శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

క‌రోనా వైర‌స్ గురించి మ‌న‌కు ఏం తెలుసు.. తెలుసుకోవాల్సిన అంశాలేంటి..

Posted On: 01 APR 2020 1:30PM by PIB Hyderabad

క‌రోనా వైర‌స్‌కు (SARS-CoV-2) సంబంధించి ప‌లు విష‌యాలు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా, వాట్స‌ప్‌తో పాటు ఇంట‌ర్‌నెట్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇందులో కొన్ని నిజాలు కాగా చాలా అంశాలు నిరాధార‌మైన‌వే. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఈ ఘోర‌మైన వైర‌స్ కు సంబంధించిన కొన్ని వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. విజ్ఞాన్‌ ప్ర‌సార్‌లో సీనియ‌ర్ సైంటిస్టుగా ఉన్న డాక్ట‌ర్ టి.వి. వెంక‌టేశ్వ‌ర‌న్ క‌రోనా వైర‌స్‌కు సంబంధించి వివిధ ప‌రిశోధ‌నాంశాల‌ను విశ్లేషిస్తూ దీనికి సంబంధించి మ‌రిన్ని అంశాల‌ను ఇక్క‌డ పంచుకున్నారు.

క‌రోనా ఇన్ఫెక్ష‌న్ ఎలా ఉంటుంది..
క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా గొంతు, ఊపిరితిత్తుల‌లోని ఎపిథీలియ‌ల్ క‌ణాల‌కు సోకుతుంది. క‌రోనా వైర‌స్ మానవ కణాలపై ఉండే ACE2 గ్రాహకాలను బంధిస్తుంది. ఈ త‌ర‌హా క‌ణాలు ఎక్కువ‌గా గొంతు మరియు ఊపిరితిత్తులలో ఉంటాయి. ఈ వైర‌స్ ప్ర‌ధానంగా మ‌న నోరు, ముక్కు, కండ్ల ద్వారా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా మ‌న చేతులు వాహ‌కంగా ముక్కు, నోరు, కండ్ల‌ను తాకడం ద్వారా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. కావున, సాధ్య‌మైనంత త‌రుచుగా కనీసం 20 సెక‌న్ల పాటు స‌బ్బు నీటితో చేతులు క‌డుక్కోవ‌డం వ‌ల్ల వైర‌స్ సంక్ర‌మ‌ణ జ‌రుగ‌కుండా నివారించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

ఇన్‌ఫెక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటే ప్ర‌మాదం..
7,00,000 పీఎఫ్‌యూలు అంత‌కంటే ఎక్కువ మోతాదులో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డిన‌ట్ల‌యితే మ‌నిషి  వివిధ క‌రోనా సంబంధిత వ్యాధుల భారిన ప‌డుతార‌ని అధ్య‌యనాల ద్వారా తెలుస్తుంది. PFU (ఫలకం ఏర్పడే యూనిట్) అనేది ఏదైనా అంటువ్యాధి యొక్క ఇన్‌ఫెక్ష‌న్ కొల‌త‌ యూనిట్. జన్యుపరంగా మార్పు చెందిన ఎలుకలపై జంతు అధ్యయనం ప్రకారం, ఇది కేవలం 240 PFU తో ఇవి SARS బారిన పడవచ్చు. జంతువుల‌లో ఎటువంటి క్లినికల్ లక్షణాలు వెను వెంట‌నే క‌పించనప్పటికీ, ముక్కు మరియు లాలాజలం నుండి వచ్చే బింధువులు వైర‌ల్ లోడ్‌ను కలిగి ఉంటాయ‌ని అధ్య‌య‌నాల ద్వారా తెలుస్తుంది. దాదాపు 700000 పీఎఫ్‌యు కంటే ఎక్కువ మోతాదు వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ ఉంటే కోతులు కూడా  వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశం ఉంది తెలుస్తోంది.

