సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కార్యదర్శిగా శ్రీ అరవింద్ కుమార్ శర్మ బాధ్యతల స్వీకారం పరిపాలన పరమైన అంశాల్లో శ్రీ శర్మకు విస్తృత అనుభవం
Posted On:
01 MAY 2020 7:39PM by PIB Hyderabad
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా శ్రీ అరవింద్ కుమార్ శర్మ (IAS) బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన విధులు ప్రారంభించిన అరవింద్ కుమార్ శర్మ, సీనియర్ అధికారులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ కార్యకలాపాలు, కొవిడ్-19 నేపథ్యంలో అత్యవసరంగా చేపట్టాల్సిన ముఖ్య అంశాలపై చర్చించారు. సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సెక్టారు చాలా ముఖ్యమైనదని చెప్పారు. తన ప్రాధాన్యతల గురించి చెబుతూ, కొవిడ్ పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత, ఎంఎస్‌ఎంఈల నుంచి ప్రపంచ స్థాయి సంస్థలను సృష్టించేందుకు అందరం కృషి చేద్దామని శ్రీ శర్మ సూచించారు.
ఈ నియామకానికి ముందు, ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో అదనపు కార్యదర్శిగా శ్రీ శర్మ సేవలు అందించారు. ఆయన గుజరాత్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గుజరాత్ ప్రభుత్వంలో క్షేత్ర మరియు విధానపర స్థాయుల్లో శ్రీ శర్మ విధులు నిర్వహించారు. అభివృద్ధి పరిపాలన, విపత్తుల నిర్వహణ, కార్పొరేట్ నిర్వహణ, పారిశ్రామిక/పెట్టుబడుల ప్రమోషన్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.
(Release ID: 1620204)
Visitor Counter : 216