రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సుప్రీంకోర్టు 27.03.2020 జారీ చేసిన ఆదేశాల ప్రకారం బిఎస్ -4 వాహనాల పరిమిత రిజిస్ట్రేషన్ కు అనుమతి
Posted On:
01 APR 2020 2:53PM by PIB Hyderabad
సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవలసిందిగా ఎన్.ఐ.సి కి సూచన
సుప్రీంకోర్టు 27-03-2020 జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ మినహా దేశవ్యాప్తంగా గల రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో బిఎస్-4 వాహనాల పరిమిత రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పించాల్సిందిగా ఎన్.ఐ.సిని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కోరింది. కోవిడ్ -19 కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ ను ఢిల్లీ మినహా ఆయా నగరాలలో ఎత్తివేసిన తర్వాత , డీలర్ల వద్ద నిల్వ ఉన్న బి.ఎస్-4 వాహనాలకు సంబంధించి (సుప్రీంకోర్టుకు నివేదించిన ప్రకారం) పది శాతానికి మించకుండా షరతులతో కూడిన అమ్మకం, రిజిస్ట్రేషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. ఢిల్లీ లో మాత్రం సుప్రీంకోర్టు బిఎస్ -4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై స్టే అలాగే ఉంచింది.
24-10-2018న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల ప్రకారం బిఎస్-4 వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ జరగరాదు. 1.4.2020 నుంచి బిఎస్ -6 వాహనాల రిజిస్ట్రేషన్‌ను మాత్రమే భారతదేశం అంతటా అనుమతిస్తారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని రాష్ట్రాలను,కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరింది.
వాహనాల నుంచి వెలువడే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత్ స్టేజ్ (బిఎస్) ఉద్గారాల నిబంధనలు , ప్రమాణాలను ప్రభుత్వం తీసుకువచ్చింది. బిఎస్ -4 నిబంధనలు 2017 ఏప్రిల్ నుంచి అమలు లో ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న యూరో 4 ఉద్గార ప్రమాణాల నుంచి ఒకే సారి యూరో -6 ప్రమాణాలకు వెళ్లాలని , ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన వాయు ఉద్గార ప్రమాణాలు పాటించాలని ఇండియా నిర్ణయించింది. దీనిని దేశం పట్టుమని మూడు సంవత్సరాలలోనే సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఆర్ధిక వ్యవస్థలు ఏవీ ఇలాంటి విజయాన్ని సాధించిన దాఖలా లేదు.
(Release ID: 1609941)
Visitor Counter : 197