ఇన్‌పెక్ష‌న్ సంక్ర‌మ‌ణకు ఆస్కార‌మున్నసంద‌ర్భం..
 ఒక వ్య‌క్తి నుంచి ఇత‌రుకుల వైర‌స్ ఎంత స‌మ‌యంలో సంక్ర‌మిస్తుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా తెలియ‌రాలేదు. కానీ క‌నీసం 10-14 రోజుల్లో ఇది జ‌రిగి బ‌య‌ట‌కు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటువ్యాధిని కృత్రిమంగా తగ్గించడం మొత్తం వైర‌స్ వ్యాప్తిని తగ్గించ‌డంలో కీలక పద్ధతి. అనుమానితుల‌ను ఆసుప్ర‌తిలో చేర్చ‌డం, ఐసోలేష‌న్‌లో ఉంచ‌డంతో, క్వారంటైన్ చేయ‌డంతో పాటు లాక్డౌన్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం కూడా వైర‌స్‌ను క‌ట్డి చేయ‌డానికి కీల‌క ప‌ద్ద‌తులు.

క‌రోనా వైర‌స్ ఎవ‌రికి సోక‌వ‌చ్చు..
ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క ముందే వైర‌స్ ఎవ‌రికైనా సోకే అవ‌కాశం ఉంది. వైర‌స్ క‌లిగివున్న వారు చాలా మందికి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. ద‌గ్గిన‌ప్పుడు గానీ లేదా చీదిన‌ప్పుడు గానీ నోరు, ముక్కును క‌ప్పుకోవ‌డం ద్వారా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. వైర‌స్ సోకిన కాలంలో సంబంధిత వ్య‌క్తి లాలాజ‌లం, క‌ఫం మ‌రియు మ‌లాల‌లో ఈ వైర‌స్ అవ‌శేషాలు ఉంటాయి.

క‌రోనా వైర‌స్ ఎలా సోక‌వ‌చ్చంటే..
ఈ వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా నోటి తుంప‌ర్ల ద్వారా సంక్ర‌మించే అవ‌కాశం ఉంటుంది. ఆరు అడుగులు గానీ అంత‌కంటే త‌క్కువ దూరంలో సాన్నిహిత ప‌రిచ‌యం ఉన్న స‌మ‌యంలో నోటి తుంప‌ర్లు ప‌డితే వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి కూరగాయల మార్కెట్ లేదా సూపర్ మార్కెట్ వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లిన‌ప్పుడు వ్య‌క్తికి-వ్య‌క్తికి మ‌ధ్య క‌నీసం 1.5 మీటర్ల దూరం ఉండాలే చూసుకోవాల‌ని అధికారులు సిఫార‌సు చేస్తున్నారు. హాంకాంగ్‌లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం సామాజిక దూరం 44% వ్యాప్తిని తగ్గిస్తుంద‌ని తెలిపింది. వ్యాధి యొక్క నిర్జీవ వెక్టర్, ప్రత్యేకించి ఫోన్లు, తలుపుల గొళ్లాలు, ఉపరితలాలు వైర‌స్ ప్రసారానికి సంభావ్య వనరుగా ఉంటున్నాయ‌ని అధ్య‌య‌నాల‌ ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి విశ్వ‌స‌నీయ‌మైన స‌మాచారం అందుబాటులో లేదు. కాబ‌ట్టి బహిరంగ ప్రదేశాల్లో డోర్క్‌నోబ్‌లు, లిఫ్ట్ కాల్ బటన్లు, కౌంటర్లను తాకినప్పుడు వీలైనన్ని సార్లు చేతులను శుభ్ర పరచుకోవ‌డం సర్వత్రా సురక్షితం.

ఒక‌రి నుంచి ఎంత మందికి సంక్ర‌మించ‌వ‌చ్చు..
ఈ అంటు వైర‌స్ క‌లిగివున్న‌వ్య‌క్తి నుంచి స‌గ‌టున మాన‌వ ప్ర‌సార ప‌రిధి (ఆర్‌వో) 2.2 నుంచి 3.1 మధ్య ఉంటుందని అధ్య‌య‌నాల ద్వారా తెలుస్తోంది. అంటే వైర‌స్ సంక్ర‌మించిన ఒక వ్య‌క్తి స‌గ‌టున 2.2 నుంచి 3.1 మందికి దీనిని సంక్ర‌మింప‌జేసే అవ‌కాశం ఉంది. వ్య‌క్తిగ‌త భౌతిక దూరం పాటించ‌డం ద్వారా వాస్త‌వ వైర‌స్ వ్యాప్తిని గ‌ణ‌నీయంగా తగ్గించవచ్చు, తద్వారా సంక్రమణ రేటు కూడా మందగిస్తుంది.

