పర్యటక మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్య‌టక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రితో స‌మావేశ‌మైన ఓటీఐ ప్ర‌తినిధుల బృందం

- క్రమాంకనంగా హోటళ్ల‌ను తెరవ‌డం, పరిశుభ్రత మ‌రియు భద్రతా సమస్యల గురించి చ‌ర్చ‌

Posted On: 29 MAY 2020 5:48PM by PIB Hyderabad

దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల (ఓటీఏ) ప్రతినిధుల‌ బృందం శ‌నివారం (ఈ రోజు) కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను కలిసింది. క్రమాంకనంగా హోటళ్లు మరియు వసతి విభాగాలను తెర‌వ‌డం, లాక్‌డౌన్ ముగిసిన త‌రువాత భద్రత, వసతి యూనిట్ల పరిశుభ్రత మరియు ప్రయాణ సంబంధిత‌ కార్యకలాపాల కోసం పాటించాల్సిన అంశాల‌తో పోస్ట్ లాక్‌డౌన్  ప్రోటోకాల్‌లను జారీ చేయడం గురించి ఈ సమావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. దేశీయ పర్యటక రంగంతో ప్రారంభించి ప్రయాణ రంగాన్ని తిరిగి ప‌ట్టాలెక్కించే దిశ‌గా మంత్రిత్వ శాఖ రూపొందించిన ‌ప్రణాళికను కేంద్ర మంత్రి ఓటీఏ ప్ర‌తినిధుల బృందంతో పంచుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఓటీఏ బృందం వెలుగులోకి తెచ్చిన ప‌లు అంశాల‌ను వారి ఆలోచనలను కూడా తెలుసుకున్నారు.

 

 


ఈ-మార్కెట్ స్థలాన్ని సృష్టించడం..
వివిధ పర్యటక సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించడానికి ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభావితం చేసే వివిధ మార్గాలపై పర్యటక మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఈ ప్రతినిధి బృందం స‌మావేశంలో చర్చించింది. టూరిస్ట్ గైడ్‌ల కోసం ఈ-మార్కెట్ స్థలం ఒక‌దానిని సృష్టించడం మరియు ఓటీఏ సెక్టార్ కోసం మూలం వ‌ద్ద పన్ను వసూలు (టీసీఎస్) మరియు మూలం వ‌ద్ద పన్ను కోత‌ల (టీడీఎస్) విష‌యంలో సంస్కరణల‌తో పాటుగా ఇత‌ర విష‌యాల‌లో త‌గిన స‌హ‌కారాన్ని అందించాల‌ని వారు మంత్రిని కోరారు. పర్యటక మంత్రిత్వ శాఖ యొక్క ఓటీఏ 2018 మార్గదర్శకాలను స్వీయ ధ్రువీకరణ సూత్రం ఆధారంగా సరళీకృతం చేయాల‌ని వారు మంత్రిని కోరారు. పరిశ్రమ ఆధారిత నాణ్యతా భరోసా మరియు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతో నడిచే స్వీయ ధ్రువీకరణ సూత్ర విధానం ఆధారంగా ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మ‌రింత‌గా సరళీకృతం చేయాల‌ని ఈ ప్రతినిధి బృందం మంత్రిని అభ్యర్థించింది. ఈ సమావేశంలో పర్యటక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారుల‌తో పాటుగా ఓటీఏ త‌ర‌పున ఓయో సంస్థ నుండి రితేష్, మేక్ మై ట్రిప్ సంస్థ నుండి దీప్ కల్రా, యాత్ర సంస్థ నుండి ధ్రువ్ సింగ్రీ మరియు ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ సంస్థ నుండి రితికాంత్ పిట్టిలు ఈ బృందానికి ప్రాతినిధ్యం వహించారు.

 

 


ఓటీఏ లు ఆన్‌లైన్ కంపెనీలు వీరు ఇంట‌ర్‌నెట్‌లో వెబ్‌సైట్ / పోర్టల్స్ ద్వారా వినియోగదారులకు వివిధ ప్రయాణ సంబంధిత సేవలను నేరుగా బుక్ చేసుకోనే అవ‌కాశాన్ని కల్పిస్తూ వ‌స్తున్నారు. వీరు థ‌ర్డ్ పార్టీ ఏజెంట్లు, ప్రయాణాలు, హోటళ్లు, కార్లు, విమానాలు, విడిది ప్యాకేజీలు మొద‌లైన వాటిని రీసేల్ చేస్తూ వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తుంటారు.


 


(Release ID: 1627771) Visitor Counter : 250