మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో విదర్భ మరియు మరాట్వాడా లలో పాల ఉత్పత్తుల సరఫరాకు కృషి చేస్తున్న - మదర్ డెయిరీ .
విదర్భ మరియు మరాట్వాడా ప్రాంతాలలో రోజుకు సరాసరి 2.55 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్న - మదర్ డెయిరీ .
Posted On:
19 MAY 2020 11:19AM by PIB Hyderabad
దేశం కోవిడ్ -19 మహమ్మారితో పోరాడుతున్న సమయంలో, లాక్ డౌన్ కింద, ప్రజలకు ఆహారం మరియు ఆరోగ్య సేవలు వంటి నిత్యావసరాల లభ్యత చాలా ప్రధానమైనది. వినియోగదారులకు వారి సరఫరా అందుబాటులో ఉండడం ముఖ్యం కాగా, నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ, రైతులు తమ ఉత్పత్తులకు తగిన విలువ జోడించి, మార్కెట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో మరింత చొరవ తీసుకుని, విదర్భ మరియు మరట్వాడా ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో జాతీయ పాల ఉత్పత్తుల అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి.) అనుబంధంగా ఉన్న మదర్ డైరీ సంస్థ పాల ఉత్పత్తుల సరఫరాను స్థిరీకరించడానికి కృషి చేసింది. నాగపూర్ నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న మదర్ డెయిరీ రైతులకు అన్ని విధాలా సహకరిస్తూ, విదర్భ మరియు మరాట్వాడా ప్రాంతాలలో రోజుకు సరాసరి 2.55 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది.
రైతులు, వినియోగదారులతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి మదర్ డెయిరీ కట్టుబడి ఉంది. వాస్తవం ఏమిటంటే, ఈ ప్రాంతంలో కోవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి, మదర్ డైరీ తన పాల సేకరణ కార్యకలాపాలను ఒక్క రోజు కూడా నిలిపివేయలేదు. దానికి బదులుగా, ఈ పరీక్షా సమయాలు మరియు లీన్ సీజన్ ఉన్నప్పటికీ పాల సేకరణను 16 శాతం పెంచింది.

కొత్తగా కలిసిన వారితో సహా మొత్తం సుమారు 24,000 మంది రైతులు మదర్ డెయిరీ లో సభ్యులుగా ఉన్నారు. విదర్భ మరియు మరాట్వాడా కు చెందిన 10 జిల్లాలోని సుమారు 2,500 గ్రామాల్లో మదర్ డెయిరీ పాల సేకరణ విధానం అమలులోఉంది. మదర్ డెయిరీ తో అనుబంధమున్న రైతులందరూ 10 రోజులకు ఒకసారి చొప్పున తమ ఉత్పత్తులకు రావలసిన మొత్తాలను తమ తమ బ్యాంకుఖాతాల ద్వారా సకాలంలో పొందుతున్నారు. పాల నాణ్యత, తూకం అన్నీ పారదర్శక విధానంలో కొనసాగుతూ ఉంటాయి. గత రెండు నెలలలో రైతులకు చెల్లిచవలసిన మొత్తం 65 కోట్ల రూపాయలు వారికి చెల్లించడం జరిగింది. పాల ఉత్పత్తిదారులకు చెందిన పశువులకు అవసరమైన సమతుల పచ్చ గడ్డి, ఇతర మేత పదార్ధాలను అందించడానికి కూడా మదర్ డెయిరీ తగిన ఏర్పాట్లు చేసింది.
కరోనా వ్యాప్తి ప్రారంభమైన రోజు నుండీ, మదర్ డెయిరీకి సంబంధమున్న అన్ని ప్రాంతాల్లో భద్రతను నిర్ధారించడానికి, అవగాహన కల్పించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసింది. రైతులు మాస్కులు ఉపయోగించాలనీ, రైతులందరూ కలిసే ప్రదేశాల్లో, నేలమీద గీసిన గుర్తులు ఆధారంగా సామాజిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు. ఆదేవింధంగా, పాల సేకరణ, రవాణాలో నిమగ్నమైన సిబ్బంది కూడా అన్ని నిబంధనలతో పాటు ముఖ్యంగా పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
నాగపూర్ మరియు పరిసర పట్టణాలలో ఏర్పాటు చేసిన సుమారు 900 కుపైగా పాల బూత్ లు ద్వారా భద్రతా చర్యలు పాటిస్తూ, మదర్ డెయిరీ తన వినియోగదారులకు నిరంతరాయంగా పాల సరఫరా కొనసాగిస్తోంది. సివిల్ లైన్స్ ప్రాంతంలో ఎమ్.ఎల్.ఏ. వసతి గృహం వద్ద నాగపూర్ మునిసిపల్ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ జోన్ వద్ద కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం మదర్ డెయిరీ ఒక తాత్కాలిక పాల విక్రయ కేంద్రాన్ని నెలకొల్పింది.
***
(Release ID: 1625263)
Visitor Counter : 180