PIB Headquarters
కోవిడ్-19 గురించి పి ఐ బి రోజువారీ సమాచార సారాంశం
प्रविष्टि तिथि:
02 APR 2020 6:25PM by PIB Hyderabad
(గత 24 గంటలలో కోవిడ్ -19పై జారీ చేసిన పత్రికా ప్రకటనలు మరియు పి ఐ బే జరిపిన నిజాల పరీక్ష)
కోవిడ్ -19 గురించి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం
దేశంలో కోవిడ్ -19 నివారణ, కట్టడి మరియు పర్యవేక్షణకు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి భారత ప్రభుత్వం వివిధ చర్యలకు ఉపక్రమించి అమలు చేస్తున్నది. ఇప్పటివరకు 1965 కేసులు పాజిటివ్ కేసులు నమోదైనట్లు, 50 మంది మరణించినట్లు సమాచారం అందింది. గత 24 గంటల్లో కొత్తగా 328 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, 12 మంది మరణించారు. వివిధ ఆసుపత్రులలో 151 మంది కోలుకోవడం / కోలుకున్న తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం జరిగింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610449
కోవిడ్ -19 ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించిన ప్రధాని
కోవిడ్-19 ఎదుర్కోవడానికి వివిధరాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తదుపరి చర్యల గున్రించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రులతో సంభాషించారు. లాక్ డౌన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధాని రాష్ట్రాలకు కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ అమలువల్ల కోవిడ్ -19 వైరస్ వ్యాపించకుండా భారత్ కొంత విజయం సాధించగలిగిందని ప్రధాని అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు పరిస్థితి సంతృప్తికరంగా లేదని, కొన్ని దేశాలలో రెండవసారి వైరస్ వ్యాపించాగలదనే ఊహాగానాలు వస్తున్నాయని ప్రధాని ముందుగా హెచ్చరించారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610323
3 ఏప్రిల్, 2020 తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు దేశప్రజలకు వీడియో సందేశం ఇవ్వనునట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో ట్వీట్ చేశారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610437
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాల గురించి రేపు (3 ఏప్రిల్, 2020 ) భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంటు గవర్నర్లు, రాష్ట్రాల అడ్మినిస్ట్రేటర్లతో చర్చలు జరుపుతారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610299
ఆరోగ్య సేతు : ఒక బహుళ పరిమాణాత్మక వారధి
కోవిడ్ -19 వైరస్ పై పోరాటానికి దేశ ప్రజలను ఒక ఏకం చేయడానికి ‘ఆరోగ్య సేతు’ పేరిట ఒక మొబైల్ యాప్ తయారు చేశారు. దీని ద్వారా ప్రజలు వారు ఇతరులతో జరిపిన సాహచర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్లూ టూత్ టెక్నాలజీ, క్రమ సూత్ర పధ్ధతి మరియు కృత్రిమ మేధను ఉపయోగించి ఆయా వ్యక్తులకు వైరస్ హాని జరిగే అవకాశం ఎంతవరకు ఉందో ఈ యాప్ అంచనా వేస్తుంది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610372
కోవిడ్ -19 వైరస్ పై పోరాటం కోసం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి విధించే శిక్షలను గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
భారత శిక్షా స్మృతి, ప్రకృతి వైపరీత్యాలను సమగ్రంగా ఎదుర్కొనే చట్టం ప్రకారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకునే శిక్షాసంబంధమైన చర్యల గురించి అధికారులకు, ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠినచర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610384
కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి ప్రకటించిన లాక్ డౌన్ అమలు సందర్భంగా లబ్దిదారులకు ప్రధానమంత్రి – గరీబ్ కళ్యాణ్ యోజన సొమ్ము పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రాసింది.
