మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మానవ వనరుల మంత్రి ఆదేశాల మేరకు 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను తదుపరి క్లాస్/ గ్రేడ్కు ప్రమోట్ చేయాలని అనుబంధ పాఠశాలలలన్నింటికి సిబిఎస్ఇ ఆదేశం

Posted On: 01 APR 2020 8:42PM by PIB Hyderabad

9 నుంచి 11 తరగతుల విద్యార్థులను పాఠశాల అసెస్ మెంట్ మేరకు తదుపరి క్లాస్/ గ్రేడ్కు ప్రమోట్ చేయాలని సూచన

హెచ్ఇఐల్లో అడ్మిషన్లు, ప్రమోషన్లకు అవసరం అయిన కేవలం 29 ప్రధాన కీలకమైన సబ్జెక్ట్ లకు మాత్రమే సిబిఎస్ఇ బోర్డు పరీక్షల నిర్వహణ

29 సబ్జెక్ట్ లలో బోర్డు పరీక్షల నిర్వహణకు తగినంత సమయం ఇస్తూ నోటీసు ఇవ్వనున్న సిబిఎస్ఇ

ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 కారణంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ కీలక నిర్ణయాలు

01, ఏప్రిల్ 2020

కోవిడ్-19 కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిబిఎస్ఇ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 1 నుంచి 8వ త‌ర‌గ‌తుల విద్యార్థులంద‌రినీ తదుపరి క్లాస్ లేదా గ్రేడ్ కు ప్రమోట్ చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ “నిశాంక్” సిబిఎస్ ఇని ఆదేశించారు.

9, 11 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులందరినీ వివిధ ప్రాజెక్టులు, కాలానుగుణంగా నిర్వహించిన పరీక్షలు, టర్మ్ పరీక్షల్లో వారి ప్రతిభ ఆధారంగా పాఠశాల స్థాయిలో అసెస్ చేసి తదుపరి క్లాస్ లేదా గ్రేడ్ కు ప్రమోట్ చేయాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్ఇఐ) ప్రవేశానికి అవసరం అయిన 29 ప్రధాన సబ్జెక్ట్ లకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని మంత్రి సిఫారసు చేశారు. మిగతా సబ్జెక్ట్ లకు బోర్డు పరీక్షలు నిర్వహించబోదని ప్రకటించారు. ఇలాంటి కేసులన్నింటిలోనూ అసెస్ మెంట్ ఏ విధంగా చేయాలనే విషయంలో బోర్డు విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

మార్చి 18, 2020 తేదీన భారత ప్రభుత్వ హెచ్ఆర్ డి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ముందస్తు చర్యగా మార్చి 19 నుంచి మార్చి 31 వరకు నిర్వహించాల్సిన బోర్డు పరీక్షలన్నింటినీ సిబిఎస్ఇ వాయిదా వేసింది. “పరిస్థితిని సమీక్షించిన అనంతరం రీ షెడ్యూల్ చేసిన బోర్డు పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ ను బోర్డు వెబ్ సైట్ లోను, పత్రికా ప్రకటనల ద్వారాను తెలియచేస్తాం” అని బోర్డు మార్చి 18వ తేదీన జారీ చేసిన పత్రికా ప్రకటనలో సూచించింది.

విద్యార్థుల సంక్షేమానికి బోర్డు కట్టుబడి ఉంది. ఈ కారణంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని, విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పాఠశాలల్లో కూడా అందరిలో ఉన్న ఉత్సుకతను తొలగించేందుకు కట్టుబడి ఉందని బోర్డు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభించిన కారణంగా ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితిని, కోవిడ్-19 అదుపు చేయడం కోసం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ వంటి పరిణామాల కారణంగా విద్యార్థుల భవితవ్యంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నలను పరిగణనలోకి తీసుకుని హెచ్ఆర్ డి మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఏక కాల చర్యగా బోర్డు పలు/ఈ దిగువ సలహాలు పంపింది.

1. తరగతులు 1-8 : ఈ తరగతుల్లో చదివే విద్యార్థులందరినీ పై క్లాస్/  గ్రేడ్ కు ప్రమోట్ చేయవచ్చు. ఎన్ సిఇఆర్ టిని సంప్రదించిన అనంతరమే ఈ అడ్వైజరీ విడుదల చేయడం జరిగింది.

