వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత 20 రోజుల లాక్ డౌన్ లో 1,000 రైళ్ల సరుకు రవాణా చేసిన ఎఫ్‌సిఐ

Posted On: 13 APR 2020 9:04PM by PIB Hyderabad

లాక్డౌన్ కాలంలో మర్చి 24 నుండి ఇప్పటి వరకు  3 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటి) ఆహార ధాన్యాలను 1,000 కి పైగా రైలు లోడ్లు (రేకులు) రవాణా చేయడం ద్వారా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) అరుదైన ఘనత సాధించింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సుమారు 950 రేక్‌లను (సుమారు 2.7 ఎమ్‌ఎమ్‌టి) అన్‌లోడ్ చేయగలిగింది.

లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ సగటున 3 లక్షల మెట్రిక్ టన్నులు (ఒక్కొక్కటి 50 కిలోల 60 లక్షల సంచులు) లోడ్అన్‌లోడ్ చేస్తోందిఇది దాని సాధారణ సగటు కంటే రెట్టింపు.  రోజుకు సగటున 2.95 లక్షల మెట్రిక్ టన్నులు,  పిఎం గరిబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎమ్‌కెకెఎ) కింద 2 ఎంఎంటి తో సహా వివిధ పథకాల కింద దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయినప్పటి నుండి ఎఫ్‌సిఐ ఇప్పటికే 5.9 ఎంఎంటి ఆహార ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది. అండమాన్నికోబార్లక్షద్వీప్లేహ్అరుణాచల్ ప్రదేశ్ వంటి దూర ప్రాంతాలతో సహా దేశంలోని ప్రతి ప్రాంతంలోని ఎఫ్‌సిఐ మొత్తం సిబ్బంది 24/7 ప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రతిరోజూ లక్షల మెట్రిక్ టన్నులు (ఒక్కొక్కటి 50 కిలోల 1.2 కోట్ల సంచులు) ఆహార ధాన్యాలు నిరంతరాయంగా గమ్యాలకు చేరవేస్తోంది. నిత్యం లాగే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏఅదనపు అవసరాలకు స్టాక్‌లను సరఫరా చేయడంతో పాటుకోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఆహార కొరత ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్‌జిఓలు మరియు సంక్షేమ సంస్థలకు  సబ్సిడీ రేటుతో స్టాక్స్ అందుబాటులో ఉండేలా ఎఫ్‌సిఐ తగు చర్యలు తీసుకుంటోంది. 

 

                                *****


(Release ID: 1614199) Visitor Counter : 207