మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళ మ‌రియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అజయ్ తిర్కే

Posted On: 01 MAY 2020 2:35PM by PIB Hyderabad

మహిళ మ‌రియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డ‌బ్ల్యూసీడీ) కార్యదర్శిగా శ్రీ అజయ్ తిర్కే ఈ రోజు న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ అజయ్ తిర్కే మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిన్న పదవీ విరమణ పొందిన‌ శ్రీ రవీంద్ర పన్వర్ స్థానంలో మహిళ మ‌రియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డ‌బ్ల్యూసీడీ) కార్యదర్శిగా అజ‌య్ తిర్కే భాధ్య‌త‌లు స్వీక‌రించారు. డ‌బ్ల్యూసీడీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు శ్రీ అజయ్ తిర్కే అదే మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఉంటూ సేవ‌లందించారు. మహిళ‌, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా చేరడానికి ముందు 2017 సంవత్సరంలో భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అంత‌కు ముందు శ్రీ అజయ్ తిర్కే 2004 నుండి 2009 వరకు డిప్యూటేష‌న్ ప్రాతిప‌దిక‌న రక్షణ మంత్రిత్వ శాఖకు డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీగా కూడా ప‌ని చేశారు. శ్రీ అజయ్ తిర్కే 2015 నుండి 2017 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవ‌లందించారు. మ‌ధ్యప్ర‌దేశ్ క్యాడ‌ర్‌కు చెందిన ఆయ‌న త‌న కేటాయింపు జ‌రిగిన రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్, లేబర్ అండ్‌ ఎంప్లాయి‌మెంట్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలను స‌మ‌ర్థంగా నిర్వహించిన‌ విస్తృతమైన అనుభవం ఉంది. మధ్యప్రదేశ్‌లోని స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (మార్క్‌ఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా శ్రీ అజ‌య్ తి‌ర్కే పని చేశారు. అంతకు ముందు మ‌ధ్యప్ర‌దేశ్‌లోని సిధి, హోషంగాబాద్, రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా కూడా ఆయ‌న సేవ‌లందించారు. దీనికి తోడు అతను మధ్యప్రదేశ్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా వివిధ హోదాల్లో శ్రీ అజ‌య్ తిర్కే పనిచేశారు. 


(Release ID: 1620018) Visitor Counter : 215