జల శక్తి మంత్రిత్వ శాఖ

జార్ఖండ్ లో రూ.572 కోట్ల జల్ జీవన్ మిషన్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం

Posted On: 05 JUN 2020 4:24PM by PIB Hyderabad

రాష్ట్రంలో అమలు చేసే జల్ జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికను జార్ఖండ్ కేంద్ర జల శక్తి శాఖ కు సమర్పించింది. ఈ మేరకు రాష్ట్ర మంచినీటి, పారిశుధ్య కార్యదర్శి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.  ప్రధానమంత్రి అతి ముఖ్యమైన కార్యక్రమం జల్ జీవన్ మిషన్, 2024కల్లా ప్రతి గ్రామీణ గృహానికి  ,నీరందివ్వాలని, ఒక్కో వ్యక్తికీ రోజుకు 55 లీటర్ల నీటిని అందజేయాలన్నది ప్రణాళిక ఉద్దేశం. ఈ దిశగా రాష్ట్రాలు ఈ మిషన్ ని అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 

       జార్ఖండ్ లో  2023-24 సంవత్సరానికి 100 శాతం గృహాలలో ఇది అమలు కావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రాష్ట్రంలోని 54 లక్షల గ్రామీణ నివాసాలున్నాయి. వీటిలో 4.37 లక్షల నివాసగృహాలకే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 2019-20లో 98 వేల కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరంలో 12 లక్షల కనెక్షన్లు ఇచ్చే ప్రణాళిక చేసుకుంది. 2020-21కి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి రూ.572.23 కోట్లకు ఆమోదించింది, ఇది గత ఏడాది కన్నా ఇది  రూ. 267.69 కోట్లు అధికం. 

          అలాగే 15వ ఆర్ధిక సంఘం రూ.1,689 కోట్లు పి ఆర్ ఐ  గ్రాంటు కూడా జార్ఖండ్ త్వరలో అందుకోబోతోంది. దీనిలో 50% నీరు, పారిశుధ్యానికి వినియోగించాల్సి ఉంటుంది. గ్రామీణ సంఘాలను, గ్రామా పంచాయితీలను ఈ మిషన్ అమలులో వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జార్ఖండ్ తన రాష్ట్రంలో ఉన్న 19 ఆస్పిరేషనల్ జిల్లాలు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తూనే, ఎస్.సి, ఎస్.టి గ్రామాలపై కూడా జల్ జీవన్ మిషన్ కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం, జల వనరుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. నీటి నాణ్యత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. ఇందుకు ప్రతి గ్రామంలోను అయిదుగురు మహిళల బృందానికి నీటి నాణ్యతను పరీక్షించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో నీటి సరఫరా, జల సంరక్షణ పనులు తక్షణమే చేపట్టాలని, దీని వల్ల వలస కార్మికులకు పనులు లభించే చర్యలు చేపట్టాలని రాష్టానికి కేంద్రం సూచించింది. 

***



(Release ID: 1629780) Visitor Counter : 188