వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వ్యాపార సంఘాల ప్రతినిధులను కలిసిన - శ్రీ పీయూష్ గోయల్.

కోవిడ్-19 తో పోరాడటానికి వీలుగా సామర్థ్యాన్ని పెంపొందించుకోడానికి దేశం లాక్ డౌన్ పీరియడ్‌ను ఉపయోగించుకుంది.


ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద ఎమ్.ఎస్.ఎం.ఈ. ల కోసం ప్రకటించిన ఋణ ప్రయోజనం పొందడానికి వ్యాపారులు కూడా అర్హులే.


ఆర్థిక కార్యకలాపాల వృద్ధి ప్రారంభమయ్యింది.

Posted On: 29 MAY 2020 9:59AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాపార సంఘాల ప్రతినిధులను కలిశారు.  లాక్ డౌన్ సమయంలో, కోవిడ్-9 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు సామర్థ్యాలను పెంపొందించుకోడానికీ దేశం తనను తాను సిద్ధం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.  మాస్కులు, శానిటైజర్లు, గ్లోవ్స్, పిపిఇ వంటి రక్షణ పరిసరాల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభించింది, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెరిగాయి మరియు ప్రజలలో అవగాహన ఏర్పడింది.  అసాధారణమైన ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఐక్యంగా పనిచేయాలని ప్రధానమంత్రి చేసిన పిలుపుకు ప్రజలు స్పందించారనీ, వారు ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు ఆదేశాలకు కట్టుబడి ఉన్నారనీ, ఆయన పేర్కొన్నారు.  ఇటువంటి సంక్షోభ సమయంలో ఆరోగ్య సేతు యాప్ ప్రజలకు ఒక రక్షణగా, ఒక స్నేహితునిగా, ఒక దూతగా అభివృద్ధి చేయడం జరిగింది.   ప్రజలు వారి జీవనశైలిని మార్చుకున్నారు మరియు పరిస్థితులలో భిన్నంగా జీవించడానికి, పని చేయడానికి, భిన్నంగా అధ్యయనం చేయడానికి త్వరగా స్వీకరించారు.  ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోలిస్తే, ఎక్కువ వనరులు మరియు తక్కువ జనాభా ఉన్న మనం మెరుగైన స్థితిలో ఉన్నందున, ప్రధానమంత్రి తీసుకున్న, మరియు ప్రజలు కట్టుబడి ఉన్న సమయానుసారమైన మరియు సరైన నిర్ణయాలు దేశానికి సహాయపడ్డాయని శ్రీ గోయల్ అన్నారు.

మార్గదర్శకాల సడలింపు తర్వాత కూడా రిటైల్ వ్యాపారులు ఎదుర్కొంటున్న కొన్ని కష్టాల గురించి ఆయన మాట్లాడుతూ, అవసరమైన మరియు అవసరం లేని వస్తువులు అనే తేడా లేకుండా, మెజారిటీ దుకాణాలను తెరవడానికి అనుమతించామని చెప్పారు.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, మాల్స్‌లో మిగిలిన దుకాణాలను తెరిచే విషయంలో నిర్ణయాన్ని త్వరలో తీసుకోనున్నట్లు, ఆయన తెలిపారు.  కోవిడ్-19 తో పోరాడటం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆత్మనిర్బర్ ప్యాకేజీలో భాగంగా ఏం.ఎస్.ఎం.ఈ. లకు అందజేసే  3 లక్షల రూపాయల  క్రెడిట్ గ్యారెంటీ వ్యాపారులకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు.  ఎం.ఎస్.ఎం.ఈ. రంగం నిర్వచనం లో చేసిన మార్పులు కూడా వారికి సహాయపడతాయని చెప్పారు.  పరిష్కరించబడని సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్థిక మంత్రి కూడా సూచించారని ఆయన అన్నారు.  ఇ-కామర్స్ వ్యాపారం వల్ల బెదిరింపులకు గురికావద్దని శ్రీ గోయల్ రిటైల్ వ్యాపారులకు ధైర్యం చెప్పారు, ఎందుకంటే తమ సంక్షోభ సమయంలో  తమ పరిసరాల్లోని దుకాణదారులు మాత్రమే తమకు సహాయం చేశారని సామాన్య ప్రజలు గ్రహించారు. రిటైల్ వ్యాపారులకు బి 2 బిని సులభతరం చేయడానికి అవసరమైన యంత్రాంగంపై ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి విస్తరణకు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో ప్రభుత్వం పరివర్తన కార్యక్రమాలు చేపట్టిందని, ఇది భారతదేశం బలమైన దేశంగా మారడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.  టర్మ్ రుణాలు, ముద్ర రుణాలు మరియు ఇతర సమస్యలకు సంబంధించిన వర్తక సంఘం యొక్క ఇతర సమస్యల గురించి శ్రీ గోయల్ ప్రస్తావిస్తూ,  ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించి, పరిష్కారం కనుగొంటామని చెప్పారు.

ఆర్ధిక పునరుద్ధరణ ఆలోచనలో నలుగుతున్న అంశంగా పలు సూచికలు చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.  ఈ నెల విద్యుత్ వినియోగం గత ఏడాది ఇదే కాలంతో దాదాపు సమానంగా ఉంది, కాగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగింది.  ఏప్రిల్‌ నెలలో దాదాపు 60 శాతం తగ్గిన ఎగుమతులు, ఇప్పుడు కాస్త నెమ్మదిగా పెరుగుతున్నాయి. మరియు ఈ నెలలో క్షీణించిన ప్రాధమిక గణాంకాలు చాలా చిన్నవిగా ఉంటాయని సూచిస్తున్నాయి.  మరోవైపు, సేవల ఎగుమతులు గత నెలలో కూడా పెరిగాయి. గత నెలలో వస్తువుల ఎగుమతులలో తగ్గుదల కంటే,  దిగుమతులలో  తగ్గుదల ఎక్కువగా ఉంది. దీంతో వాణిజ్య లోటు తగ్గింది.  

గత రెండు నెలల్లో వ్యాపారులు, భారతీయ తయారీదారుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, భవిష్యత్తులో కూడా వారికి సహకరిస్తామని మంత్రి చెప్పారు.  భారతీయ వస్తువులను ఉపయోగించి, ప్రోత్సహించి, మద్దతు ఇవ్వాలని ఆయన వ్యాపారులకు పిలుపు నిచ్చారు.  విశ్వాసం, ధైర్యం, దృఢ సంకల్పంతో పనిచేస్తే, తప్పక విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని మంత్రి వారిని ప్రోత్సహించారు. 

 

 

****


(Release ID: 1627624) Visitor Counter : 346