వైరస్ ఎక్కడ నుండి వచ్చింది..
తొల‌త SARS-CoV-2 వైరస్ గ‌బ్బిలం నుండి మానవులకు సోకింద‌ని బ‌ల‌మైన వాద‌న‌లు విన‌వ‌డ్డాయి. స‌ర్వ‌త్రా విన‌వ‌స్తున్న‌ట్టుగా ఈ వైర‌స్ గ‌బ్బిలాల సూప్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రాలేదని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఏదైన ఆహార ప‌దార్థాల‌ను ఉడక‌బెట్టిన త‌రువాత వైర‌స్ న‌శిస్తుంది. ఇటీవలి జ‌రిపిన‌ జన్యువుల అధ్యయనం మేర‌కు ఈ వైర‌స్ గ‌బ్బిలాల నుంచి మాన‌వుల‌కు సంక్ర‌మించే ముందు మ‌రేదైన మ‌ధ్య‌వర్తికి సోకి అటునుంచి మ‌నుషుల‌కు వ‌చ్చి ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రో అధ్య‌య‌నం ప్ర‌కారం SARS-CoV-2 వైరస్ బ‌య‌టప‌డేందుకు ముందే దీని మూలాలు వివిధ ర‌కాల మానవులలో తిరుగాడిన‌ట్టుగా తెలుస్తోంది.

క‌రోనా వైర‌స్‌ ఎలా ఉద్భవించింది..
జూనోటిక్ ట్రాన్స్మిషన్ తరువాత మానవులలో సహజంగా వైరస్ స్ట్రెయిన్‌ను ఎంచుకోవడం ద్వారా SARS-CoV-2 ఉద్భవించింద‌ని ఒక వాద‌న ఉంది. మ‌రోవైపు క‌రోనా మాన‌వుల‌లోకి జునోటిక్ బ‌దిలీకి ముందు మాన‌వేత‌ర జంతు హోస్ట్‌ల‌లో స‌హ‌జంగా వైర‌ల్ స్ర్టెయిన్‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఈ వైర‌స్ ఉద్భ‌వించి ఉంటుంద‌న్న‌ది మ‌రో వాద‌న‌. రెండింటిలో ఏది సరైనదో మరిన్ని అధ్యయనాల ద్వారానే భ‌విష్య‌త్తులో తెలియ‌రానుంది. మానవ సంక్రమణ మరియు ప్రసారానికి అనుమతించిన SARS-CoV-2 లోని ఉత్పరివర్తనలు ఏమిట‌న్న‌ది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఈ వైర‌స్ ఎప్పుడు వెలుగులోకి వచ్చంది..
 డిసెంబర్ 2019 కి ముందు వ‌ర‌కు SARS-CoV2కు సంబంధించి ఎలాంటి న‌మోదిత కేసులు లేవు. కానీ ప్రాథమిక జన్యు విశ్లేషణల ప్ర‌కారం మాన‌వుల‌లో మొద‌టి SARS-CoV-2 కేసు 2019 మ‌ధ్య అక్టోబర్ - మ‌ధ్య డిసెంబ‌రుల‌లో వెలుగులోకి వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. దీనిని బ‌ట్టి చూస్తే ప్రాథ‌మిక జూనోటిక్న‌కు వెలుగులోకి వ‌చ్చిన మ‌ధ్య స‌మ‌యంలో గుర్తించబడని ప్రసార కాలంగా నిర్ధారించ‌బ‌డింది.

క‌రోనా ఇత‌ర జంతువులకు సోకుతుందా..
SARS-CoV-2 వైర‌స్ మ‌నుషుల‌తో పాటు, గ‌బ్బిలాలు, కొన్ని ర‌కాల పిల్లి జాతులు, కోతుల‌లోని స్వైన్ కణాలను ఎక్కువ‌గా ప్రభావితం చేస్తుందని మాలిక్యులర్ మోడలింగ్ సూచిస్తుంది. దీనిని బ‌ట్టి చూస్తే పెంపుడు జంతువులకు లేదా పశువులకు ఈ వైర‌స్ సోకదు. దీంతో గుడ్లు లేదా పౌల్ట్రీ ఉత్పత్తుల‌ను తీసుకోవడం వల్ల SARS-CoV-2 వైర‌స్ సంక్రమణ ఉండదు.

