పర్యటక మంత్రిత్వ శాఖ
దేఖో అప్నా దేశ్ సిరీస్ లో భాగంగా 'సంస్కృతి, పర్యాటకం- గోవా ఆర్థికవ్యవస్థకు రెండు పార్శ్వాలు' పేరుతో 24వ వెబినార్ ను నిర్వహించిన పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ
Posted On:
27 MAY 2020 4:52PM by PIB Hyderabad
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్, “సంస్కృతి, పర్యాటక రంగం- గోవా ఆర్థిక వ్యవస్థ రెండుపార్శ్వాలు' 2020 మే 26 న నిర్వహించారు. సంస్కృతి, చరిత్ర, వారసత్వం, నిర్మాణ అద్భుతాలను భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానం 'గోవా' గురించి దీనిలో ప్రదర్శించారు. అంతగా తెలియని ప్రదేశాలు, చరిత్ర, వాస్తుశిల్పం, సంస్కృతి మరియు వారసత్వంతో పర్యాటకులు అన్వేషించడానికి ఈ సిరీస్ పలు అంశాలను వెల్లడించింది. శ్రీ సంజీవ్ సర్దేసాయ్ (చరిత్రకారుడు), శ్రీ అర్మినియో రిబెరియో (ఆర్కిటెక్ట్), శ్రీమతి సవాని శెట్టి (పురావస్తు శాస్త్రవేత్త) సమర్పించిన వెబ్‌నార్ లో గోవా గొప్పతనాన్ని ప్రదర్శించారు. ఇది శతాబ్దాల లోతైన చరిత్ర, సాంస్కృతిక ఇచ్చిపుచ్చుకోవడం, సృజనాత్మకత విస్తరించి ఉంది. ప్రసిద్ధ బీచ్‌లు, రాత్రి జీవితానికి అతీతమైనది.
వెబినార్ లో గోవా చరిత్రను ఆవిష్కరించారు. కదంబ రాజ్యం నుండి విజయనగర సామ్రాజ్యం, బహమనీ సుల్తానేట్, బీజాపూర్ సుల్తానేట్ మధ్యయుగ కాలంలో, గోవాపై పోర్చుగీస్ దండయాత్ర, బీజాపూర్ సుల్తానేట్ను ఓడించడం వరకు సాగింది. సుమారు 450 సంవత్సరాలు కొనసాగిన పోర్చుగీస్ పాలన గోవా సంస్కృతి, వంటకాలు, వాస్తుశిల్పాలను ఎలా ప్రభావితం చేసిందో వక్తలు మాట్లాడారు.
తీరప్రాంత వెంబడి సముద్ర శిలాజాలు, ఖననం చేసిన సముద్రపు గవ్వలు, స్థలాకృతికి సంబంధించిన ఇతర లక్షణాలు భౌగోళిక టెక్టోనిక్ ప్లేట్ కదలిక కారణంగా గోవా సముద్రం నుండి బయల్పడిందని సూచిస్తున్నాయి. సఫమాస్జిద్, కాన్వెంట్ ఆఫ్ సెయింట్ మోనికా, ఆర్చ్ బిషప్స్ కేథడ్రల్, బాసిలికా ఆఫ్ గోవా, దేశ్ ప్రభు ప్యాలెస్, పోర్చుగీస్ నిర్మించిన సౌందేకర్ ప్యాలెస్, డియోపాలెస్, టిబి కున్హా మాన్షన్, సోలార్ కోలాకోస్ హౌస్, పంజిమ్ చర్చి వంటి కొన్ని కథా కథనాలు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అంతర్లీనమై ఉన్న గోవా చరిత్రను కళ్ళకు కట్టినట్టు వివరించాయి. దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్‌ను పర్యాటక మంత్రిత్వ శాఖ క్రియాశీల సాంకేతిక సహకారంతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ నుండి ప్రజల అవగాహన కోసం అందించినది. డిజిటల్ అనుభవాన్ని ఉపయోగించి దీనికి సంబంధించిన వారందరి సమాచారం కోసం సమర్పించబడింది.
వెబినార్ సెషన్‌లు ఇప్పుడు https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/ లో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. తదుపరి దేఖో అప్నా దేశ్ వెబినార్ 28 మే 2020 న - 1100-1200 గంటలకు ఈశాన్య భారతం అంశంగా జరుగుతుంది. నమోదు చేయడానికి క్లిక్ చేయండి: https://bit.ly/NorthEastDAD
(Release ID: 1627205)
Visitor Counter : 216