చెల్లింపులు జరిపేటప్పుడు సామాజిక దూరం నియమాలను పాటిస్తూనే ప్రధానమంత్రి – గరీబ్ కళ్యాణ్ యోజన సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610378
థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య పాలసీలు ఉన్న వారికి ఊరట
థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య పాలసీలు ఉన్న వారికి ప్రభుత్వం ఊరట కలుగజేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14, 2020 మధ్యలో గడువు ముగియ నున్న పాలసీలను ఏప్రిల్ 21, 2020 వరకు రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610262
నిత్యావసర సరుకుల రవాణాకోసం సరుకుల కారిడార్లను నిర్వహిస్తున్న రైల్వేలు
రైల్వే వ్యాగన్ల లోకి సరుకులు ఎక్కించే కారిడార్లను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న భారతీయ రైల్వేలు. గత మూడు రోజుల్లో 143458 వ్యాగన్లలో సరుకులు నింపి పంపారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610370
నిత్యావసర సరుకుల రవాణాకు భారీగా ఊతమిస్తున్న పార్సెల్ రైళ్ళు
సరుకుల సరఫరా శృంఖల తెగిపోకుండా భారతీయ రైల్వే ముందుగా నిర్ణయించిన కాల నిర్ణయ పట్టిక ప్రకారం 10 రూట్లలో పార్సెల్ రైళ్ళను మరియు 18 కొత్త రూట్లలో ప్రత్యేక పార్సెల్ రైళ్ళను నడపాలని సంకల్పించారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలు 30 ప్రత్యేక పార్సెల్ రైళ్ళలో సరుకులను నింపాయి.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610342
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి మాజీ సైనికుల సమీకరణ
కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల సంబంధీకులను కనిపెట్టడం, సామాజిక నిఘా, క్వారెంటైన్ సౌకర్యాల పర్యవేక్షణ వంటి పనులలో రాష్ట్ర మరియు జిల్లా అధికారులకు వాలంటీర్లుగా సహాయం అందించేందుకు మాజీ సైనిక వాలంటీర్లను గుర్తించి , సమీకరించే పనిలో రాజ్య మరియు జిల్లా సైనిక బోర్డులు ఉన్నాయి.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610184
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాట జాతీయ విధిలో ఎన్ సి సి కేడెట్ల సేవలు
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో పౌర అధికారులకు సహాయం అందించేందుకు ఎన్ సి సి కేడెట్ల సేవలను అందించేందుకు నేషనల్ కేడేట్ కోర్ ముందుకు వచ్చింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610182
బూటకపు వార్తలను ఎదుర్కోవడానికి చర్యలకై రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ లేఖ
సుప్రీమ్ కోర్టు వ్యాఖ్యల దరిమిలా బూటకపు వార్తలను ఎదుర్కోవడానికి గట్టి చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610192
కోవిడ్ -19పై నిజాల పరీక్షకు పి ఐ బి యూనిట్ ఏర్పాట్
కోవిడ్ -19పై బయటికి వస్తున్న ఎన్నో ప్రకటనల్లో నిజానిజాల పరీక్షకు పి ఐ బి ఒక పరీక్షా యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ మెయిల్ ద్వారా అందిన సందేశాలలో
నిజానిజాలను నిర్ధారించి వెంటనే బదులిస్తుంది. అంతేకాక కోవిడ్ -19 పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరియు ఆ రోజు జరిగిన పరిణామాలను తెలియజేసేందుకు ప్రతిరోజూ ఒక బులెటిన్ విడుదల చేస్తుంది. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610298
ఆహార ధాన్యాల సరఫరాను పెంచిన భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ)
దేశవ్యాప్తంగా బియ్యం, గోధుమ నిరంతర సరఫరా జరిగేలా భారత ఆహార సంస్థ చూస్తోంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి దాదాపు 9.86 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలతో 352 గూడ్స్ రైళ్ళు కదిలి వెళ్ళాయి.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610089
