సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
డిఒపిటి మెమోరాండం
Posted On:
28 MAR 2020 8:21PM by PIB Hyderabad
అన్ని మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి వచ్చే కీలకమైన సేవల కోసం సిబ్బందిని రోస్టర్ విధానంలో నియమించే సమయంలో “దివ్యాంగులు”గా గుర్తించిన ఉద్యోగులను విధుల నుంచి మినహాయించాలని, ఈ అంశం పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ శాఖల పరిధిలోకి వచ్చే అదనపు నిత్యావసర సర్వీసుల నిర్వహణ కోసం “తప్పనిసరి అయిన సిబ్బంది” జాబితాలు తక్షణం తయారుచేయాలని ఆయా శాఖల అధికారులందరికీ దేశంలో 21 రోజుల నిరవధిక లాక్ డౌన్ ప్రకటించిన వెనువెంటనే డిఒపిటి ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావనీయం.
అలాగే కోవిడ్-19 కారణంగా ఏర్పడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2019-20 సంవత్సరానికి కేంద్ర సర్వీసులన్నీ గ్రూప్-ఎ అధికారుల వార్షిక పనితీరును వివరించే నివేదికలు (ఎపిఎఆర్) సమర్పించాల్సిన గడువును పొడిగించినట్టు మరో ఉత్తర్వులో తెలిపింది. పాత షెడ్యూల్ ప్రకారం సంబంధిత శాఖాధికారులందరూ ఖాళీ ఎపిఆర్ లను పంపిణీ చేయాల్సిన గడువు మార్చి 31 కాగా దాన్ని తాజాగా మే 31 వరకు పొడిగించారు.
అలాగే ఆయా అధికారులు తమ పనికి సంబంధించిన వివరాలు తెలియచేస్తూ రిపోర్టింగ్ అధికారులకు (ఆర్ఓ) స్వయం వివరణ నివేదికలు సమర్పించాల్సిన తేదీ పాత గడువు ఏప్రిల్ 15 కాగా ఇప్పుడు ఆ గడువును జూన్ 30కి పొడిగించారు.
అధికారుల్లో అధిక శాతం మంది ఇంటి నుంచే పని చేయాలని, అయితే టెలిఫోన్ కాల్ కు గాని, ఎలక్ర్టానిక్ కమ్యూనికేషన్ సాధనాలకు గాని అందుబాటులో ఉండాలని సూచించారు. అవసరం ఏర్పడినప్పుడు వారిని అందుబాటులోకి రావాలని కోరే అవకాశం ఉన్నదని కూడా తెలిపింది.
(Release ID: 1608958)
Visitor Counter : 171