కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నేపథ్యంలో కంపెనీల ఉపశమనానికి రెండు పథకాలు ప్రకటించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

చట్టాన్ని గౌరవించే సంస్థలకు మరియు పరిమిత బాధ్యత భాగస్వామ్యాలకు (ఎల్‌ఎల్‌పి) భారం తగ్గించడానికి ‘కంపెనీల ఫ్రెష్ స్టార్ట్ స్కీమ్, 2020’

‘ఎల్‌ఎల్‌పి సెటిల్మెంట్ స్కీమ్, 2020’

Posted On: 30 MAR 2020 9:11PM by PIB Hyderabad

చట్టాన్నిఅతిక్రమించకుండా గౌరవించే సంస్థలకుపరిమిత బాధ్యత భాగస్వామ్యాలకు (ఎల్‌ఎల్‌పి) ఉపశమనం కలిగించేందుకు కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగాకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) కంపెనీల తాజా ప్రారంభ పథకం, 2020” ను ప్రవేశపెట్టింది.  బకాయిల వ్యవధితో సంబంధం లేకుండాఏదైనా ఫైలింగ్ సంబంధిత బకాయిలను సరి చేయడానికికొత్త అవకాశం ఇవ్వడానికి కంపెనీలుఎల్‌ఎల్‌పిలకు తొలిసారిగా ఇటువంటి అవకాశాన్ని అందించడానికి ఇప్పటికే అమలులో ఉన్న ఎల్‌ఎల్‌పి సెటిల్మెంట్ స్కీమ్, 2020” ను సవరించారు. తాజా ప్రారంభ పథకంసవరించిన ఎల్‌ఎల్‌పి సెటిల్మెంట్ స్కీమ్కోవిడ్-19 వల్ల చోటుచేసుకున్న అసాధారణ ప్రజారోగ్య పరిస్థితులలో నిబద్ధతని ప్రోత్సహిస్తుందిఈ కారణంగా ఉత్పన్నమయ్యే భారాన్ని తగ్గిస్తుంది.

రెండు పథకాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే కంపెనీలు లేదా ఎల్‌ఎల్‌పిలు,  2020 ఏప్రిల్ నుండి 2020 సెప్టెంబర్ 30 వ తేదీ మధ్యలో కంపెనీల రిజిస్ట్రార్‌ కు తో ఆలస్యంగా దాఖలు చేయడానికి పడే  అదనపు ఫైలింగ్ ఫీజులను ఒక సారి మాఫీ చేయడం.   ఈ పథకం వివిధ ఫైలింగ్ అవసరాలకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండావారిపై ఆర్ధిక భారాన్ని కూడా తగ్గించినట్టవుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిల నుండి సడలింపు దొరడమే కాకుండా కొత్తగా వారి కార్యకలాపాలను ప్రారంభించుకోడానికి అవకాశం ఇస్తుంది.  

రిటర్న్ లు దఖలు పరచడంలో జరిగిన జాప్యానికి విధించే అపరాధ రుసుముతో పాటు ఇప్పటికే వివిధ కారణాలతో విధించిన అపరాధ రుసుము విషయంలో ప్రారంభించిన చర్యలలో  సడలింపు ఉంటుంది. అలాగే ప్రాంతీయ డైరెక్టర్ల ముందు అప్పీల్ చేసుకునేందుకు అదనపు సమయం కూడా ఇస్తారు. ఈ సడలింపు కేవలం ఎంసిఏ21 లో ఫైలింగ్ లో జరిగిన జాప్యానికి వర్తిస్తుంది. ఇతర చట్టోల్లంఘనలకు వర్తించదు.కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మర్చి 30న విడుదల చేసిన సర్క్యూలర్లలో ఈ కొత్త పథకాల వివరాలు పరిశీలించవచ్చు. 

****


(Release ID: 1609437) Visitor Counter : 139