కోవిడ్ -19 సంసిద్ధతపై ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ సోకిన వారికోసం తీసుకోవలసిన చర్యలు పడకల లభ్యత, ఐసోలేషన్ వార్డులు, అధిక సంఖ్యలో పరీక్షల కోసం ప్రయోగశాలల సంసిద్ధత గురించి అధికారులు , ఐ ఎం ఎ అధికారులతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష జరిపారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610120
లాక్ డౌన్ చర్యలను పూర్తిగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరిన హోం శాఖ
లాక్ డౌన్ చర్యలను తు. చ. తప్పకుండా అమలు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610121
విద్యార్ధుల ప్రమోషన్లు మరియు బోర్డు పరీక్షల గురించి సి బి ఎస్ ఇ ఆదేశాలు
ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యార్దులను అందరినీ పై తరగతికి ప్రమోట్ చేయాలని సి బి ఎస్ ఇ తమకు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తొమ్మిదవ, 11వ తరగతి చదువుతున్న విద్యార్దులను స్కూలులో వారి ప్రతిభ ఆధారంగా ప్రమోట్ చేయాలని తెలిపారు. కీలకమైన 29 విషయాలలో మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610147
నిరుపేదలకు ఆహార పంపిణీ కొనసాగించిన రైల్వేలు
మార్చి 28వ నుంచి రైల్వే శాఖ 1.4 లక్షల మంది నిరుపేదలకు వండిన ఆహారం పంపిణీ చేసింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610107
జవహర్ లాల్ నెహ్రు శాస్త్రీయ పరిశోధనా సంస్థ (జె ఎన్ సి ఎ ఎస్ ఆర్) తయారు చేసిన కోటింగ్ వ్యాధి సంక్రమణను నివారించవచ్చు
జె ఎన్ సి ఎ ఎస్ ఆర్ సంస్థ తయారు చేసిన అతిసూక్ష్మ జీవులను ఎదుర్కొని అంతం చేయగల ప్రతిజీవులతో తయారయ్యే కోటింగ్ ద్వారా వ్యాధి సంక్రమణను అడ్డుకోవచ్చు. ఆ కోటింగ్ ను జవుళి వస్త్రాలు, ప్లాస్టిక్ వంటి ఉపరితలాలపై పూసినట్లయితే కోవిడ్ -19 తో సహా అనేక రకాల వైరస్ లను అంతం చేస్తుంది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610109
సరుకుల రవాణా విమానాల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా
ఇప్పటి వరకు లైఫ్ లైన్ ఉడాన్ విమానాల ద్వారా దాదాపు 38 టన్నుల మందులను రవాణా చేసారు. ఈ విమానాలు ఆకాశంలో 70,000 కిలోమీటర్లు తిరిగాయి.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610138
కోవిడ్ -19 వల్ల ఏర్పడే మానసిక, సామాజిక ప్రభావాన్ని గురించి సామాజిక దృక్పధాన్ని అంచనా వేయడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ ఒక ఆన్ లైన్ ప్రశ్నావళి విడుదల చేసింది.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610481
ఇండియాలో నిలిచిపోయిన విదేశీ యాత్రికులు సహాయం కోసం దానికి సంబంధించిన ‘స్ట్రాండెడ్ ఇన్ ఇండియా’ పోర్టల్ కు 500 ప్రశ్నలు / అభ్యర్ధనలు పంపారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610434
పోస్టల్ వ్యవస్థ ద్వారా లావాదేవీలు
లాక్ డౌన్ సమయంలో మార్చి 31 వరకు పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ బ్యాంక్ ద్వారా 34 లక్షల లావాదేవీలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ ద్వారా 6.5 లక్షల లావాదేవీలు జరిగాయి.
Bank.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610137
ఎన్ సి డి సి మరియు ఇండియన్ పోటాష్ లిమిటెడ్ సంయుక్తంగా కోవిడ్-19ను ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధికి రూ. 11 కోట్ల విరాళం ప్రకటించాయి.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610134
(रिलीज़ आईडी: 1610534)
आगंतुक पटल : 316