2. తరగతులు 9-11 :  సిబిఎస్ఇ అనుబంధ పాఠశాలల్లో అధిక శాతం పాఠశాలలు 9 నుంచి 11 తరగతుల విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసి వారి పేపర్లు దిద్దడం, తదుపరి క్లాస్ కు ప్రమోట్ చేయడం వంటి ప్రక్రియ పూర్తి చేయగా చాలా పాఠశాలలు ఇంకా ఆ ప్రక్రియ పూర్తి చేయలేకపోయినట్టు బోర్డు దృష్టికి వచ్చింది. వాటిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, రాష్ర్టాల/  కేంద్రపాలిత ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేటు పాఠశాలలు, దేశవిదేశాల్లో పని చేస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. ఆ పాఠశాలలన్నీ ఇప్పటికే నిర్వహించిన ప్రాజెక్టులు, కాలానుగుణమైన పరీక్షలు, టర్మ్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభపై పాఠశాల స్థాయిలో గల అంచనా ఆధారంగా విద్యార్థులను తదుపరి గ్రేడ్ కు ప్రమోట్ చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఈ ఇంటర్నల్ ప్రక్రియ పూర్తి చేయలేకపోయి ఉంటే (ఎన్ని సబ్జెక్ట్ ల్లో అయినా) ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో పాఠశాల ఆధారంగా నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించవచ్చు. ఆ పరీక్షల ఆధారంగా వారి ప్రమోషన్ విషయం నిర్ణయించవచ్చు.

3. తరగతులు 10-12 బోర్డు పరీక్షల షెడ్యూల్ :  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు బోర్డు నిర్ణయం తీసుకుని కొత్త షెడ్యూలు ప్రకటించగల స్థితిలో లేదు. ఎంట్రెన్స్ పరీక్షలు, అడ్మిషన్ తేదీలను పరిగణనలోకి తీసుకుని, ఉన్నత విద్యా విభాగం అధికారులతో విస్తృత చర్చించిన తర్వాతనే ఈ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటుంది. అలాగే బోర్డు పరీక్షల ప్రక్రియ ప్రారంభించేందుకు అన్ని వర్గాలకు చెందిన భాగస్వాములకు బోర్డు 10 రోజుల నోటీసు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాము.

4. బోర్డు పరీక్షలకు సబ్జెక్ట్ లు :  కోవిడ్-19 కారణంగా ఏర్పడిన కల్లోల పరిస్థితి కారణంగా 8 రోజుల్లో నిర్దేశిత పరీక్షలు నిర్వహించలేకపోయినట్టు బోర్డు తెలియచేసింది. ఈశాన్య ఢిల్లీ జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల కారణంగా 4 పరీక్షలు నిర్వహించలేకపోయామని, 6 పరీక్షలకు విద్యార్థులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారని కూడా బోర్డు తెలిపింది.

అసాధారణ పరిస్థితుల కారణంగా బోర్డు తన పాలసీని తప్పనిసరిగా సమీక్షించాల్సివచ్చిందని తెలియచేస్తూ సాధారణ పరిస్థితుల్లో అయితే మార్చి 18వ తేదీ తర్వాత నిర్వహించలేకపోయిన లేదా ఇతర కారణాల వల్ల వాయిదా వేసిన పరీక్షలన్నీ నిర్వహించేందుకు వెనుకాడి ఉండే వారం కాదని బోర్డు తెలిపింది. కాని ప్రస్తుత అసాధారణ పరిస్థితి కారణంగా ఈ దిగువ నిర్ణయాలు కూడా బోర్డు తీసుకుంది.

- ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు, ప్రమోట్ చేయడానికి తప్పనిసరి అయిన మెయిన్ సబ్జెక్టులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంది.

- మిగతా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించదు. విద్యార్థుల ప్రతిభను అసెస్ చేయడానికి, మార్కులు ఇవ్వడానికి అవసరం అయిన మార్గదర్శకాలు విడిగా జారీ చేస్తుంది.

- ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఎప్పుడు పరిస్థితి అనుకూలం అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ దిగువన సూచించిన 29 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుంది.

