ఆర్థిక సంఘం

పట్టణ ప్రాంతాలలో గాలి నాణ్యత మరియు 15వ ఫైనాన్స్ కమిషన్ మధ్యవర్తిత్వంపై

పర్యావరణ,అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో సమావేశమైన ఫైనాన్స్ కమిషన్

Posted On: 01 JUN 2020 3:09PM by PIB Hyderabad

గాలి నాణ్యతకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పరిస్థితిపై  కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ తో, ఆయన  నేతృత్వంలోని పర్యావరణ,అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన  సీనియర్ అధికారులతో 15వ ఫైనాన్స్ కమిషన్  అధినేత శ్రీ ఎన్. కె. సింగ్, కమిషన్ సభ్యులు మరియు సీనియర్ అధికారులు  చర్చలు జరిపారు.  
ఏ కమిషన్ అయినా గాలి నాణ్యత (ఎక్యు)  గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం ఇదే మొదటిసారి. 15 వ ఫైనాన్స్ కమిషన్ 2020-2021సంవత్సరపు నివేదికలో ఎక్కువగా దృష్టి పెట్టడమే కాక 2020-2021 సంవత్సరానికి గ్రాంట్లు సిఫార్సు చేయడమే కాక అవార్డు కాలానికి దిశా నిర్దేశం కూడా చేసింది.  ఒక కొత్త పద్ధతికి దోవచూపే చర్యకు పూనుకున్నందుకు కమిషన్ ను మంత్రి ప్రశంసించడంతో సమావేశం మొదలైంది.

వచ్చే అయిదేళ్ల కాలానికి అంటే 2021-22 నుంచి  2025-26 వరకు తీసుకోవలసిన చర్యలపై ప్రస్తుతం యోచిస్తోంది.   మరియు ఈ నగరాలకు/ పట్టణ ప్రాంతాలకు సహనీయ రీతిలో  చుట్టుపక్కల గాలి నాణ్యత ఉండేందుకు అనుకూలమైన ఏర్పాట్లు సూచించవలసిన / చేయవలసిన ఆవశ్యకత ఉంది.  ఇందుకు అవసరమైన పద్ధతులను కమిషన్ అర్ధం చేసుకొని మార్గదర్శకాలకు తుది రూపం ఇవ్వవలసిన అవసరం ఉంది.  2020-21 సంవత్సరంలో గ్రాంట్ల నిర్వహణ గురించి చర్చిండానికే మంత్రిత్వ శాఖలతో కమిషన్ సమావేశమైంది.  

పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలలో  2020-21 సంవత్సరంలో  గాలి నాణ్యత పర్యవేక్షణ స్థితిగతులపై దృష్టిని కేంద్రీకరించి చర్చించడం ఈ సమావేశం ఉద్దేశం.   గాలి నాణ్యతను పెంపొందించడానికి వచ్చే ఐదేళ్లలో 2021 నుంచి  2026 వరకు పరిశీలించాల్సిన అంశాలు,  చేయాల్సిన పనులు, దానికి అవసరమైన ఉత్పదకాల గురించి కమిషన్ చైర్మన్ శ్రీ ఎన్. కె. సింగ్  మంత్రికి, అధికారులకు విపులీకరించారు.  

ఇందుకు సంబంధించి కమిషన్ కు ఈ దిగువ సమాచారం అందజేశారు:  
వివిధ నగరాలు మరియు పట్టణాలలో గాలి నాణ్యత కొలవడానికి మొత్తం 984 స్టేషన్లతో జాలాకార వ్యవస్థను ఏర్పాటు చేశారు.  వీటిలో 779 స్టేషన్లు  మానవ నియంత్రితాలు కాగా 205 స్టేషన్లు 500 నగరాల చుట్టూ నిరంతరం గాలి నాణ్యతను కొలుస్తాయి. వాటిని  జాతీయ వాయు కాలుష్య నియంత్రణ నిబంధనల మేరకు  ఏర్పాటు చేశారు.   ఈ స్టేషన్లను మరింత పటిష్టం చేసి విస్తరించవలసి అవసరం ఉంది.  

ఐఐటీ , ఐఐఎం మరియు ఎన్ ఐ టి ల వంటి సంస్థలకు చెందిన నిపుణుల సలహాల మేరకు వాటిని నిర్వహిస్తున్నారు.   వచ్చే ఐదేళ్లలో  2021నుంచి  కూడా వారి మార్గదర్శకాల మేరకు కమిషన్ సిఫార్సులను అమలు చేస్తారు.  

