ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

42.75 శాతానికి పెరిగిన రికవరీ రేటు

Posted On: 28 MAY 2020 5:28PM by PIB Hyderabad

కరోనా వైరస్‌ నివారణకు క్రియాశీల, ముందస్తు చర్యల విధానం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలను అత్యున్నత స్థాయిలో క్రమం తప్పకుడా సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తున్నారు.

    తాజా సమాచారం ప్రకారం... దేశవ్యాప్తంగా 86,110 మంది రోగులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 67,691 మందికి వ్యాధి నయమైంది. గత 24 గంటల్లో 3,266 మందికి వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో, రికవరీ రేటు 42.75 శాతానికి పెరిగింది.

    కొవిడ్‌-19కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలపై ప్రామాణిక, తాజా సమాచారం కోసం https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను క్రమం తప్పకుండా చూస్తుండాలి.

    కొవిడ్‌-19కు సంబంధించిన సాంకేతిక సమాచారం కోసం technicalquery.covid19[at]gov[dot]in కు ఈమెయిల్‌ చేయవచ్చు. ఇతర అంశాలపై సమాచారం కోసం ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

    కొవిడ్‌-19కు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే 'కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ' హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-11-23978046 లేదా 1075 (టోల్‌ ఫ్రీ)కు కాల్‌ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్‌ నంబర్లు https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో లభ్యమవుతాయి.
 



(Release ID: 1627527) Visitor Counter : 165