 

క్లాస్ 10 పరీక్షలు నిర్వహించాల్సిన సబ్జెక్ట్ లు

క్లాస్ 12 పరీక్షలు నిర్వహించాల్సిన సబ్జెక్ట్ లు

దేశం మొత్తంలో నిర్వహించాల్సిన పరీక్షలు


ఈశాన్య ఢిల్లీలో మాత్రమే నిర్వహించాల్సిన పరీక్షలు

దేశం మొత్తంలో నిర్వహించాల్సిన పరీక్షలు 

ఈశాన్య ఢిల్లీలో మాత్రమే నిర్వహించాల్సిన పరీక్షలు 

 

లేవు

1.హిందీ కోర్సు ఎ

2.హిందీ కోర్సు బి

3. ఇంగ్లీషు కమ్ 

4. ఇంగ్లీషు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్

5. సైన్సు

6. సోషల్ సైన్సు

1. బిజినెస్ స్టడీస్

2. జాగ్రఫీ

3. హిందీ (ఎలక్టివ్)

4. హిందీ (కోర్)

5. హోమ్ సైన్స్

6. సోషియాలజీ 

7. కంప్యూటర్ సైన్స్ (ఓల్డ్)

8. కంప్యూటర్ సైన్స్ (న్యూ)

9. ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ (ఓల్డ్)

10.ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ (న్యూ)

11.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

12. బయోటెక్నాలజీ

1. ఇంగ్లీష్ ఎలక్టివ్ -ఎన్

2. ఇంగ్లీష్ ఎలక్టివ్ -సి

3. ఇంగ్లీష్ కోర్

4. మాథెమెటిక్స్

5. ఎకనామిక్స్

6. బయాలజీ

7. పొలిటికల్ సైన్స్ 

8. హిస్టరీ

9. ఫిజిక్స్

10. అకౌంటెన్సీ

11. కెమిస్ర్టీ

లేవు

06

 

12

 

11

 

5. విదేశాల్లోని సిబిఎస్ఇ పాఠశాలలు : 25 దేశాల్లో సిబిఎస్ఇ పాఠశాలలున్నాయి. ఆయా దేశాల్లో కూడా లాక్ డౌన్ అమలులో ఉంది లేదా వేర్వేరు కాలపరిమితుల వరకు పాఠశాలలు మూసి వేయడం జరిగింది. ఆయా దేశాల్లో కూడా బోర్డు వేర్వేరు సెట్ పరీక్షలు నిర్వహించగలిగే పరిస్థితి లేదు. అలాగే ఎవాల్యుయేషన్ ప్రక్రియకు అవసరం అయిన ఆన్సర్ బుక్ లు కూడా ముద్రించడం అసాధ్యం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దేశం వెలుపల పని చేస్తున్న పాఠశాలల్లో 10 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పరీక్షలేవీ నిర్వహించరాదని బోర్డు నిర్ణయించింది. ఆయా పాఠశాలలు విద్యార్థులకు మార్కులు కేటాయించడం/ అసెస్ మెంట్ చేయడానికి బోర్డు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేసి పాఠశాలలకు తెలియచేస్తుంది.

6. ఎవాల్యుయేషన్ ప్రక్రియ :  ప్రస్తుత పరిస్థితుల కారణంగా బోర్డు ఎవాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగించగల స్థితిలో కూడా లేదు. మారిన వాతావరణంలో ఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎలా చేపట్టాలనే విషయంలో కూడా బోర్డు తదుపరి సమాచారం అందచేస్తుంది. అలాగే దేశంలో ఎవాల్యుయేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభించేందుకు కూడా బోర్డు తేదీలు ప్రకటించలేని స్థితిలో ఉంది. 3 నుంచి 4 రోజుల వ్యవధి ఇస్తూ ఎవాల్యుయేషన్ ప్రక్రియ తిరిగి చేపట్టే సమయం తెలియచేస్తుంది. చీఫ్ నోడల్ సూపర్ వైజర్లు, హెడ్ ఎగ్జామినర్లు, ఎవాల్యుయేటర్లు, కోఆర్డినేటర్లు వాటిని ప్రకటిస్తారు. 

7. వదంతులను నివారించండి : ప్రస్తుత పరిస్థితిలో పలు వదంతులు వ్యాపించి అందరినీ తప్పుదారి పట్టిస్తున్న కారణంగా ఆ వదంతులకు లోను కావద్దని, బోర్డు వెబ్ సైట్లలో చేసే అధికారి ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని అందరికీ తెలియచేస్తోంది. తాజా పరిణమాలకు చెందిన వివరాలు బోర్డు వెబ్ సైట్ www.cbse.nic.inలో లేదా బోర్డుకు సంబంధించి ఈ దిగువన ఇచ్చిన సోషల్ మీడియాలో చూసుకోవచ్చు.

• Instagram: https://instagram.com/cbse_hq_1929  

• Twitter: https://twitter.com/@cbseindia29

• Facebook: https://www.facebook.com/cbseindia29/

8. విద్యార్థులకు సమాచారం :  విద్యార్థులందరికీ ఈ సమాచారం అందించాలని అన్ని పాఠశాలలను బోర్డు ఆదేశిస్తోంది.



(Release ID: 1610147) Visitor Counter : 207