పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ సిరీస్ లో భాగంగా "నిమగ్నమయ్యే పర్యాటకునికి ఈశాన్య భారత్" పేరుతో 25వ వెబినార్ ను నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ

దేశంలో వివిధ భాగాలను వర్చ్యువల్ పర్యటనలు ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని పెంపొందిస్తు న్న
దేఖో అప్నా దేశ్ వెబినార్ కార్యక్రమాలు

Posted On: 29 MAY 2020 12:46PM by PIB Hyderabad

దేశీయ, విదేశీ ప్రయాణికులకు ఎక్కువగా అన్వేషించబడని గమ్యస్థానంగా ఉన్న భారతదేశంలోని ఈశాన్య పర్యాటక దృశ్యాలను అవిష్క్రతం చేయడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖ దేఖో అప్నా దేశ్ వెబినార్ నిర్వహించింది. "నిమగ్నమయ్యే పర్యాటకునికి ఈశాన్య భారత్" పేరుతో 2020, మే 28న నాలుగు ఈశాన్య ప్రాంతాలు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం కి  ఆకర్షణీయమైన వర్చువల్ టూర్ తో ముందుకు వచ్చింది. దేఖో అప్నా దేశ్ సిరీస్ దేశంలోని వివిధ ప్రాంతాల వర్చువల్ టూర్ల ద్వారా ఏక్ భారత్ శ్రేష్టభారత్ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించినది, ప్రస్తుతు కోవిడ్ 19 కారణంగా తలెత్తే కఠినమైన పరిస్థితులలో కూడా అదే విధంగా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది. 

28 మే 2020 న దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ 25 వ సెషన్‌ను కర్టెన్ కాల్ అడ్వెంచర్స్ యజమాని జూలీ కాగ్టి సమర్పించారు;  ఇండియా ట్రైల్  ట్రావెలర్ ఇన్ చీఫ్ డేవిడ్ అంగమి,  దేవరాజ్ బరూవా, సహ వ్యవస్థాపకుడు, మోన్యుల్ గాదరింగ్,  పింట్సో గయాట్సో, సహ వ్యవస్థాపకుడు, అవర్గెస్ట్.ఇన్- ప్రదర్శించి చూపారు. 

ఈశాన్యం ప్రత్యేకత కొండలు మాత్రమే కాదు, అన్వేషించడానికి, అనుభూతి పొందడానికి ఇంకా చాలా ఉంది అనే సందేశాన్ని అందించడానికి సమర్పకులు అన్వేషించని గమ్యస్థానాలు, తెగలు, పండుగలు, చేతిపనులు, స్థానిక ప్రజల సంస్కృతి గురించి తెలియజేశారు. ఈ వెబినార్ సెషన్‌లో ఈశాన్య భారత్ అందించే కొన్ని అద్భుతాలు, అనుభవాలు మణిపూర్, నాగాలాండ్ మధ్య ఉన్న డుజుకో లోయను కలిగి ఉన్నాయి, ఇది అంతరించిపోయిన అగ్నిపర్వతం యొక్క బిలం స్థావరం. అత్యంత ప్రసిద్ధ డుకౌలీలీ ఈ ప్రాంతంలో మాత్రమే కనుగొనబడింది. కొహిమాలో ఏటా డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు జరుపుకునే హార్న్‌బిల్ పండుగ దేశీయ, విదేశీ పర్యాటకులకు పెద్ద ఆకర్షణగా మారింది, ఇది నాగాలాండ్‌లో పర్యాటక సౌకర్యాల అభివృద్ధికి దారితీసింది.

అతిపెద్ద ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకులకు అందించే ఆకర్షణలను సమర్పకులు  ఆకట్టుకునేలా ప్రస్తావించారు. 70% అటవీ విస్తీర్ణం, 26 ప్రధాన తెగలకు నివాసంగా ఉన్న రాష్ట్రం, ప్రతి కొన్ని కిలోమీటర్ల తరువాత కొత్త సంస్కృతి, సంప్రదాయం, మాండలికాలను అనుభవించడానికి ప్రయాణికులకు అవకాశం ఇస్తుంది. తవాంగ్, సంగ్టి లోయ అందం సందర్శకులకు అద్భుత కథల దృశ్యాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. ఫిబ్రవరిలో జరుపుకునే లోసర్ పండుగను ప్రముఖంగా ప్రస్తావించారు.

వెబినార్ లో మహిళా కేంద్రంగా  అసోం టెక్స్‌టైల్ రంగాన్ని ప్రదర్శించారు. స్థానికులు తమ కళలను, ఇతర ప్రత్యేక ఆసక్తికర పర్యటన ఆకర్షణలు ప్రదర్శించారు.

సిక్కిం లో సుస్థిరమైన పర్యాటక అనుభవాలు, పర్యావరణ ఆకర్షణలు కూడా ఆ రాష్ట్రం ఈ రంగంలో సాధిస్తున్న విజయానికి అడ్డం పడుతుంది. 

2020 ఏప్రిల్ 14న ప్రారంభమైన దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ లో ఇప్పటి వరకు 25 ప్రదర్శనల ద్వారా దేశం నలువైపులా ఉన్న పర్యాటక ఆకర్షణలు కళ్ళకు కట్టినట్టు ఆవిష్కృతం చేయగలిగారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కింద ఏర్పాటు చేసిన నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ ఈ వెబినార్ లను నిర్వహించడంలో సాంకేతికత ను అందిస్తోంది. 

వెబినార్ సెషన్స్ లో పాల్గొదలచిన వారు  https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/ సైట్ లోకి వెళ్ళవచ్చు. పర్యాటక శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో లభ్యమవుతుంది. 

దేఖో అప్నా దేశ్ వెబినార్ తర్వాతి కార్యక్రమం 2020 మే 30వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది.  "దృఢమైన స్థిరత్వం - కచ్ ప్రేరణాత్మక కథ"  పై జరిగే వెబినార్ లో రిజిస్టర్ కావడానికి https://bit.ly/KutchDAD ని క్లిక్ చేయండి. 

****



(Release ID: 1627653) Visitor Counter : 211