ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన 8 రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, సీనియ‌ర్ అధికారుల‌తో కోవిడ్ అనంత‌ర ప‌రిణామాల‌పై చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

Posted On: 16 MAY 2020 9:00PM by PIB Hyderabad

 

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు ,పెన్ష‌న్లు, అణు శ‌క్తి, అంత‌రిక్ష‌ శాఖ స‌హాయ‌మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన‌ ఎనిమిది రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో కోవిడ్ వ్యాధి వ్యాప్తి చెందిన అనంత‌ర ప‌రిణామాల  గురించి చర్చించారు. .
  ఒక గంట పాటు జ‌రిగిన ఈ సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ లో, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం , త్రిపుర ప్రభుత్వాల ప్రతినిధులు అక్క‌డి ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ప్ర‌త్యేకించి,  వలస కార్మికులు , వివిధ‌ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన  ఇతరుల ప్ర‌యాణాల‌పై త‌మ‌వ‌ద్ద ఉన్న స‌మాచారం  అందించారు. అలాగే రాగల రోజుల‌లో దేశంలోని వివిధ ప్రాంతాల‌పై , ప్రధానమంత్రి ప్ర‌క‌టించిన  20 లక్షల కోట్ల రూపాయ‌ల ఆర్థిక ప్యాకేజీ  చూప‌నున్న సానుకూల  ప్ర‌భావం గురించి చ‌ర్చించారు. రాబోయే రోజుల్లో ఇవ్వాల్సిన సడలింపుల గురించి కూడా వారు చ‌ర్చించారు..
కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చాక‌చ‌క్యంగా స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తీరుపై డాక్టర్ జితేంద్ర సింగ్  ప్ర‌శంస‌లు కురిపిచారు. క‌రోనా వ్యాప్తిని స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నందుకు ఈశాన్య‌రాష్ట్రాల‌కు స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు వ్య‌క్త‌మౌతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈశాన్య ప్రాంతాలకు  ప్రజల త‌ర‌లింపు అంశాన్ని చర్చిస్తూ మంత్రి,  డాక్టర్ జితేంద్ర సింగ్ , ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రయాణికుల జాబితాను స్వీకరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశార‌ని,, రెసిడెంట్ కమిషనర్లు , నోడల్ అధికారుల‌తో ఈ విష‌య‌మై ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమన్వయం తో ప‌నిచేస్తుంద‌న్నారు. త‌ద్వారా వారి ని స్వ‌స్థ‌లాల‌కు చేర్చే ప్రక్రియ‌ను సుల‌భ‌త‌రం చేస్తార‌న్నారు. అలాగే ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ కూడా తెలిపారు. నిన్న ఒక రైలు గుజరాత్ నుంచి గౌహ‌తికి వెళుతుండ‌గా మేఘాల‌య‌తోపాటు ప‌లు రాష్ట్రాల‌కు చెందిన వారికి ఆరైలులో చోటు క‌ల్పించిన విష‌యాన్ని ఆయన గుర్తు చేశారు.
 
గౌహ‌తికి  విమాన సర్వీసును తిరిగి ప్రారంభించాలన్న‌ కొన్ని రాష్ట్రాల డిమాండ్‌కు స్పందిస్తూ  డాక్ట‌ర్  జితేంద్ర సింగ్ ,దీనిపై హోం మంత్రిత్వ శాఖ , పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తగిన సమయంలో  నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు  . మ‌రిన్ని  రైళ్లను తిరిగి ప్రారంభించడం గురించి వ‌చ్చిన విన‌తుల‌పై మాట్లాడుతూ,  ఈ విషయాన్ని ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖతో చ‌ర్చించామ‌ని, వారు ఈ దిశ‌గా కృషి చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

రాబోయే రోజుల్లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనెర్)  ప్రాధాన్యత, అభివృద్ధి  ప్రాజెక్టుల పనులను తిరిగి ప్రారంభించడం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ముందు నిర్ణ‌యించిన విధంగా వీటిని స‌కాలంలో పూర్తి చేసేందుకు  ఫాస్ట్ ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.
లాక్ డౌన్  నేపథ్యంలో కోల్పోయిన సమయాన్ని ఈశాన్య కౌన్సిల్ , ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేప‌ట్ట‌డానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు , ఇతర సంబంధిత పత్రాలను సమర్పించడాన్ని వేగవంతం చేయాలని ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

రాబోయే రోజుల్లో ఆయా రాష్ట్రాలు , వివిధ ప్రాంతాలలో సడలింపులు చేప‌ట్ట‌డానికి సాధ్యమయ్యే అవకాశాల గురించి ప్రధాన కార్యదర్శులు తమ అభిప్రాయాలు తెలిపారు. నిలిపివేసిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడంపై శ్ర‌ద్ధ‌పెట్టారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి ఇంద్ర‌జిత్ సింగ్, ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్  కార్య‌ద‌ర్శి మోసెస్‌, ఈశాన్య రాష్ట్రాల సీనియ‌ర్ అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.



(Release ID: 1624658) Visitor Counter : 178