వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇండస్ట్రియల్ ఎంట్రప్రెన్యూర్ మెమొరాండమ్ కేటాయింపు అమలు ఇక పేపర్ రహితం

Posted On: 04 JUN 2020 7:56PM by PIB Hyderabad

1951 నాటి పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టం కింద ఇండస్ట్రియల్ ఎంట్రప్రెన్యూర్ మెమొరాండమ్ ( ఐ ఇ ఎం ) దరఖాస్తులు ప్రస్తుతం సంబంధిత పోర్టల్ https://services.dipp.gov.in లో స్వీకరిస్తున్నారు. వ్యాపార స్థాపన గురించి పార్ట్ ఎ,  వాణిజ్యపరమైన ఉత్పత్తి ఆరంభం గురించి పార్ట్ బి పూర్తి చేసి  ఎంట్రప్రెన్యూర్లు ఆన్ లైన్ లో నింపాల్సి ఉంటుంది. ముట్టినట్టు రశీదును భౌతికంగా అందజేయటంతోబాటు సంబంధిత స్కాన్ చేసిన కాపీని ఆ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. అయితే, ఏవైనా సవరణలు ఉంటే మాత్రం స్వయంగా అందజేసి రశీదు ధ్రువపత్రాలను కాగితం మీద తీసుకుంటారు. స్కాన్ చేసిన కాపీని ఆ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. రశీదును ధ్రువపత్రాలను దరఖాస్తు దారులకు ఈ-మెయిల్ ద్వారా పంపుతారు.


పారదర్శకతను, వ్యాపార సౌలభ్యాన్ని పెంచే దృష్టితో పరిశ్రమ, అంతర్గత వ్యాపార ప్రోత్సాహక విభాగం ( డిపిఐఐటి) ఇప్పుడు ఐఇఎం పోర్టల్ స్థాయిని పెంచింది.  ఇలా స్థాయి పెరిగిన పోర్టల్ ఐఇఎం లోని పార్ట్ ఎ, పార్ట్ బి దరఖాస్తుల సమర్పణను ఆన్ లైన్ కిందికి మార్చింది. ఆ విధంగా దరఖాస్తులన్నీ కాగిత రహిత విధానంలో ప్రాసెస్ చేయబడతాయి. ముట్టినట్టు రశీదులు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో జారీచేస్తారు. ఆమోదం పొందిన వెంటనే దరఖాస్తుదారుకు ఈ-మెయిల్, ఎస్ ఎం ఎస్ ద్వారా కూడా తక్షణమే తెలియజేస్తారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏకకాలంలో ఈ మెయిల్ ద్వారా సమాచారమిస్తారు. 


అందువలన ఇకమీదట ఐఇఎం - పార్ట్ ఎ, ఐఇఎమ్ పార్ట్ బి, ఇప్పటికే జారీచేసిన ఐఇఎం ల సవరణ దరఖాస్తులేవీ భౌతికంగా దాఖలు చేయకూడదు. ఎలాంటి భౌతిక ధ్రువపత్రమూ ఇవ్వబడదు. జారీ చేసిన ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలను తనిఖీ చేసుకోవాలంటే సంబంధిత క్యూ ఆర్ కోడ్ సాయంతో ఆన్ లైన్ లో చూసుకోవచ్చు.


 

*****


(Release ID: 1629507) Visitor Counter : 266