హోం మంత్రిత్వ శాఖ
విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటను సమీక్షించిన గౌరవ ప్రధాన మంత్రి
క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Posted On:
07 MAY 2020 5:35PM by PIB Hyderabad
విశాఖపట్నం గ్యాస్ లీక్ సంఘటనకు ప్రతిస్పందనగా తీసుకుంటున్న చర్యల గురించి చర్చించేందుకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బాధిత ప్రజల భద్రత కోసం, విపత్తు కారణంగా సమస్యలకు లోనైన ప్రాంతాన్ని సురక్షితం చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి శ్రీ అమిత్ షా, హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ జి.కిషన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ రోజు ఉదయం ఈ సంఘటన గురించి తొలుత సమాచారం అందుకున్న ప్రధాని, హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని పరిష్కరించేందుకు కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. వారు పరిస్థితిని మరింత లోతుగా, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ సమావేశం జరిగిన వెంటనే, కేబినెట్ కార్యదర్శి హోం వ్యవహారాలు, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పులు, కెమికల్స్ మరియు పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక వివరణాత్మక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్.డి.ఎం.ఎ), మరియు డైరక్టర్ జనరల్ (డి.జి), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్) సభ్యులు, డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డి.జి.హెచ్.ఎస్) మరియు ఎయిమ్స్ డైరక్టర్ మరియు ఇతర వైద్య నిపుణులు క్షేత్ర స్థాయిలో పరిస్థితుల నిర్వహణకు మద్ధతు ఇచ్చే దిశగా నిర్థిష్ట దశలను రూపొందించడానికి ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శితో కలిగి సమావేశంలో పాల్గొన్నారు.
.
పూణేకు చెందిన ఎన్.డి.ఆర్.ఎఫ్.కు చెందిన సి.బి.ఆర్.ఎన్ (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్) యూనిట్ తో పాటు, నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ) నిపుణుల బృందంతో పాటు, నాగ్ పూర్ ను రాష్ట్ర ప్రభుత్వానికి మద్ధతుగా క్షేత్ర స్థాయిలో సంక్షోభ నిర్వహణలో, మరియు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం మరియు లీక్ యొక్క స్వల్పకాలిక, దీర్ఘకాలిక వైద్య ప్రభావం అంచనాల కోసం వెంటనే విశాఖపట్నం తరలించాలని నిర్ణయించారు.
విశాఖ పట్నం జిల్లాలోని గోపాల పట్నం మండలానికి చెందిన ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామంలో ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు రసాయన కర్మాగారంలో స్టైరిన్ గ్యాస్ లీకేజ్ సంఘటన జరిగింది. ఇది చుట్టు పక్కల గ్రామాలైన నరవ, బి.సి.కాలనీ, బాపూజీ నగర్, కంపాల పాలెం మరియు కృష్ణా నగర్ ను ప్రభావితం చేసింది. ప్రకృతిలో విషపూరితమైన స్టైరిన్ వాయువు చర్మం, కళ్ళకు సంబంధించిన సమస్యలను సృష్టించడమే కాక, శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది.
విశాఖపట్నం వద్ద సి.బి.ఆర్.ఎన్. సిబ్బందితో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్) బృందాన్ని రాష్ట్రప్రభుత్వం మరియు స్థానిక పరిపాలనకు మద్ధతుగా వెంటనే నియమించారు. ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం ఈ ప్రదేశం సమీపంలో నివసించే సంఘాలను వెంటనే తరలించడం జరిగింది. పూణే నుంచి ఎన్.డి.ఆర్.ఎఫ్. యొక్క ప్రత్యే సి.బి.ఆర్.ఎన్. యూనిట్ మరియు నాగ్ పూర్ నుంచి ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ. నిపుణుల బృందం, విశాఖ పట్నంలో ఉంది. అంతే కాకుండా, క్షేత్ర స్థాయిలో ఉన్న వైద్య అభ్యాసకులకు డి.జి.హెచ్.ఎస్. ప్రత్యేకమైన వైద్య సలహాలను అందిస్తుంది.
లీకైన్ గ్యాస్ యొక్క లక్షణాలు, దాని ప్రభావం, బహిర్గతం అయిన వారిలో సాధారణ లక్షణాలు, ప్రథమ చికిత్స చర్యలు, జాగ్రత్తలు, చేయవలసినవి మరియు చేయకూడనివి ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
(Release ID: 1621872)
Visitor Counter : 306