహంతో అమలు చేయాల్సి ఉంటుంది.
 2019-20లో రూ. 993.88 కోట్ల కేంద్ర నిధులను రాష్ట్రానికి విడుదల చేశారు, అయితే కేవలం 421.63 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించారు మిగిలిన మొత్తం ఖర్చు కాకుండా ఉంది.  ఇంకా, ఆర్సెనిక్ / ఫ్లోరైడ్ ప్రభావిత నివాసాలలో త్రాగునీటి కోసం రూ. 1,305 కోట్లు అందించగా, అందులో రూ. 573.36 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేయలేదు. ఈ విధంగా, 1.4.2020 నాటికి,  గ్రామీణ గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కేంద్ర వాటా‌గా రూ.1,146.58 కోట్లు రాష్ట్రానికి ప్రారంభ బ్యాలెన్స్ ఉంది. 2020-21 మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపు రూ. 1,610.76 కోట్లుకు పెంచారు. ఓపెనింగ్ బాలన్స్ తో కలుపుకుని పశ్చిమ బెంగాల్ ఈ ఏడాది రూ. 2,757.34 కోట్లు కేంద్ర నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే పశ్చిమ బెంగాల్ లో 2020-21 సంవత్సరానికి గాను జల్ జీవన్ ప్రాజెక్ట్ కింది రాష్ట్ర వాటితో కలుపుకుని రూ.5. 515 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పనితీరు ఆధారంగా అవసరమైతే ఇప్పుడున్న నిధులకు అదనంగా ప్రోత్సాహక నిధులు సమకూర్చే అవకాశం ఉంది. ట్యాప్ కనెక్షన్ల పరంగా భౌతిక పురోగతి కోసం రాష్ట్రం నెలవారీ ప్రణాళికను రూపొందించాలి, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణ కోసం వ్యయ ప్రణాళికకు రాష్ట్రంతో అందుబాటులో ఉన్న భారీ నిధులను ఖర్చు చేయాలి.

పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం 1.08 కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చే సామర్థ్యం ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించాలి, దానిని అమలు చేయాలి. రాబోయే 4-6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత తో చేపట్టాలి. ముఖ్యంగా ఎస్.సి/ఎస్.టి మెజారిటీ గ్రామాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. 

తాగడానికి యోగ్యమైన నీటి సరఫరా, నాణ్యత తో కూడిన నీటిని అందివ్వడం జల్ జీవన్ మిషన్ లో ప్రాధాన్యత అంశం. 2020 డిసెంబర్ 31లోగ 2,414 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు పైపుల ద్వారా నీటిని రాష్ట్రప్రభుత్వం అందించాల్సి ఉంది. తగు త్రాగు నీటి సరఫరా వ్యవస్థ సిద్ధం కాకపోతే, తాత్కాలికంగా తలసరి రోజుకు 8-10 లీటర్ల నీటిని తాగడానికి, వంటకు అందుబాటులో ఉండేలా సరఫరా చేసే సామాజిక నీటి శుద్ధి ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.    

15వ ఆర్ధిక సంఘం పిఆర్ఐ గ్రాంట్ కింద పశ్చిమ బెంగాల్ కి రూ. 4,412 కోట్లు ఇస్తుంది. దీనిలో 50% నిధులు తప్పనిసరిగా నీరు, పారిశుధ్య పథకాలకు వినియోగించాలి. వీటితో పాటు రాష్ట్రాలకు ఏటా మంజూరయ్యే అనేక కేంద్ర పథకాల నిధులను కూడా గ్రామ స్థాయిలో కార్యాచరణ రూపొందించి, నీటి అవసరాలను తీర్చుకోవాలి. మంచి నీటి భద్రత రాష్ట్ర ప్రజలకు కల్పించాలి. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో నీటి సరఫరా, నీటి సంరక్షణ పనులను రాష్ట్రం చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా వివిధ నైపుణ్యాలు ఉన్న వలస పని వారికి తగు పనులు కల్పిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రతి ఇంటికి తగు పరిమాణంలో తాగు నీటి లభ్యతే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్ఠం అవుతుంది. 

***



(Release ID: 1630047) Visitor Counter : 204