గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కొవిడ్-19పై పోరాటంలో కీలకమైన చొరవ చూపిన కర్నల్ స్మార్ట్ సిటీ

మరింత రక్షణ ఉండేలా లైవ్ ట్రాకింగ్ యాప్, నమూనా సేకరణ కియోస్క్ ల ఏర్పాటు
రోజుకు 300 పైగా పీపీఈ కిట్ల తయారీ
హాని కలిగే అవకాశం ఉన్న జనాభాకు ముడి రేషన్, వండిన ఆహరం పంపిణీ

Posted On: 28 MAY 2020 5:03PM by PIB Hyderabad

కొవిడ్-19 పై పోరాటానికి కర్నల్ స్మార్ట్ సిటీ పలు చర్యలు చేపట్టింది. మౌలిక వైద్య సౌకర్యాలు ఈ చర్యల్లో చాల ముఖ్యమైనది. 1,577 పిపిఇ కిట్లతో సహా వైద్య మౌలిక సదుపాయాల లభ్యత  (2020 ఏప్రిల్ 15 నాటికి) నిర్ధారించబడింది; 13,348 ఎన్ -95 మాస్కులు; 66,076 మూడు పొరల మాస్కులు; 1,873 లీటర్ల శానిటైజర్లు; 434 వీటీఎం; 2,580 సోడియం హైడ్రోక్లోరైడ్; 295,805 చేతి తొడుగులు; 05 థర్మల్ స్కానర్లు; COVID రోగులకు 125 ఐసోలేషన్ వార్డులు; క్వారంటైన్ కోసం 1,000 అదనపు పడకలు; 92 డి-రకం, 36 బి-రకం ఆక్సిజన్ సిలిండర్ లభ్యత, 50 ఫంక్షనల్ వెంటిలేటర్లు.

కొవిడ్-19 మహమ్మారిపై యుద్ధంలో వైద్యులకు, ముందుండే ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈలు అతి ముఖ్యమైనవి.. పీపీఈ కిట్ల తయారీప్లాంట్ లో రోజుకి 300 కిట్లు పైగా ఉత్పత్తి చేస్తున్నారు. 

 

సగటున రోజుకు 4,000 చొప్పున 65,000 పైగా మాస్కులను స్వయం సహాయక గ్రూపులు తయారు చేశాయి. 250 స్వయం సహాయక గ్రూపులు భాగస్వమ్యమై ఇప్పటికే 52,000 మాస్కులను విక్రయించారు. 

కోవిడ్ రోగులకు కర్నాల్ సిటీలో 3,396 పడకల సామర్థ్యం ఉంది - ఇందులో 1,632 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి; 1,224 ధర్మశాలలు, 540 హోటళ్ళు ఉన్నాయి. గుర్తించిన 1,000 పడకలలో - 43 మంది పౌరులు ప్రభుత్వ భవనంలో క్వారంటైన్ అయ్యారు. 914 మంది గృహ క్వారంటైన్ లో ఉన్నారు. అంతేకాకుండా, గృహ క్వారంటైన్ లో ఉన్న రోగులను పోలీసులు సెల్ టవర్ స్థానం ద్వారా పర్యవేక్షిస్తారు. 

గృహ క్వారంటైన్ లో ఉన్నవారిని పర్యవేక్షించడానికి ఒక యాప్ ని అభివృద్ధి చేశారు. 

రోజుకు 150 నమూనాలను పరీక్షించే ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.

వలస కార్మికులకు కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. కర్నల్ లో వలస కార్మికుల కోసం 7 షెల్టర్ హోమ్ లలో 784 మందికి స్థానం కల్పించారు. వీరందిరికి సరైన సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయ్యారు. 

జిల్లా స్థాయిలో కరోనా సహాయ నిధిని ఏర్పాటు చేశారు. దినసరి వేతన కార్మికులకు బియ్యం, గోధుమ, వంట నూనె, పప్పు దినుసులు,, చక్కర, ఉప్పు, మసాలా, పసుపు, సబ్బు వంటి వస్తువుల రేషన్ అందజేశారు. 

ఇక్కడి మొత్తం 15 లక్షల మంది జనాభాలో 5 లక్షల మంది అసంఘటిత రంగానికి చెందిన వారు. నిర్మల్ కుటియా సహకారంతో జిల్లా యంత్రాంగం అన్నార్తుల ఆకలి తీర్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు 97 ప్రదేశాల్లో భోజనం అందిస్తున్నారు. 

నిత్యావసర వస్తువులను ఇంటికే అందించే చర్యలు చేపట్టారు. 



(Release ID: 1627531) Visitor Counter : 269