క‌రోనా ఒకరికి మ‌ళ్లీమ‌ళ్లీ సోకవచ్చా..
ఒకసారి ఈ వైర‌స్ సోకి (మ‌కాక్లు)త‌రువాత మనలో చాలామంది దానికి సంబంధించిన జీవితకాల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అదేవిధంగా, మానవులు కోలుకున్న తర్వాత SARS-CoV-2 తో తిరిగి సంశ్లేషణ చేసినట్టు కూడా ఆధారాలు లేవు. అయితే, ఇందుకు సంబంధించిన రోగనిరోధక శక్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో ఇప్ప‌టికిప్పుడు తెలుప‌లేము.

క‌రోనా అనారోగ్యం ఎంత తీవ్రంగా ఉంటుంది..
COVID-19 (క‌రోనా) అంటే మ‌ర‌ణ శాస‌నం కాదు. COVID-19 కేసులలో ఎక్కువ భాగం (81%) తేలికపాటివే, సుమారు 15% మందికి ఆసుపత్రి చికిత్స అవసర‌మ‌వుతుంది. మరియు 5% మందికి క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరం. అంటే సోకిన వారిలో ఎక్కువ మందికి ఆసుపత్రి చికిత్స అవసరం ఉండ‌క‌పోవ‌చ్చు.

ఇది ఎవరికి ఎక్కువ‌గా ప్ర‌మాద‌కరం..
 ఈ వైర‌స్‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌లు ఎక్కువగా ప్ర‌భావిత‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇటలీలోని లోంబార్డిలో 20% మంది ఆరోగ్య కార్యకర్తలు రోగులకు వైద్య సంరక్షణను అందిస్తూ వ్యాధిబారిన పడుతున్నారు. సాధారణ ప్రజలలో, వృద్ధులు, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు మరియు ముందు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు క‌లిగి ఉన్న వారికి ఎక్కువగా ప్రమాదం పొంచి ఉంది.

వైర‌స్ మరణాల‌కు కారణం ఏమిటి..
ఈ వైర‌స్ సోకిన వాళ్ల‌లో చాలా వరకు మరణాలు గుండె దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ వైఫల్యం వల్ల సంభవిస్తాయి. ఉపిరితిత్తులలోకి జీవ ద్రవం లీకేజ్ కావ‌డం, ఇది శ్వాసక్రియను నిరోధిస్తుంది మరియు అనారోగ్యానికి దారితీస్తుంది, ఇది ప్రాధమిక క్లినికల్ పరిస్థితి. ప్రస్తుతం, COVID-19 చికిత్స ప్రధానంగా సహాయక సంరక్షణ, అవసరమైతే వెంటిలేషన్తో సహా. అనేక చికిత్సా పరీక్షలు కొనసాగుతున్నాయి మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో ఎదురు చూడాల్సిందే.

పాల ప్యాకెట్లు లేదా వార్తాపత్రికల వైరస్ వ్యాపిస్తుందా: SARS-CoV-2 వైర‌స్ ప్లాస్టిక్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ ఉపరితలాలపై 3 రోజుల వరకు మన్న‌గ‌లుగుతుంది. వైరల్ లోడ్ 10000 పీఎఫ్‌యు ఉన్నప్పుడు, ఇది వార్తాపత్రిక మరియు, కాట‌న్‌ వస్త్రాలపై 5 నిమిషాలు మాత్రమే నిల‌వ‌గ‌లుగుతుంది. పాల సాచెట్లపై వైరస్ సంక్ర‌మ‌ణ‌న‌ను తొలగించడానికి వాటిని బాగా కడగితే సరిపోతుంది.

వేసవి లేదా వర్షాకాల ప్రారంభంలో ఈ వైర‌స్ నుంచి కొంత ఊర‌ట ల‌భించ‌వచ్చా..
ల‌భిస్తుందా.. ఉష్ణోగ్రత లేదా గాలిలో తేమకు అనుగుణంగా వైర‌స్ వ్యాప్తిలేదా ప్ర‌సారం, సంక్ర‌మ‌ణ‌ త‌గ్గుతుంద‌న‌డానికి ఎలాంటి బ‌ల‌మైన ఆధారాలు లేవు. 


(Release ID: 1610108) Visitor Counter : 2426