రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుక‌లు

Posted On: 05 JUN 2020 8:32PM by PIB Hyderabad

కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో శుక్ర‌వారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం  నిర్వ‌హించారు. ‘జీవ వైవిధ్యానికి’ త‌గిన‌ ప్రాధాన్యతనిస్తూ ప‌ర్యా‌వ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్ని నిర్వ‌హించాయి. ఈ కార్య‌క్ర‌మంలో నావికా ద‌ళం చురుగ్గా పాల్గొంది. సామాజిక దూరం పాటించ‌డంతో పాటు ఇత‌ర కోవిడ్-19 భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడుతూ ఈ కార్య‌క్ర‌మం నిర్వహించారు.
3500ల‌కు పైగా మొక్క‌లు నాటారు..
కేర‌ళ‌కు చెందిన క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్ట‌ర్ మీనాక్షి ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం పుర‌స్క‌రించుకొని సదరన్ నావల్ కమాండ్‌కు (ఎస్ఎన్‌సీ) దాదాపు 3500ల‌కు పైగా వివిధ ర‌కాల మొక్క‌ల‌ను అంద‌జేశారు. కాగా ఈ మొక్క‌ల‌ను ఎస్ఎన్‌సీ ద‌ళం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని కొచ్చి న‌గ‌రంలో వివిధ ప్రాంతాల‌లో నాటారు. వైస్ అడ్మిరల్ ఎ.కె. చావ్లా, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, ఎస్ఎన్‌సీ కమోడోర్ అనిల్ జోసెఫ్, కొచ్చి ఏరియా స్టేషన్ కమాండర్‌, డాక్టర్ మీనాక్షితో కలిసి వీనావల్ బేస్ ఏరియా నందు మొక్క‌ల్ని నాటే కార్య‌క్రమం చేప‌ట్టారు. నావ‌ల్ బేస్‌తో పాటుగా వివిధ ప్రాంతాల లో కూడా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.
వివిధ నావికా ద‌ళ యూనిట్ల‌లోనూ..
నావల్ బేస్ మరియు పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి ప్రాధాన్యతనిస్తూ ‘క్లీన్-అప్’ డ్రైవ్‌ను ఈ సంద‌ర్భంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా, వెండురుతి ఛానెల్‌ను బయోడిగ్రేడబుల్ కాని వస్తువులను శుభ్రపరిచారు. ఎజిమాలా, కోయంబత్తూర్, గోవా, గుజరాత్‌లోని జామ్‌నగర్, మహారాష్ట్రలోని లోనావ్లా, ఒడిశాలోని చిల్కా, ముంబైలోని మలాడ్ వద్ద ఉన్న ఇతర అవుట్ స్టేషన్ నావికా దళ యూనిట్లలోనూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌
దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి తోడు పోర్ట్ కొచ్చి వ‌ద్ద తీర‌ప్రాంత శుభ్ర‌త కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్టారు.
మేము సైతం అంటూ పిల్ల‌లు కూడా..
నేవీ చిల్డ్రన్ స్కూల్ మరియు కేవీలలోని పిల్లలు ఆన్‌లైన్ ద్వారా ఉపన్యాసాలు మరియు వెబ్‌నార్ల ద్వారా ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. లేడీస్ ఆఫ్ నేవీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (సదరన్ రీజియన్) కూడా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. “మా పర్యావరణం మరియు జీవవైవిధ్యం పట్ల బాధ్యత” అనే సందేశాన్ని చాలా విస్తృతంగా వ్యాప్తి చేయడానికి వివిధ ఆన్‌లైన్ వేదిక‌ల‌ను విస్తృతంగా ఉపయోగించుకుంది. ఈ  సంద‌ర్భంగా ప్లాస్టిక్‌పై నిషేధం అంశాన్ని పునరుద్ఘాటించారు.ఈ కార్య‌క్రమాంలో హాజరైన పిల్లలు ప్లాస్టిక్ కాకుండా బయో డీగ్రేడబుల్ క్యారీ బ్యాగ్‌లను మాత్రమే ఉపయోగించుతామని ప్రతిజ్ఞ చేశారు. వైస్ అడ్మిరల్ ఎ.కె. చావ్లా ఈ వేడుక‌ల్లో పాల్గొన్న వారితో ముచ్చ‌టిస్తూ వారి హృదయపూర్వకపు కృషిని అభినందించారు. మన భవిష్యత్ తరాల కోసం స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన మేటి పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి మరియు పెంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న  ప్రోత్సహించారు.



(Release ID: 1629781) Visitor Counter : 194


Read this release in: English , Urdu , Hindi , Tamil