చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

ప్రపంచ వ్యాప్త వ్యాధి కొవిడ్-19ను ఎదుర్కొనుటకు ఆదాయపు పన్ను అప్పెల్లేట్ ట్రిబ్యునల్ అధికారులు మరియు సిబ్బంది తమ ఒక రోజు జీతాన్ని ప్రధాన మంత్రి కేర్స్(సిఏఆర్ఇఎస్) నిధికి విరాళమివ్వడానికి నిర్ణయం

Posted On: 30 MAR 2020 5:20PM by PIB Hyderabad

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశలను మరణాలతో వణికిస్తున్న విశ్వమహమ్మారి కొవిడ్-19 మన దేశంలో కూడా శాఖోపశాఖలుగా విస్తరించి ప్రజల ఆరోగ్యాన్నిమరియు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నది, దీనిని ఎదుర్కొనేందుకు మరియు  28 మార్చి 2020న ప్రధానమంత్రి ఆధికారిక వెబ్సైట్ పిఎంఇండియాలో ప్రకటించిన విధంగా ప్రధాన మంత్రి అధ్యక్షతన ’ప్రధానమంత్రి పౌర సహాయ మరియు అత్యవసర పరిస్థితుల పరిహార నిధి(పిఎం సిఏఆర్ఇఎస్ నిధి) పేరిట ఒక ప్రజా ధార్మిక సంస్థను నెలకొల్పటంతోపాటు పత్రికా సమాచార కార్యాలయం రిలీజ్ ఐడి 1608851తో 28 మార్చి 2020న ప్రచురించింది. కొవిడ్-19 మహమ్మారిని నివారించేందుకు మరియు దాని బారిన పడిన వారికి తగిన సహాయ సహకారాలను అందించేందుకు ఈ అత్యవసర క్లిష్ట పరిస్థులను తట్టుకునేందు ప్రజలు ఈ నిధికి విరివిగా విరాళాలు అందజేయాలని ప్రజలందరికీ  విజ్ఞప్తి చేయడమైనది.

ఇందులో భాగంగా  అన్ని ఆదాయపు పన్ను అప్పెలేట్ ట్రిబ్యునళ్ళ ఉపాధ్యక్షులను సంప్రదించి ఆయా ట్రిబ్యునళ్ళలోని  అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, రిజిస్ట్రీ అధికారులు వంటి అందరు అధికారులు మరియు సిబ్బంది కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు  తమ ఒక రోజు జీతాన్ని ప్రధానమంత్రి కేర్స్ నిధికి విరాళంగా అందజేయడానికి నిశ్చయించుకున్నారు.

సామాజిక మరియు జాతీయ బాధ్యతలను నిర్వహిస్తున్న ఒక సంస్థగా ఐటిఏటి అధ్యక్షులు జస్టిస్ పి.పి. భట్  విడుదల చేసిన ఒక ప్రకటనలో తమ భాగస్వాములను ప్రధాన మంత్రి కేర్స్ నిధికి  ఔదార్యంతో విరాళాలను ప్రకటించవలసిందిగా కోరారు. ఈ నిధికి అందజేయు విరాళాలను సెక్షన్ 80(జి) ఆదాయపు చట్టం, 1961 క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు కలదు.  విరాళాలు అందజేయదలచుకున్న భాగస్వాములు ఈ URL/Link: wvvw.prnindiagov.in/en/pm-cares/ సందర్శించవచ్చు.



(Release ID: 1609403) Visitor Counter : 76