ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ఎదుర్కోడానికి ఈశాన్య రాష్ట్రాలకు రూ.25 కోట్లు 'లోటు భర్తీ' నిధి సమకూర్చనున్న కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 MAR 2020 6:28PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్-19ని ఎదుర్కోడానికి తీయూసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి) డాక్టర్ జితేంద్ర సింగ్ సంబంధిత అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సామాజిక దూరం పాటించడంలో అమలు చేస్తున్న మార్గదర్శకాల గురించి సమీక్షించారు. సమావేశంలో మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం శాఖకు సంబంధించిన పనంతా ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహిస్తున్నామని,  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి నుండే విధులను చేపడుతున్నామని అధికారులు వివరించారు. 

ఈశాన్య రాష్ట్రాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను రవాణా చేయడానికి కార్గో విమానాలను సిద్ధంగా ఉంచామని మంత్రి చెప్పారు. లోటు భర్తీ చేసే నిధి కింద రూ. 25 కోట్లను ఈశాన్య రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించినట్టుదీని ద్వారా కోవిడ్-19ని సమర్థంగా ఎదుర్కొంటామని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఉమ్మడి నిధిగా కరోనాను ఎదుర్కొనే ఎటువంటి చర్యలనైనా చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుత  కేంద్ర ప్యాకేజీ ల కిందకు ఇది రాదు. 

వ్యాధిని నిరోధించే విషయంలో రాష్ట్రాలు త్వరగా తగు చర్యలు తీసుకోడానికి ఈ నిధి సౌలభ్యం కలిగిస్తుంది. ప్రస్తుత పథకాల క్రింద కేటాయించిన నిధులకు ఇది అదనం. 

 


(Release ID: 1608679) Visitor Counter : 192
Read this release in: English , Hindi , Assamese , Bengali