వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మిడుతల నియంత్రణపై పురుగుమందుల పరిశ్రమ ప్రతినిధులతో చర్చించిన వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి యు.కె నుండి కొత్త యంత్రాలకు ఆర్డర్ ఇచ్చినట్టు వెల్లడించిన శ్రీ తోమర్


రాజస్థాన్, పంజాబ్ లో 14,000 హెక్టార్లకు పైగా భూముల్లో మిడుతలు నియంత్రణ

Posted On: 13 MAY 2020 6:08PM by PIB Hyderabad

 

వ్యవసాయ భూములను మిడుతుల దాడి నుండి కాపాడడానికి వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్పురుగుల మందుల తయారీ పరిశ్రమల ప్రతినిధులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంభాషించారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించినట్టు వ్యవసాయం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత రంగమనిపంట కోతల విషయంలో కానీవిత్తు నాటినప్పుడు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి అన్నారు. ముడుతల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. బ్రిటన్ నుండి కొత్త యంత్రాలను త్వరలోనే తెప్పిస్తున్నామని వ్యవసాయ మంత్రి వెల్లడించారు.   

మిడుతల దండయాత్ర గత సంవత్సరం మొట్టమొదట గుర్తించబడిందనిదశాబ్దాల తరువాత ఇది రావడం వల్ల రైతులకు వెంటనే తెలియలేదని ఆయన తెలిపారు. రైతుల సహకారంతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖసంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో చర్య తీసుకోవడంతో నష్టాలనునిరోధించగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.నష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఎన్డిఆర్ఎఫ్ నిధి నుండి కేంద్రం పరిహారం చెల్లించిందని అన్నారు. భారతదేశం ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం ప్రశంసించిందనిఈ దిశగా పురుగుమందుల పరిశ్రమ తగు విధంగా మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. నేటి వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయరైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ పార్శోత్తం రూపాలాశ్రీ కైలాష్ చౌదరి పాల్గొన్నారు.        

ప్రస్తుతం కోవిడ్ -19 లాక్‌డౌన్ ఉన్నప్పటికీమిడతల నియంత్రణ కార్యాలయాలు 2020 ఏప్రిల్ 11 నుండి 50 స్ప్రే పరికరాలు / వాహనాలతోజిల్లా పరిపాలన మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నాయి. ట్రాక్టర్ పై స్ప్రేయర్లువివిధ ప్రదేశాలలో మోహరించిన అగ్నిమాపక వాహనాలను మిడుత నియంత్రణలో ఉపయోగిస్తున్నారు. మిడుత నియంత్రణ సంస్థల నియంత్రణ సామర్థ్యాన్ని పెంచడానికి అదనపు పరికరాలు కూడా సేకరిస్తున్నారు.
జిల్లాల వారీగా 10.05.2020 నాటికి నియంత్రణ వివరాలు:

జిల్లా పేరు (రాష్ట్రం)

శుద్ధి చేసిన ప్రాంతాలు 

శుద్ధి జరిగిన విస్తీర్ణం (హెక్టార్లలో)

జైసల్మేర్ (రాజస్థాన్)

22

2114

శ్రీగంగానగర్ (రాజస్థాన్)

57

3220

జోద్పూర్ (రాజస్థాన్)

13

3215

బార్మర్ (రాజస్థాన్)

31

3835

నాగౌర్ (రాజస్థాన్)

4

1020

అజ్మీర్ (రాజస్థాన్)

2

235

పాలి (రాజస్థాన్)

2

75

ఫజిల్క (పంజాబ్)

19

585

మొత్తం 

135

14299

 

