వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రబీ పంటల ప్రక్రియ, వేసవి పంటలకు విత్తనాలు చల్లడం వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వ్యవసాయ సహకారం, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ తీసుకుంటున్న చర్యలు
లాక్ డౌన్ కారణంగా రైతులకు ఇబ్బందిని నివారించేందుకు చర్యలు
Posted On:
03 APR 2020 8:34PM by PIB Hyderabad
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ కాలంలో ఏర్పడుతున్న ప్రతికూలతల వల్ల వ్యవసాయదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రబీ పంటల ప్రక్రియ, వేసవి పంటలకు విత్తనాలు చల్లడం వంటి కార్యకలాపాలన్నీ సజావుగా చేపట్టేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయ సహకారం, రైతు సంక్షేమ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది.
క్లెయిమ్ ల చెల్లింపు, 2019-20 రబీ పంట కాలంలో సిసిఇలు చేపట్టగల ప్రస్తుత పరిస్థితి, పంట నష్టాల సర్వే, స్మార్ట్ శాంప్లింగ్ టెక్నిక్ వంటి అంశాలు సమీక్షించేందుకు అన్ని రాష్ట్రప్రభుత్వాలు, బీమాకంపెనీలతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు.
ఇటీవల ఏర్పడిన అకాల వర్షాలు, పెనుగాలుల కారణంగా ఏర్పడిన పంట నష్టాలు తెలియచేస్తూ వచ్చిన సమాచారం ఆధారంగా పంటల కోత ప్రక్రియను ప్రత్యక్షంగా చూసేందుకు, క్షేత్రస్థాయి సర్వే చేపట్టడానికి నిబంధనలు సడలించడంతో ఆటు వ్యవసాయ బీమాకు సంబంధించిన ప్ర్రక్రియ పూర్తి చేయడానికి బీమా కంపెనీల ప్రతినిధులకు పాస్ లు జారీ చేసేందుకు అనుమతి ఇస్తూ అన్ని రాష్ట్రప్రభుత్వాలకు లేఖలు జారీ చేశారు.
ఎగుమతి కన్ సైన్ మెంట్లకు, దిగుమతి అయిన విత్తనాలు, విత్తన ఉత్పత్తులను విడుదల చేయడానికి ఫొటో శానిటరీ సర్టిఫికేషన్ ప్రక్రియ యథాప్రకారం సాగుతోంది. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన 2020 మార్చి 24వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 2వ తేదీ మధ్య కాలంలో ఎగుమతి కన్ సైన్ మెంట్లకు 3776 పిఎస్ సిలు జారీ చేశారు. 1074 దిగుమతి కన్ సైన్ మెంట్లు విడుదల చేశారు.
ఉద్యానవన పంటలకు కావలసిన ముడిసరకు ఎలాంటి అవరోధాలు లేకుండా రవాణా అయ్యేందుకు, పెంపకందారులకు ఎదురయ్యే అన్ని రకాల కష్టాలు తీర్చడానికి, అవసరమైన మద్దతు అందించడానికి ఉద్యానవనాల పెంపకందారులు, ఆగ్రిగేటర్లు, టోకు అమ్మకందారులు, మండీ సంఘాలు, రాష్ట్ర ఉద్యానవన విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు.
ఈ లాక్ డౌన్ కాలంలో వ్యవసాయ టెలీ అడ్వైజర్ల నుంచి వచ్చే కాల్స్ ను వ్యక్తిగత మొబైల్ నంబర్లకు బదిలీ చేసేందుకు 21 భిన్న ప్రాంతాల్లోని కిసాన్ కాల్ సెంటర్లు ఇప్పుడు ఇళ్ల నుంచే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మొత్తం 454 కెసిసిలు రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తూ రోజుకి 15 వేల నుంచి 20 వేల కాల్స్ ను వ్యక్తిగత మొబైల్ నంబర్లకు బదిలీ చేస్తున్నాయి.
(Release ID: 1610916)
Visitor Counter : 222