గాలి నాణ్యత అనేది  ఒక్క ప్రాంతానికి చెందిన విషయం కానందున కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా దానిపై దృష్టిని కేంద్రీకరించింది.  నిర్మాణాలు మరియు కూల్చివేత వ్యర్ధాల యాజమాన్యం ప్రభుత్వ ప్రాధాన్యత,   ప్రభుత్వం ఇందుకోసం కమిషన్ మద్దతు తీసుకోనుంది.

రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత విషయం నివేదికలో చేర్చినందుకు ఫైనాన్స్ కమిషన్ ను మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ అభినందించారు. ఇప్పుడు వాహనాల ఉద్గార నియమాలలో మార్పులు వచ్చినందువల్ల వాహన ఉద్గారం 30 నుంచి 40 శాతం తగ్గిపోగలదని, అందువల్ల వచ్చే కొన్ని సంవత్సరాలలో  గాలి నాణ్యత వనరుల్లో నిర్మాణాత్మక మార్పులు వస్తాయని మంత్రి వెల్లడించారు.  

చుట్టుపక్కల పరిసరాల్లో గాలి నాణ్యత పెరగడానికి కాలుష్య, ఉద్గార చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలనీ,  నియమాలు పాటించని వారికి  శిక్షలు, జరిమానాలు విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2015లో జాతీయ గాలి నాణ్యత సూచికను ప్రారంభించిన తరువాత  2017 నుంచి 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 42 నగరాలకు సంబంధించిన గాలి నాణ్యత డేటా ఉందని ఆయన తెలిపారు.  

నగరాల్లో కాలుష్యానికి కారణమైన దుమ్ము, ధూళి నియంత్రణకు నిర్మాణాలు మరియు కూల్చివేత వ్యర్ధాల నియంత్రణకు సంబంధించి మంత్రిత్వ శాఖ నియమాలను రూపొందిస్తున్నదని మంత్రి కమిషన్ కు తెలిపారు.  
కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత మెరుగుపరిచే పనులు చేపట్టేందుకు కమిషన్  గ్రాంట్లను అయిదేళ్ల పాటు కొనసాగించాలని మంత్రి నొక్కి చెప్పారు. త్వరలో  తమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డుల  సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తోందని,  దానికి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ను కూడా భాగస్వామిగా ఆహ్వానించినట్లు  మంత్రి తెలిపారు.  

తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన అనేక సంస్కరణలను గురించి మంత్రి వివరించారు.   దరఖాస్తుల పరిశీలన / లైసెన్సుల మంజూరీ శరవేగంతో జరుగుతోందని,   ఇప్పుడు 108 రోజుల్లో లైసెన్సులను మంజూరు చేస్తున్నామని,  వచ్చే ఆరు నెలల్లో ఈ సమయాన్ని 50 రోజులకు తగ్గిస్తామని మంత్రి తెలిపారు.  

గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని నిర్మిస్తున్నందుకు  మంత్రిత్వ శాఖను కమిషన్ ఏకపక్షంగా అభినందించింది.   అదే సమయంలో వ్యవసాయ కాలుష్యాన్ని నియంత్రించవలసిన ఆవశ్యకతను కూడా  కమిషన్ ఉద్ఘాటించింది.

ఆర్ధిక సంవత్సరం 2020-2021లో పది లక్షలకు పైగా జనాభా ఉన్న 50 నగరాలు / పట్టణ పరిధుల్లో  వాటి చుట్టుపక్కల గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు 15వ ఫైనాన్స్ కమిషన్  రూ. 4,400 కోట్ల గ్రాంటుకు సిఫార్సు చేసింది.  పట్టణ స్థానిక సంస్థల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించే బాధ్యతను పర్యావరణ,అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు అప్పగించారు.  

గాలి నాణ్యతపై స్థిరమైన, విశ్వసనీయమైన డేటా  ఆవశ్యకతను గురించి నొక్కి చెప్తూ, జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యం గురించి కమిషన్ ఆందోళన చెందుతోందని.  ఈ సమస్య పరిష్కారానికి తమ  అధికార పరిధిలో ఉన్న అన్ని చర్యలను కమిషన్  తీసుకోగలదని చైర్మన్ తెలిపారు.   తమ సిఫార్సులకు తుది రూపం ఇవ్వడానికి వీలుగా 10 లక్షల జనాభా మించిన నగరాలలో గాలి నాణ్యత సమస్య గురించి కమిషన్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపగలదని చైర్మన్ మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చారు.  


(Release ID: 1628795) Visitor Counter : 257