జల శక్తి మంత్రిత్వ శాఖ

రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాసిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి

Posted On: 04 JUN 2020 5:38PM by PIB Hyderabad

తమిళనాడు రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం.) ను వేగంగా అమలు చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. 2024 నాటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల (ఎఫ్‌హెచ్‌టిసి) ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపర్చాలని జెజెఎం యోచిస్తోంది. జలశక్తి మంత్రిత్వ శాఖ వార్షిక కార్యాచరణ ప్రణాళికను సమర్పించిన తర్వాత, ముఖ్యమంత్రికి ఇచ్చిన సమాచారంలో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటి సరఫరాలను అందించే నిబద్ధత ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మరియు బాలికలు భరించే ఇబ్బందులను అంతం చేస్తుందని తెలిపారు. జె.జె.ఎం.ను సమయానుసారంగా అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు తగినంత పరిమాణంలో తాగునీరు లభిస్తుందని, దీర్ఘకాలిక ప్రాతిపదికన వారి ఇళ్ళలో రోజూ నిర్దేశించిన నాణ్యత లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయాలు అందించేందుకు కట్టుబడి ఉంది. అందించిన ఎఫ్.హెచ్.టి.సి.ల పరంగా అవుట్ పుట్ ల ఆధారంగా మరియు అందుబాటులో ఉన్న కేంద్ర మరియు మ్యాచింగ్ రాష్ట్ర వాటాను ఉపయోగించడం ఆధారంగా నిధులను భారత ప్రభుత్వం అందిస్తుంది.

2019-20లో 13.86 లక్షల గృహాలకు కనెక్షన్లు అందించాల్సి ఉండగా, ఇవి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాయనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2019-20లో 13.86 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడానికి తమిళనాడుకు 373.87 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, వాటిలో 373.10 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం ఉందని, అయితే, రాష్ట్రం కేవలం 2020 మార్చి చివరి నాటికి జె.జె.ఎం. ఆధ్వర్యంలో 114.58 కోట్లు మాత్రమే వినియోగించుకుందని తెలిపారు.

అంతే కాకుండా ప్రతి గ్రామీణ గృహానికి తాగునీరు అందించడం జాతీయ ప్రాధాన్యత అని శ్రీ షెకావత్ తెలిపారు. ఈ సందర్భంలో తమిళనాడుకు నిధుల కేటాయింపును 2010-21 మధ్య కాలంలో 373.87 కోట్ల రూపాయల నుంచి 917.44 కోట్ల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా ప్రారంభ బ్యాలెన్స్, 264.09 కోట్ల రూపాయలతో కలిపి కేంద్ర నిధులు 1181.53 కోట్ల లభ్యతకు రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఎప్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం రాష్ట్ర రుణాల పరిమితులను 3.5 శాతం నుంచి 5 శాతానికి పెంచడంతో మరియు 2024 నాటికి ప్రతి ఇంటిని ఎఫ్.హెచ్.టి.సి.లకు అందించే నిబద్ధతతో, కేంద్ర నిధులతో పాటు రాష్ట్రానికి సరిపోయే వాటా అమలు ఏజెన్సీలకు అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విధంగా 2020-21లో రాష్ట్రానికి సరిపోయే వాటాతో, ట్యాప్ కనెక్షన్లు అందించడానికి రాష్ట్రంతో మొత్తం ఫండ్ లభ్యత 2,363 కోట్ల రూపాయలు.

కానీ 2019-20లో అందించిన ఎఫ్.హెచ్.టి.సి.ల సంఖ్య మరియు నిధుల స్వల్ప వినియోగం పరంగా అసంతృప్తికరంగా ఉన్న ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో నీటి సరఫరా పథకాల ప్రణాళిక మరియు అమలు గురించి సమీక్షించాలని, దీనిపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి, ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే ఉన్న పైపు నీటి సరఫరా ఫథకాలు క్యాంపైన్ మోడ్ లో తిరిగి అభివృద్ధి చేయవచ్చు అదే విధంగా పెంచవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో 105 లక్షల ఎఫ్.హెచ్.టి.సి.లను అందించే అవకాశం ఉండటంతో పాటు ఈ గ్రామాలు హర్ ఘర్ జల్ గావ్ గా మారేందుకు అవకాశం ఉంది.

రాష్ట్రంలోని 1.27 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో 21.85 లక్షల్లో ఇప్పటికే గృహ ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది 34 లక్షల గ్రామీణ గృహాలకు పంపు నీటిని అందించాలని రాష్ట్రం యోచిస్తోంది. సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన పరిధిలో మొత్తం 117 గ్రామాలు, ఆశాజనక జిల్లాల్లోని గ్రామాలు మరియు 90 శాతం ఎస్సీ లేదా ఎస్టీ ఆధిపత్య నివాసాలకు 100 శాతం కవరేజీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 78 శాతం ట్యాప్ కనెక్షన్లు కలిగిన శివగంగా జిల్లా, 61 శాతంతో వెల్లూరు జిల్లా, 58 శాతం కనెక్షన్లు ఉన్న పుదుకోట్టై జిల్లాలు ప్రస్తుత సంవత్సరంలో 100 శాతం కవరేజ్ కోసం ప్రణాళికలు చేయబడ్డాయి.

 

ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్, ఎస్.బి.ఎం (జి), 15వ ఎఫ్.సి. గ్రాంట్లు వంటి వివిధ కార్యక్రమాలను కలపడం ద్వారా తాగునీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాలిక సుస్థిరతను నిర్థారించడానికి ప్రస్తుత తాగునీటి వనరులను బలోపేతం చేయడానికి అన్ని వనరులను చురుకుగా పరిశీలించాలని కేంద్ర మంత్రి అభ్యర్థించారు. పి.ఆర్.ఐ.లు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, కాంపా, సి.ఎస్.ఆర్. ఫండ్, లోకల్ ఏరియా డెవలప్ మెంట్ ఫండ్ మొదలైనవి ప్రతి గ్రామానికి చెందిన విలేజ్ యాక్షన్ ప్లాన్ (వి.ఏ.పి) తయారీకి ప్రాధాన్యత ఇస్తాయి. నీటి భద్రత సాధించడానికి, దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడానికి గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణలో స్థాని గ్రామ సంఘం లేదా గ్రామ పంచాయితీలు మరియు దాని ఉపకమిటీలు లేదా వినియోగదారు సమూహాలు పాల్గొనవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో జె.జె.ఎం.ను నిజమైన ప్రజల ఉద్యమంగా మార్చడానికి కమ్యూనిటీ సమీకరణతో పాటు ఐ.ఈ.సి. ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఈ లేఖ కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో మరింత వైచిత్యాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ప్రజలు బయట గుంపులుగా వెళ్ళి నీటిని తెచ్చుకోవడం చాలా కష్టం. దానితో పాటు భౌతిక దూరాన్ని అభ్యసించడంలో సాయపడే గృహ ల్యాప్ కనెక్షన్లను అందిచడానికి అన్ని గ్రామాల్లో నీటి సరఫరా పనులను చేపట్టాలని ఆయన కోరారు. అదే విధంగా అదనంగా ప్రజలు లేదా వలస కూలీలు ఉపాధి పొందడంలో సాయపడడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి బాటలు వేస్తుంది.

రాష్ట్రాన్ని 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి. రాష్ట్రంగా మార్చేందుకు నిధులతో సహా తన బేషరతు మద్దతును భరోసా ఇస్తూ కేంద్ర జలశక్తి మంత్రి జె.జె.ఎం. ప్రణాళికలు మరియు అమలు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రితో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.

 

***



(Release ID: 1629451) Visitor Counter : 189