విద్యుత్తు మంత్రిత్వ శాఖ

బి.ఈ.ఈ. ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో భాగంగా 2018-19 ఏడాదికి రూ. 89,122 కోట్ల ఆదా

ఇంధన పొదుపుపై డేటాను విడుదల చేసిన విద్యుత్ శాఖ మంత్రి

2005 స్థాయితో పోలిస్తే భారతదేశం విద్యుత్ ఆదా ద్వారా మన ఆర్థిక వ్యవస్థను 20 శాతం ప్రభావితం చేస్తుంది

Posted On: 06 MAY 2020 6:33PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మరియు నవ్య & పునరుత్పాదక ఇంధన శాఖ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖల సహాయ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ రోజు వీడియో కాన్ఫరెస ద్వారా 2018-19 ఏడాదికి ఇంధన సామర్థ్య చర్యల ప్రభావం (ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ ఫర్ ద ఇయర్ 2018-19)పై ఒక నివేదిక విడుదల చేశారు. 2030 నాటికి 2005 స్థాయిలతో పోల్చితే ఆర్థిక వ్యవస్థ విద్యుతు వ్యవస్థ ప్రభావాన్ని 33 నుంచి 35 శాతానికి తగ్గిస్థామని కాప్-21లో ప్రతిజ్ఞ చేశామని, ఇప్పుడు మన శక్తి సామర్థ్య కార్యక్రమాలతో 20 శాతం మేర ప్రభావాన్ని తీసుకొచ్చామని, ఇది చాలా మంచి పని తీరు అని తెలిపారు.

 

                  

                  

ఈ నివేదికను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బి.ఈ.ఈ) చేత స్వతంత్ర ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన పి.డబ్ల్యు.సి. లిమిటెడ్ నిపుణుల ఏజెన్సీ తయారు చేసింది. ఫలితంగా భారతదేశంలో వివిధ కార్యక్రమాల ద్వారా శక్తిలో వార్షిక పొదుపు మరియు సిఓ2 ఉద్గారాలను అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఇంధన సామర్థ్య పథకాల అమలు 2018-19లో మొత్తం విద్యుతు పొదుపునకు 113.16 బిలియన్ యూనిట్ల వరకూ దారి తీసిందని, ఇది నికర విద్యుత్ వినియోగంలో 9.39 శాతం అని నివేదిక చెబుతోంది. ఇంధన పొదుపు (ఎలక్ట్రికల్+ థర్మల్), శక్తిని వినియోగించే రంగాల్లో (అనగా డిమాండ్ వైపు రంగాలు ) 15.54 ఎం.టి.ఓ.ఈ (మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్) గా ఉంటుంది. ఇది 2018-19లో నికర మొత్తం శక్తి వినియోగంలో (సుమారు..581.60 ఎం.టి.ఓ.ఈ) 2.84%.

2018-19లో సాధించిన మొత్తం ఇంధన ఆదా 23.73 ఎం.టి.ఓ.ఈ , ఇది 2018-19లో మొత్తం ప్రాథమిక ఇంధన సరఫరాలో 2.69 శాతం (భారతదేశంలో 893.23 ఎం.టి.ఓ.ఈ. గా అంచనా వేయబడింది). ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క సరఫరా వైపు మరియు డిమాండ్ వైపు రంగాలను కలిగి ఉంటుంది. మొత్తం మీద ఈ అధ్యయనం అంచనా ప్రకారం వివిధ ఇంధన సామర్థ్య చర్యలు గత ఏడాది (2017-18) 53,627 కోట్ల రూపాయల పొదుపుతో పోలిస్తే 89,122 కోట్ల రూపాయలు (సుమారుగా) విలువైన పొదుపుగా అనువదించబడ్డాయి. ఈ ప్రయత్నాలు 151.74 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా దోహదపడ్డాయి. గతేడాది ఈ సంఖ్య 108 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్.

2017-18 నుంచి, ప్రతి సంవత్సరం బ్యూరో ఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బి.ఈ.ఈ) వేర్వేరు ఇంధన సామర్థ్య పథకాల కారణంగా వాస్తవ ఇంధన వినియోగాన్ని పోల్చడానికి అధ్యయనం చేయడానికి మూడవ పార్టీ నిపుణుల ఏజెన్సీని నియమించింది. అంచనా వేసిన ఇంధన వినియోగంతో, ప్రస్తుత శక్తి సామర్థ్య చర్యలు లేకపోతే అంటే ప్రతి కూలతను అంచనా వేయడం ఈ అధ్యయనం లక్ష్యం. అంతేగాక భారతదేశంలోని అన్ని కీలక ఇంధన సామర్థ్య కార్యక్రమాల పనితీరు మరియు ప్రభావాన్ని అంచనా వేయడం, మొత్తం శక్తిని ఆదా చేయడం అలాగే కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపు పరంగా, అధ్యయనం చేయడం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిల్లో ప్రస్తుత పథకాల ఫలితాన్ని అంచనా వేస్తుంది. అదే విధంగా అమలు చేయని పరిస్థితులతో పోలుస్తుంది.

 

ఈ సంవత్సరం అధ్యయనం క్రింది ప్రధాన కార్యక్రమాలను గుర్తించింది. జరపడం, సాధించడం మరియు వాణిజ్య పథకం, ప్రమాణాలు & లేబులింగ్ కార్యక్రమం, ఉజాలా కార్యక్రమం, మునిసిపల్ డిమాండ్ వైపు నిర్వహణ కార్యక్రమం మొదలైనవి.

ఈ కార్యక్రమ ముగింపు సమసయంలో, శక్తి సామర్థ్యానికి ద్వంద్వ ప్రయోజనం ఉందని, ఎందుకంటే ఇది డబ్బును ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా ఆదా చేస్తుందని, ముఖ్యంగా ఎం.ఎస్.ఎం.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్) రంగం, హౌసింగ్ రంగంలో సమర్థతలను తీసుకురావడానికి ఇంకా భారీ సామర్థ్యం ఉందని శ్రీ సింగ్ తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థలో ఇంధన సామర్థ్యాన్ని తీసుకురావడానికి బి.ఈ.ఈ. (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.

***


(Release ID: 1621733) Visitor Counter : 179