రాబోయే సీజన్ కోసంమిడుత సమస్యను పరిష్కరించడానికి వెంటనే పనులు చేపట్టారు. నైరుతి ఆసియా దేశాలలో (ఆఫ్ఘనిస్తాన్ఇండియాఇరాన్ మరియు పాకిస్తాన్) మిడుతల నియంత్రణపై ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశం 2020 మార్చి 11 న న్యూ ఢిల్లీలో ఎఫ్ఏఓ  కార్యాలయంలో జరిగింది. కేంద్ర సహాయ మంత్రి (వ్యవసాయం) శ్రీ కైలాష్ చౌదరికార్యదర్శి (వ్యవసాయ సహకారం మరియు రైతు సంక్షేమం) శ్రీ సంజయ్ అగర్వాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంసభ్య దేశాల సాంకేతిక అధికారుల వర్చువల్ సమావేశాలు ప్రతి సోమవారం విసి ద్వారా జరుగుతున్నాయి మరియు ఇప్పటివరకు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో సాంకేతిక సమాచారం మార్పిడి జరుగుతుంది. 

 మిడుతల తాజా స్థితిసంసిద్ధతను 2020 ఫిబ్రవరిమే నెలల్లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శులు మరియు జిల్లా అధికారులతో కార్యదర్శి (ఎసి అండ్ ఎఫ్‌డబ్ల్యు) స్థాయిలో సమావేశాలు మరియు విసిలను నిర్వహించడం ద్వారా సమీక్షించారు. రాబోయే సీజన్‌లో గత అనుభవాల ఆధారంగా వ్యూహాన్ని రూపొందించారు. మిడుత సూచనల గురించి రాష్ట్రాలకు అవగాహన కల్పిస్తున్నారు. స్థితిని సమీక్షించడానికిమిడుత దాడిని ఎదుర్కోవటానికి సమర్థవంతమైన నియంత్రణను నిర్ధారించడానికి 2020 మే 06 న జరిగిన సమావేశంలో వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్ వివిధ సూచనలు ఇచ్చారు.

సాధారణంగారుతుపవనాల రాకతోమిడుతల దండు జూన్ / జూలై వేసవిలో సంతానోత్పత్తి కోసం పాకిస్తాన్ ద్వారా భారతదేశ షెడ్యూల్డ్ ఎడారి ప్రాంతాలలోకి ప్రవేశిస్తాయి,  సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్ మరియు పంజాబ్ లో ఏప్రిల్ 30 నుండి ఈ సమూహాలు నివేదించబడ్డాయికొత్త సమూహాలకు వ్యతిరేకంగా నియంత్రణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పాకిస్థాన్ లో  మునుపటి సీజన్ అనియంత్రిత సమూహాలు నిరంతరం సంతానోత్పత్తి చేయడం దీనికి ఒక కారణం. పాకిస్తాన్ నుండి వచ్చే బలమైన గాలులతో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఈ పింక్ అపరిపక్వ ఉన్నవి రాత్రి సమయంలో చెట్లపై స్థిరపడతాయి. ఎక్కువగా పగటిపూట ఎగురుతాయి.మిడుతల నియంత్రణకు కేంద్రం 10 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలతో కలిసి కేంద్రం దేశవ్యాప్తంగా లక్షల హెక్టర్లపై దృష్టి పెట్టింది.

గత సంవత్సరంపురుగుమందులుట్రాక్టర్ పై ఏర్పాటు చేసిన స్ప్రేయర్ వాడకానికి సంబంధించిన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహాయం చేశాయి. 2019-20 సంవత్సరంలోభారతదేశంలో భారీ మిడుత దాడి జరిగిందిదీనిని మిడుతల నియంత్రణ సర్కిల్ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర వ్యవసాయజిల్లా పరిపాలన అధికారులతో విజయవంతంగా నియంత్రించారు. నియంత్రణ కార్యకలాపాలు మే 21, 2019 నుండి ఫిబ్రవరి 17, 2020 వరకు జరిగాయి;  మొత్తం 4,03,488 హెక్టార్ల విస్తీర్ణంలో చర్యలు చేపట్టి మిడుత సమూహాలను నియంత్రించారు.

 

*****


(Release ID: 1623713) Visitor Counter : 296