బొగ్గు మంత్రిత్వ శాఖ

సామర్థ్యాన్ని మెరుగుపర‌చ‌డం, వ్యాపార నిర్వ‌హ‌ణ‌ను సులభతరం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ప‌లు కార్యక్రమాలు

- ఖనిజ చట్టాలు, మార్గదర్శకాల‌లో సవరణల ద్వారా బొగ్గు రంగాన్ని మ‌రింత అందుబాటులోకి తెచ్చి దిగుమతులను తగ్గించడంపై దృష్టి

Posted On: 03 JUN 2020 6:26PM by PIB Hyderabad

దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మెరుగుపరచడం.. దిగుమతులను తగ్గించడం, సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ఈ రంగంలో వ్యాపారాల్ని సులభత‌రం చేయ‌డానికి వీలుగా దేశీయ బొగ్గు రంగంలో పాతచట్టాల్ని తిరిగి పునఃస‌మీక్షించేందుకు దేశీయ బొగ్గు గ‌నుల మంత్రిత్వ శాఖ త‌గిన చొరవ తీసుకుంటోంది. ప్ర‌స్తుతం బొగ్గు రంగంలో అన్వేషణ మరియు మైనింగ్ రెండింటిలో నూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్య‌మే కొన‌సాగుతూ వ‌స్తోంది. 'ఖనిజపు రాయితీ నియమం- 1960' బొగ్గు తవ్వకాలకు సంబంధించిన అంశాలు.. దేశ బొగ్గు రంగంలోని సంస్కరణలను మరింతగా పెంచాల్సిన అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తోంది. పర్యావరణం మరియు అటవీ సంరక్షణకు సంబంధించిన అనేక చట్టాలు ఉనికిలోకి తేవాల్సిన అంశాన్ని ఇది తెలియ‌ప‌రుస్తోంది. బొగ్గు రంగంలో సంభావ్య పెట్టుబడిదారుల ప్రవేశాన్ని ప్రభావితం చేసేలా ఈ రంగంలోని వివిధ చ‌ట్టాల‌లో సంక్లిష్ట‌త‌లు, నిర్బంధ నియమాల‌ను.. దూరం చేసేందుకు వీలుగా వ్య‌వ‌స్థ‌లో కింది మార్పులు తీసుకురావ‌డ‌మైంది. వీటి ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉత్ప‌త్తిని పెంచేందుకు వీలుగా.. బొగ్గు రంగపు కార్య‌క‌లాపాల‌లో స్వేచ్ఛ‌ను తీసుకువ‌చ్చే విధంగా ప‌లు మార్పులు తీసుకురావ‌డం జ‌రిగింది.
ఖనిజ చట్టాల‌ (సవరణ) చట్టం - 2020 ముఖ్యమైన లక్షణాలు..
- బొగ్గు / లిగ్నైట్ బ్లాకుల ఇన్వెంట‌రీల వేలం కోసం అందుబాటులో ఉన్న జాబితా పెంచడంలో సహాయపడటానికి వీలుగా మిశ్రమ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్-కమ్-మైనింగ్ లీజ్ (“పిఎల్-కమ్-ఎంఎల్”) నిమిత్తం బొగ్గు బ్లాకుల కేటాయింపు సవరణ.

- ముందస్తుగా బొగ్గు త్రవ్వకాలలో ఎలాంటి అనుభవం లేకున్నా సొంత వినియోగం, అమ్మకం బొగ్గు మైనింగ్ ఆపరేషన్స్‌ కొనసాగించడానికి వీలుగా.. ఏదైనా సంస్థ బొగ్గు గ‌నుల వేలం / కేటాయింపులలో పాల్గొనేందుకు వీలు క‌ల్పించేలా నిబంధ‌న‌ల‌కు స‌వ‌ర‌ణ‌.

- బొగ్గు రంగంపు ఎఫ్‌డీఐ విధానంలో తాజా స‌వ‌ర‌ణ‌. బొగ్గు అమ్మకం, బొగ్గు మైనింగ్ దాని అనుబంధ‌పు మౌలిక స‌దుపాయాల కార్య‌క‌లాపాల‌లో ఆటోమేటిక్ మార్గం ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబ‌డుల‌కు అనుమతి.

- కేంద్ర ప్రభుత్వపు అర్హత విధానం ద్వారా బొగ్గు / లిగ్నైట్ బ్లాక్‌ల‌‌ యొక్క కేటాయింపు పొందిన వారు లేదా.. రిజర్వేషన్ల ప్ర‌కారం కేటాయింపులు పొందిన వారు త‌మ మైనింగ్ కోల్‌ను త‌మ సొంత ప్లాంట్‌ల‌కు గానీ లేదా త‌మ అనుబంధ‌పు కంపెనీలకు గానీ వాడుకొనేందుకు గాను అంత‌కు ముందే అవ‌స‌ర‌మైన ఆమోదాన్ని పొందాలని సూచించే నిబంధ‌న‌ల తొల‌గింపు.

