పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ వెబినార్ సీరీస్ లో “పంజాబ్-బియాండ్ బ్రోచర్” పేరిట పర్యాటక మంత్రిత్వ శాఖ 15వ వెబినార్

Posted On: 06 MAY 2020 8:34PM by PIB Hyderabad

పలు రాష్ర్టాల్లో అంతగా ప్రాచుర్యంలోకి రాని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా పంజాబ్ లో ఇలాంటి ప్రదేశాలను వెలుగులోకి తేవడం లక్ష్యంగా పర్యాటక మంత్రిత్వ శాఖ దేఖో అప్నా దేశ్ వెబినార్ సీరీస్ కింద “పంజాబ్-బియాండ్ ద బ్రోచర్” పేరిట ఒక వెబినార్ 2020 మే 5వ తేదీన విడుదల చేసింది. 
 
ఒక గమ్యానికి చేరేందుకు రెండు దారులున్నప్పుడు ఏది దగ్గరైతే ఆ రోడ్డు సాధారణంగా ప్రపంచానికి భిన్నంగా కనిపిస్తుంది. అలాగే  మనం తక్కువ మంది సందర్శించిన గమ్యం ఏదైనా చేరాలనుకుంటే అత్యంత సుందరమైన ప్రదేశాలే మనని ఆకర్షిస్తాయి. ఇంతవరకు చూడని ప్రదేశాలు సందర్శించాలనుకున్నప్పుడు మనం ఈ కోణంలోనే ఆలోచిస్తాం. పంజాబ్ లో ఇప్పటివరకు పర్యాటకులు ఎక్కువగా సందర్శించని, అంత ప్రాచుర్యంలో లేని ప్రదేశాలను చూపించడమే ఈ సెషన్ లక్ష్యం. 

పంజాబ్ లోని అలాంటి మూడు ప్రాంతాలు మఝా, దోబా, మాల్వాలపై ఈ వెబినార్ ను బ్రేక్ అవే గ్రూప్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శిల్పా శర్మ;  రచయిత్రి, పర్యాటక ప్రదేశాల రచయిత, ఆహార వ్యవహారాలకు సంబంధించిన విమర్శనాత్మక విశ్లేషకురాలు శ్రీమతి పునీతిందర్ కౌర్ సింధు సమర్పించారు. హరప్పన్ యుగం ప్రత్యేకతలు, బౌద్ధ అవశేషాలు, ఆఫ్ఘన్, మొఘల్ కాలం నాటి చారిత్రక కట్టడాల కీలక ప్రత్యేకతలున్న ప్రదేశాలు అన్నింటినీ ఈ వెబినార్ సందర్శింపచేస్తుంది. పంజాబ్ రాష్ట్ర రాచరిక వ్యవస్థకు చెందిన కథలు, బ్రిటిష్ యుగం నాటి కంటోన్మెంట్ ప్రాంతాలు, అమరవీరుల స్మారక చిహ్నాలు, మతపరమైన విశ్వాసం గల ప్రదేశాలు, పంజాబ్ కు చెందిన ప్రత్యేక పండుగలు వంటివన్నీ సమర్పకులు చక్కగా వివరించారు. 

పర్యాటకులకు పంజాబ్ కు చెందిన సంపూర్ణ అవగాహన కలిగేందుకు, వారు ఆయా ప్రదేశాల స్థానికులతో మమేకం అయ్యేలా చేయడానికి వీలుగా ఆ మూడు ప్రాంతాల్లోని భిన్న నగరాలు, అక్కడ బస చేయదగిన ప్రదేశాలు, స్థానిక సంస్కృతి, ఆహారాలు, జానపద కళలు అన్నింటి గురించి వివరించారు. అలాగే పంజాబ్ లో లోహ్రి, బసంత్ పంచమి, హోళి, బైశాఖి, తీజ్, దీపావళి  వంటి వేడుకల నిర్వహణ గురించి వివరించడంతో పాటు ప్రపంచంలోని ప్రాచీన సంగీత సమ్మేళనం ప్రపంచ హరివల్లభ్ సంగీత్ సమ్మేళన్ గురించిన ప్రస్తావన కూడా ఉంది. 

ఈ వెబినార్ ను https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured
లోను, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను సందర్శించవచ్చు.
తదుపరి వెబినార్ “గోవా : క్రూసిబుల్ ఆఫ్ కల్చర్” మే 7వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. గోవాకు చెందిన శతాబ్దాల క్రితం నాటి సాంస్కృతిక విశేషాలు, సంగీతం, ఆహారం, కళాత్మక నిర్మాణాలు, చిత్రకళ వంటివన్నీ ఇందులో ప్రదర్శిస్తారు. అందులో చేరేందుకు ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు… https://bit.ly/2SPNo0T

 



(Release ID: 1621758) Visitor Counter : 169