శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి సిఎస్ఐఆర్ సంస్థ, రోగనిర్ధారణ పరిష్కారాలు , రిస్క్ స్ట్రాటిఫికేషన్ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఇంటెల్ ఇండియా , ఐఐఐటి- హైదరాబాద్‌లతో కలిసి పనిచేస్తోంది.

Posted On: 15 MAY 2020 6:33PM by PIB Hyderabad

ఎస్‌.ఎ.ఆర్‌.ఎస్ -సిఒవి-2(SARS-CoV-2) వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి  స‌త్వ‌ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం,  ప్రమాదంలో ఉన్న రోగులను అంచనా వేయగల సామర్థ్యం చాలా ముఖ్యమైనది. ఇత‌ర ర‌కాల జ‌బ్బులు కూడా  ఉన్న రోగులకు ఎపిడెమియాలజీ AI- ఆధారిత రిస్క్ స్ట్రాటిఫికేషన్‌ను అర్థం చేసుకోవడానికి వేగంగా తక్కువ ఖర్చుతో కూడిన కోవిడ్  పరీక్షలు జ‌ర‌ప‌డం ,కరోనా వైరస్ జన్యు శ్రేణిని  ఛేదించ‌డంలో సహాయపడటానికి సిఎస్ఐఆర్ సంస్థ‌, హైదరాబాద్ ఇంటెల్ ఇండియా , ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) తో కలిసి పనిచేస్తోంది.
ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా, ఇంటెల్ ఇండియా, మ‌ల్టిపుల్ అప్లికేష‌న్లు, పరీక్షా పరికరాలు, డేటా సేకరణ , అగ్రిగేషన్ గేట్‌వేలు, డేటా మార్పిడి ఎస్‌డికె , AI మోడల్-హబ్ ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉన్న ఎండ్-టు-ఎండ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
సిఎస్ఐఆర్ క‌న్‌స్టిట్యుయెంట్ ప్ర‌యోగ‌శాల‌లైన సిఎస్ఐఆర్ -ఐజిఐబి, సిఎస్ఐఆర్‌-సిసిఎంబ‌, సిఎస్ఐఆర్‌-ఐఎంటిఇసిహెచ్‌, సిఎస్ఐఆర్‌-సిఎల్ ఆర్ఐ వంటి ప్ర‌యోగ‌శాల‌లు , సమగ్ర విశ్లేషణలను నిర్వహించడంలో వివిధ ఆసుపత్రులు ,డ‌యాగ్న‌స్టిక్ సంస్థ‌ల చెయిన్‌ల‌తో పని చేస్తాయి.  అంటువ్యాధిని ఎదుర్కోవటానికి దీర్ఘకాలిక సంసిద్ధత కోసం ఔషధ ,వ్యాక్సిన్ ఆవిష్కరణకు సహాయపడే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అల్గారిథమ్‌లను  ఐఐటి - హైద‌రాబాద్ అభివృద్ధి చేస్తుంది.

“కోవిడ్ -19 సవాలును ఎదుర్కోవడంలో బహుళ-విభాగాల‌ భాగస్వామ్యం ఎంతో  కీలకం ,  ఐఐఐటి-హైదరాబాద్  ఇంటెల్ ఇండియాల‌తో  సిఐఎస్ఐఆర్,సహకరించడం సంతోషంగా ఉంది, ఇది జెనోమిక్స్‌, బిగ్ డేటా  కృత్రిమ మేథ కు ఒక‌దానికొక‌టి  తోడ్ప‌డ‌తాయి . . అని డిజి, సిఎస్ఐఆర్ డాక్ట‌ర్ శేఖ‌ర్ సి మండే అన్నారు.
కోవిడ్ -19 కు వ్యతిరేక పోరాటంలో పరిష్కారాలను వేగంగా అభివృద్ధి చేయ‌డానికి, అమలు చేయడానికి సిఎస్ఐఆర్ సంస్జతో , ఐఐఐటి- హైదరాబాద్‌తో కలిసి పనిచేయడానికి ఇంటెల్ ఇండియా కట్టుబడి ఉంది. ఇంటెల్ జీవితాలను సుసంపన్నం చేసే సాంకేతికతలను సృష్టిస్తుంది .ఇంటెల్ జీవితాన్నిసుసంప‌న్నం చేసే సాంకేతిక‌త‌ల‌ను రూపొందిస్తుంది. ఈ చొర‌వ‌, మ‌న స్థానిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా స్కేల‌బుల్ ప‌రిష్కారాల‌ను క‌నుగొన‌డానికి, అలాగే ఇందుకు అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించ‌డంపై మ‌రింత దృష్టిని పెడుతుంది. సార్స్ -సిఒవి-1 వ్యాపించిన‌ప్ప‌టినుంచి   సాంకేతికత చౌకగా, మరింత అందుబాటులో, మరింత సమర్థవంతంగా మారింది.  సార్స్ -సిఒవి -2 కు వ్యతిరేకంగా  పోరాటంలో ఇది కీలకంగా మారింది, ఎందుకంటే ఇది డయాగ్నస్టిక్స్, డ్రగ్ , టీకా ఆవిష్కరణను అధిక అంచనా, వేగం, ఖచ్చితత్వంతో అనుమతిస్తుంది, ” అని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ ఇంటెల్ కార్పొరేషన్ డేటా ప్లాట్‌ఫామ్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నివృతి రాయ్ పేర్కొన్నారు

ఐఐఐటి - హైద‌రాబాద్ డైర‌క్ట‌ర్ శ్రీ పి.జె.నారాయ‌ణ త‌మ అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సిఎస్ఐఆర్ లేబ‌రెట‌రీల‌కు చెందిన దేశ అత్యున్న‌త శ్రేణి శాస్త్ర‌వేత్త‌ల‌తో , అలాగే ఇంటెల్ వంటి ప‌రిశ్ర‌మ లీడ‌ర్ల‌తో కోవిడ్ -19 కు సంబంధించిన మెరుగైన ప‌రిష్కారాలు క‌నుగొనేందుకు, ఇత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌లిసి ప‌నిచేయ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంద‌న్నారు. ఈప‌రిశోధ‌న‌ల‌లో త‌మ‌వంతు పాత్ర‌ను, ఆల్గోరిథ‌మ్స్‌, సైన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్లో త‌మ నైపుణ్యాల విష‌యంలో త‌మ‌వంతు పాత్ర‌పోషించ‌డానికి సిద్దంగా ఉన్నామ‌న్నారు.

 



(Release ID: 1624219) Visitor Counter : 215