గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
’ఇంటి నుంచి పని’ చేయడానికి మార్గం చూపిస్తున్న ట్రైఫెడ్(టిఆర్ఐఎఫ్ఇడి) వన్ ధన్ ఇండియా బృందం
Posted On:
29 MAR 2020 7:03PM by PIB Hyderabad
గిరిజన మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలోని ట్రైఫెడ్ అనే సంస్థలో దేశంలోని 27 రాష్ట్రాల్లో పనిచేసే సుమారు 500 మంది అధికారులు ఇంటి నుండి పనిచేస్తూనే ఒకరికొకరు అనుంధానమై బలీమైన ప్రభావాన్ని చూపుతున్నారు. వారి వారి కంప్యూటర్ల ద్వారా ఇంటి నుండి పనిచేస్తూ సత్ప్రమాణాలను నెలకొల్పుతూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు.
అన్ని అడ్డంకులను అధిగమిస్తూ గిరిజన వ్యాపార పారిశ్రామికవేత్తలకు సాంకేంతికతలో శిక్షణను అందించడానికి 16 ఐఐటిలు మరియు ఐఐఎంల పరిధిలో ’ది టెక్ ఫర్ ట్రైబల్స్’ అనే ఆన్లైన్ కార్యక్రమాన్ని 19 మార్చి 2020న ప్రారంభమైంది. ఈ పథకం దేశవ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 3.5 లక్షల గిరిజన వ్యాపార పారిశ్రామికవేత్తలను ప్రపంచంలోని ఉత్తమ సంస్థలకు అనుసంధానం చేస్తుంది.
27 మార్చి 2020న 27 రాష్ట్రాల్లోని బృందాలు 50 లక్షల గిరిజనులకు భవిష్యత్తులో సమాచారాన్ని అందించడం కోసం జిఐఎస్ ఆధారిత ట్రైఫెడ్ వన్ ధన్ వెబ్సైట్ ఆన్లైన్లో ప్రారంభించబడింది. ట్రైఫెడ్ రోజుకు కనీసం రెండు బృంద సమావేశాలను ఏర్పరచి సభ్యుల ఉన్నతికి తోడ్పడటంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 29తో పోలిస్తే సుమారు 1.50 లక్షల గిరిజన పారిశ్రామికులు, వివిధ వృత్తుల వారికి జీవనాధారాన్ని కల్పించడంలో ఇప్పటికే 30% వృద్ధిని సాధించిందని ట్రైబ్స్ ఇండియా తెలిపింది. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ వారికి అవరోధం కాలేదు.
ఫిబ్రవరి 29 నాటికి దేశంలోని 22 రాష్ట్రాల్లో 1205 వన్ ధన్ కేంద్రాలను ట్రైఫెడ్ ఏర్పాటు చేయడంతోపాటు 3 లక్షల 70 వేల మంది గిరిజనుల్లో పారిశ్రామిక వ్యాపార దక్షతను ప్రోత్సహింస్తున్నది. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కేంద్రాలు నిర్దేశించుకున్న లక్ష్యమైన 600 కేంద్రాల ఏర్పాటుకు రెట్టింపు. ఇపుడు ఈ కేంద్రాలు గిరిజనుల అంకుర సంస్థలను ప్రోత్సహించడంలో, నాణ్యతను మెరుగుపరచడంలో మరియు మంచి ఫలితాలను సాధించడంలో వారిని ఏకీకరణ దిశగా ప్రయత్నిస్తున్నది.
27 న గిరిజన పారిశ్రామిక వర్గాలు వారి వారి పని వివరాలు తెలుపుటకు వెబ్ వేదిక ద్వారా అనుసంధానం చేయబడి వన్ ధన్ ఇండియా బృందాన్ని సంప్రదించాయి. ప్రస్తుత క్లిష్ట సమయంలో గిరిజనుల అమ్మకాలు తగ్గిపోతున్నందున ఆందోళనలో ఉన్న గిరిజనుల కోసం నిధిని మంజూరు చేయమని భారత ప్రభుత్వానికి ఇక ప్రతిపాదన తయారు చేయడుతున్నది.
దేశానికి సామాజిక ప్రయోజనం కలిగించే సందేశాలను తయారు చేసి వాటిని ప్రభావవంతంగా తెలపడంలో ట్రైఫెడ్ సామాజిక మీడియా బృందం మరియు ట్రైబ్స్కామ్ సంయుక్తంగా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. మూడు రోజుల్లోనే 2.5 మిలియన్ల ప్రజలను ఈ సందేశాలు చేరుకున్నాయి.
అలాగే ఈ సమయాన్ని 10,000 గిరిజన ఉత్పత్తులను ట్రైబ్స్ ఇండియా ఇ కామర్స్ పోర్టల్ ద్వారా ప్రచారంచేయుటకు, వెబ్ పోర్టల్ పున:ప్రారంభించుట మరియు మెరుగు పరచుటకు ఉపయోగించుకుంటున్నది ట్రైబ్స్ ఇండియా. తమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళుటకు రు.105 కోట్లు మరియు రు.17 కోట్ల నిధులను అందించిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎంఎస్ఎంఇ వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నారు. కాగా అవసరంలో ఉన్న గిరిజన వృత్తుల వారికి ఆహారం అందించడాని కోసం ట్రైఫెడ్ బృందం త్వరలో ఒక పోర్టల్ ఏర్పాటు చేసే విషయం ప్రతిపాదనలో ఉంది.
(Release ID: 1609088)
Visitor Counter : 133