భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఎబిబి లిమిటెడ్ కు చెందిన‌ ప‌వ‌ర్‌గ్రిడ్ వ్యాపారంలో హిటాచి ప్ర‌తిపాదించిన 80.1 శాతం సేక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన సిసిఐ

ఎబిబి లిమిటెడ్ , పవర్ గ్రిడ్ వ్యాపారంలో హిటాచీ 80.1% వాటాను సేక‌రించ‌డానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన స‌మావేశంలో ఆమోదం తెలిపింది.

Posted On: 07 APR 2020 8:15PM by PIB Hyderabad

ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం, ఎబిబి మేనేజ్ మెంట్ హోల్డింగ్ ఎజి (ఎబిబి మేనేజ్ మెంట్‌) కి చెందిన 80.1 శాతం మాటా మూల‌ధ‌నాన్ని హిటాచి లిమిటెడ్ (హిటాచి) , ఎబిబి లిమిటెడ్ (ఎబిబి) నుంచి సేక‌ర‌ణ‌కు  ఇది వీలు క‌ల్పిస్తుంది. ఎబిబి మేనేజ్‌మెంట్, ఎబిబి కి చెందిన మొత్తం ప‌వ‌ర్‌గ్రిడ్ వ్యాపారాన్ని క‌లిగి ఉంటుంది ( టార్గెట్ బిజినెస్‌).
హిటాచి , కేంద్ర‌కార్యాల‌యం జ‌పాన్ లో ఉంది. ఇది హిటాచి గ్రూప్ కంపెనీల పేరెంట్ కంపెనీ. ఇది ఐటి సొల్యూష‌న్‌, ఎన‌ర్జీ సొల్యూష‌న్‌, ఇండ‌స్ట్రీ సొల్యూష‌న్‌, మొబిలిటి సొల్యూష‌న్‌, స్మార్ట్ లైప్ సొల్యూష‌న్ వంటివి వివిధ ర‌కాల వ్యాపారాల‌లో చురుకుగా ఉంది.
ఈ టార్టెట్ వ్యాపారం ప‌వ‌ర్ గ్రిడ్ సెక్ట‌ర్‌లో  అభివృద్ధి, ఇంజినీరింగ్‌, త‌యారీ, ఉత్ప‌త్తుల అమ్మ‌కం, సిస్ట‌మ్‌లు, ప్రాజెక్టుల‌కు సంబంధించిన‌ది..
స‌వివ‌ర‌మైన సిసిఐ ఆర్డ‌ర్ త‌దుప‌రి విడుద‌ల అవుతుంది..



(Release ID: 1612119) Visitor Counter : 133