- దీనిని అమలు చేయడానికి, సంబంధిత సీఎంఎస్‌పీ నియమాలు మరియు సీబీఏ నియమాలు ఖనిజ రాయితీ నియమం 1960 లో త‌గిన సవరణ చేయబడ్డాయి: మైనింగ్ ప్రణాళిక తయారీకి అర్హతగల వ్యక్తుల నమోదు ఇకపై త‌ప్ప‌నిస‌రిగా అవసరం లేదు.

- ఈ విషయంలో ప్రాజెక్ట్ ప్రతిపాదకుడి డిక్ల‌రేష‌న్ సరిపోతుంది.

- బ్లాక్ కేటాయింపులు పొందిన వారు మైనింగ్ ప్రణాళికలో చిన్నచిన్న‌ మార్పులు చేసుకోవ‌డానికి గాను పదేపదే త‌గిన ఆమోదాల‌ను పొందే అవసరాన్ని తగ్గించి.. కార్య‌క‌లాపాల్లో త‌గిన‌ సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు వీలుగా ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేయ‌బ‌డ్డాయి. ఇది బ్లాక్‌ల అలాటీలను శ‌క్తిమంతం చేయ‌నుంది.  

- బొగ్గు అన్వేషణల‌ను వేగవంతం చేయడానికి, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి మరియు బొగ్గు రంగంలో వృద్ధిని వేగ‌వంతం చేసే ఉద్దేశ్యంతో.. ప్రాస్పెక్టింగ్ ఆపరేషన్ మరియు జియోలాజికల్ రిపోర్ట్ (జిఆర్) తయారీకి గాను గుర్తింపు పొందిన ప్రాస్పెక్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొనేందుకు కోల్ బ్లాక్ కేటాయింపుదారుల‌కు ఇప్పుడు మ‌రో ఎంపిక అందుబాటులోకి రానుంది.

- ఈ స‌వ‌ర‌ణ‌లో ప్రాజెక్ట్ ప్రతిపాదకునికి మైనింగ్ ప్లాన్ తయారీకి గాను మైనింగ్ ప్లాన్ ప్రిప‌రేష‌న్ ఎజెన్సీ అక్రిడిటేషన్ సిస్టమ్ ద్వారా మ‌రో అదనపు ప్రతిపాదనా అందుబాటులోకి రానుంది.

- అదేవిధంగా, మైనింగ్‌ ప్రణాళిక మరియు ఫాస్ట్ ట్రాకింగ్ ఆమోదం వ్యవస్థ యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి మైనింగ్ ప్లాన్ యొక్క అత్యున్న‌త‌ సమీక్ష విధానం కూడా ప్రవేశపెట్టబడింది.

- ఖనిజ చట్టాల (సవరణ) చట్టం, 2020 నేప‌థ్యంలో పీఎల్-కమ్-ఎంఎల్ రెగ్యూలేటింగ్ గ్రాంట్‌కు సంబంధించిన నిబంధ‌న

-మైనింగ్ ప్రణాళిక నిర్మాణం సరళీకృతం చేయబడింది. మైనింగ్ ప్లాన్ తయారీ, ప్రాసెసింగ్ మరియు ఆమోదానికి సంబంధించిన మార్గదర్శకాలలో సవరణలు చేయ‌బ‌డ్డాయి. ఇతరత్రా  చట్టబద్ధమైన పత్రాలలో ప్ర‌తిబింబిత‌మైన వివిధ నిబంధ‌న‌లు మైనింగ్ ప్లాన్ నందు పునరావృతం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో వాటిని త‌ప్పించ‌డమైన‌ది

- ఇటీవ‌లి కాలంలో పర్యావరణ మరియు అటవీ సంరక్షణ మొదలైన అంశాల‌కు సంబంధించి ప‌లు చట్టాలు అందుబాటులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో.. మైనింగ్ ప్రణాళికలో కోరే అనేక అతివ్యాప్తి సమాచారం వివ‌రాల‌ను తిరిగి మ‌ళ్లీ అడిగే విధానం తొలగించబ‌డింది.

- సరళీకృత మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. మైనింగ్ ప్ర‌ణాళిక ప్రాసెస్ చేయ‌డం ఆమోదం మంజూరు సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ప‌లు అంశాలూ సరళీకృతం చేయబ‌డ్డాయి.

- కోల్ మైనింగ్ ప్రణాళిక ఆమోదించే అధికారాన్ని సీసీఓలోని స‌బార్డినేట్ అథారిటీల‌కు అప్ప‌గించ‌డ‌మైంది. ప‌నులు నిలిచిపోయే సంద‌ర్భాల‌లో వాటిని నివారించేలా మ‌ధ్యంతర ఏర్పాట్లూ చేయ‌బ‌డ్డాయి. ఈ రంగంలో పారదర్శకత తేవ‌డానికి తాజాగా అప్పీల్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.

- ఆన్‌లైన్ ఆమోదానికి అనుకూలంగా ఉండేలా ఆన్‌లైన్ సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను మ‌రింత అనుకూల‌క‌గా రూపొందించ‌బ‌డింది.

***


(Release ID: 1629255) Visitor Counter : 249