రక్షణ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ మొదటి రోజు: ఇరాన్ నుంచి తరలించిన మరో 277 మందిని సైన్యం అక్కున చేర్చుకుంది, సైనిక ప్రధాన కార్యాలయ సిబ్బందికి ఇంటి నుంచి పనిచేసే సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు
Posted On:
25 MAR 2020 6:54PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభమైన మొదటిరోజు ఇరాన్ నుంచి తరలించిన మరో 277 మందిని జోద్పూర్ లోని సైనిక స్థావరం స్వీకరించింది. వారిలో 273 మంది యాత్రికులు ఉన్నారు. తరలించిన వారిలో 149 మంది మహిళలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారిని డిల్లి నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలలో జోద్పూర్ తీసుకు వచ్చారు. జోధ్పూర్ విమానాశ్రయం నుంఛి వైద్య చికిత్సా సదుపాయాలు ఉన్న కేంద్రానికి తీసుకొని వెళ్ళడానికి ముందు పరీక్షించారు. వైద్యచికిత్సా సదుపాయాన్ని కేవలం ప్రత్యేకంగా, ఏకాంతంగా ఉంచడానికి మాత్రమే కాక నేర్పుతో ఒక నియమిత పద్ధతిలో క్రీడలు మరియు వినోద కార్యకలాపాల ద్వారా మానసిక & శారీరక స్వస్థత చేకూర్చే విధంగా ఆ కేంద్రాలను డిజైన్ చేశారు.
సైనిక ప్రధాన కార్యాలయం స్థాయిలో అత్యవసర సేవలు అందించే కొద్ది మంది సిబ్బంది మినహా ఎక్కువ మంది ఇళ్ళ నుంచి పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావంవల్ల అంతర్జాతీయ సహకారం, శిక్షణా కార్యక్రమాలు, నియామకాలు, కోర్సులు, విధి నిర్వహణలో భాగంగా ప్రయాణాలు మొదలగునవి తగ్గిపోయాయి. దానివల్ల ఆఫీసు పని బాగా తగ్గిపోయింది. డ్యూటీ అధికారులు, వైద్య సిబ్బంది, డ్రైవర్లు, వంటపనివారు మరియు ఇతర సహాయక ఉద్యోగుల వంటి అత్యవసర సిబ్బంది ఇంతకు ముందు వలెనే పనిచేస్తున్నారు.
ఇరాన్, ఇటలీ మరియు మలేషియా నుంచి తరలింఛిన వారికోసం సైన్యం మానేసర్, జైసల్మేర్ మరియు జోధ్పూర్ లలో వైద్య స్థావరాలను నిర్వహిస్తోంది. వుహాన్, జపాన్ నుంచి తరలించిన వారికి వైద్య చికిత్సా క్రమాన్ని పధ్ధతి ప్రకారం అమలుచేసి పంపివేయడం జరిగింది. ఈ కేంద్రాలలో ఇప్పటివరకు ఉంచిన 1200 మందిలో కేవలం ఒకరికి మాత్రమే కోవిడ్-19 పరీక్షలలో పాజితివే వచ్చింది. ఈ కేసు కాఉండా హిండన్ లోని భారత వైమానిక దళ స్థావరం నుంచి మరొక కేసుకు సంబందించిన సమాచారం అందింది.
అవి కాకుండా అన్నీకలిపి 1600 పడకల సామర్ధ్యంతో ఝాన్సీ, బిన్నగురి, గయాలలో మరిన్ని సైనిక వైద్య స్థావరాలను సిద్ధంగా ఉంచారు. స్వల్ప వ్యవధిలోనే అదనపు సౌకర్యాలను సిద్ధం చేశారు.
వీటిలో సైన్యం సోదర విభాగాలు నౌకాదళం మరియు భారతీయ వైమానిక దళం సృష్టించి, సిద్ధంగా ఉంచిన అదనపు సౌకర్యాలు కలసి లేవు.
భారతీయ సైన్యం తన పూర్తి శక్తి సామర్ధ్యాలతో ప్రస్తుత, భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. జాతి ప్రయత్నాలకు నిరంతర మద్దతు ఇస్తూనే ఉంటుంది.
******
(Release ID: 1608244)
Visitor Counter : 176