జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ కోసం పంజాబ్ ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన - కేంద్ర మంత్రి.

Posted On: 06 JUN 2020 5:53PM by PIB Hyderabad

2020 మార్చి నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు అందించడానికి చర్యలు తీసుకున్నందుకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను అభినందించారు.  జల్ జీవన్ మిషన్ పధకం పట్ల నిబద్ధతను చూపించిన పంజాబ్ ముఖ్యమంత్రికి, తన లేఖలో కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలిన కుటుంబాలకు కూడా కుళాయి కనెక్షన్‌లను అందించడంతో పాటు, జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం.) కింద నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు క్రమబద్ధమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన నాణ్యతా ప్రమాణాలతో, సమృద్ధిగా  త్రాగునీటి  సరఫరా సేవలను అందించడం జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. .

ఎఫ్‌.హెచ్.‌టి.సి. ల సంఖ్య మరియు నిధుల వినియోగం పరంగా ఉత్పత్తి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను భారత ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నొక్కి చెప్పారు.  ఆ మేరకు 2019-20 లో పంజాబ్‌ కు కేంద్ర వాటాగా, 227.46 కోట్ల రూపాయలు అందజేయగా, అందులో రాష్ట్రం 73.27 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించుకుంది.   ప్రారంభ నిల్వ 257 కోట్ల రూపాయల తో పాటు 2020-21 లో  362.79 కోట్ల రూపాయల కేటాయింపుతో, పంజాబ్ కు మొత్తం 619.89 కోట్ల రూపాయల కేంద్ర నిధులు అందుబాటులో ఉంచడం జరిగింది.  2020-21లో పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లు అందించడానికి రాష్ట్ర మ్యాచింగ్ వాటాతో కలిపి మొత్తం 1,239.78 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద అందుబాటులో ఉన్నాయి. 

2022 మార్చి నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్లు ఉండేలా ప్రణాళిక అమలును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రాష్ట్రాన్ని కోరారు.  మిగిలిన కుటుంబాలకు ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాలకు చెందినవారి గృహాలకు ట్యాప్ కనెక్షన్‌లను అందించడానికి వీలుగా గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా వ్యవస్థలను తిరిగి మార్చడం లేదా పెంచడంపై దృష్టి పెట్టాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.  వచ్చే 4–6 నెలల్లో మిగిలిన గృహాలకు ట్యాప్ కనెక్షన్‌లను ‘ఉద్యమ స్థాయిలో’లో అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇటువంటి పథకాలను బలోపేతం చేయడం ద్వారా, పునర్వినియోగం చేయడం ద్వారా 14 లక్షల ట్యాప్ కనెక్షన్‌లను అందించాలనీ, అప్పుడు ఈ గ్రామాలు‘ హర్ ఘర్ జల్ గావ్ ’కావచ్చుననీ, ఆయన పేర్కొన్నారు.  ప్రణాళిక చేస్తున్నప్పుడు, నీటి కొరత ఉన్న ప్రాంతాలలోని గ్రామాలు, ఆశాజనక జిల్లాలు మరియు సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పరిధిలో ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేని ఆవాసాలకు జల్ జీవన్ మిషన్ కింద త్రాగు నీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలి.  జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క మధ్యంతర ఉత్తర్వుల దృష్ట్యా, ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలలోని అన్ని గృహాలకు 2020 డిసెంబర్ లోగా పైపుల ద్వారా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి  ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.   ఒకవేళ, 2020 డిసెంబరు లోగా త్రాగునీటి పైపు కనెక్షన్లను ఏర్పాటు చేయని పక్షంలో, మధ్యంతర చర్యగా త్రాగడానికి, వంట చేసుకోడానికి 8-10 ఎల్.‌పి.సి.డి. చొప్పున సామాజిక నీటి శుద్ధి ప్లాంట్లు (సి.డబ్ల్యు.పి.పి.) ఏర్పాటు చేయడం ద్వారా అందజేయాలి. 

73 వ రాజ్యాంగ సవరణను అనుసరించి,  తాగునీటి భద్రతను సాధించడానికి,  నీటి సరఫరా పథకాల దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడానికి, గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, మరియు నిర్వహణలో స్థానిక గ్రామ సంఘం / గ్రామ పంచాయతీలు మరియు దాని ఉప కమిటీ / వినియోగదారుల బృందాలు పాల్గొనాలని జల్ జీవన్ మిషన్ ఆదేశించింది. 

2020-21లో, పి.ఆర్.‌ఐ.లకు 15 వ ఆర్ధిక సంఘం గ్రాంట్ల కింద రాష్ట్రానికి 1,388 కోట్ల రూపాయలు కేటాయించారు, అందులో 50 శాతం నిధులను తప్పనిసరిగా నీటి సరఫరా సౌకర్యాలు మరియు పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేయాలి.  గ్రామ స్థాయిలో నీటి సరఫరా పనుల కోసం ఎం.జి.ఎన్.‌ఆర్.ఈ.జి.ఎస్.; ఎస్.‌బి.ఎం.(జి), పి.ఆర్.‌ఐ.లకు 15 వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, సి.ఏ.ఎం.పి.ఏ., సి.ఎస్.‌ఆర్. నిధి, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి మొదలైన వివిధ కార్యక్రమాలను కలపడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని రాష్ట్రాన్ని అభ్యర్థించడం జరిగింది. అటువంటి వనరులన్నింటినీ ఒక చోట జమ చేయడం ద్వారా ప్రతి గ్రామం యొక్క కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో, తాగునీటి సమస్య ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం, పౌరులకు త్రాగు నీరు మరియు గృహాల్లో బహుళ వినియోగం కోసం పరిశుభ్రమైన నీరు లభించేలా చూడటం కంటే అధిక ప్రాధాన్యత గల అంశం వేరే ఏదీ లేదు.  ఇంట్లో కుళాయి ఉంటే, సామాజిక దూరాన్ని పాటించడంలో సహాయపడటంతో పాటు, మంచి పరిసరాల పరిశుభ్రతకు, తరచుగా చేతులు కడుక్కోవడానికీ, ఉపయోగపడుతుంది.  దీనితో పాటు, జల్ జీవన్ మిషన్ ద్వారా తమ స్థానిక ప్రజలకు మరియు వలస కార్మికులకు ఉపాధి కల్పించడంలో కూడా రాష్ట్రం సహాయం చేస్తుంది.

 

***



(Release ID: 1629974) Visitor Counter : 192