విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బెల్జియంతో నేరస్థుల అప్పగింత ఒప్పందం
Posted On:
21 MAR 2020 4:19PM by PIB Hyderabad
ఇండియా, బెల్జియం మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం భారత్, బెల్జియం ప్రభుత్వాల మధ్య కుదిరిన పరదేశ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ధృవపరచి సంతకాలు చేయడాన్ని ఆమోదించింది.
ప్రధాన అంశాలు
ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి :-
- దేశం నుంచి పంపాలనే నియమానికి బద్ధులై ఉండటం
రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం అన్య దేశంలో బహిష్కరించదగిన నేరంచేసిన నిందితుడు/అపరాధి తమభూభాగంలో తిరుగు తున్నట్లయితే అతడిని తమ దేశం నుంచి పంపివేయడానికి ప్రతిదేశం అంగీకరిస్తుంది.
- బహిష్కరించదగిన నేరాలు
బహిష్కరించదగిన నేరం అంటే రెండు దేశాల చట్టాల ప్రకారం ఒక ఏడాది లేక అంతకన్నా ఎక్కువ రోజుల పాటు కఠిన కారాగారశిక్ష విధించడానికి అనువైన నేరం. ఒక దేశం ఇంకొక దేశాన్ని అపరాధిని అప్పగించవలసిందిగా కోరేనాటికి ఇంకా పూర్తి చేయవలసిన శిక్షా కాలం కనీసం ఆరు నెలలు ఉండాలి. పన్నుల చెల్లింపు లేక రెవెన్యూ లేక ఆర్ధిక సంబంధమైన నేరాలు ఈ ఒప్పందం కిందకు వస్తాయి.
- నిరాకరించడానికి గల కారణాలు
ఒప్పందం ప్రకారం అప్పగింతను నిరాకరించవచ్చు.. ఒకవేళ
- అది రాజకీయ నేరం అయినప్పుడు. అయినప్పటికిన్నీ, కొన్ని నేరాలను రాజకీయ నేరాలుగా పరిగణించబోరని ఒప్పందం వివరిస్తుంది.
- అప్పగింత కోరిన నేరం సైనిక సంబంధమైన నేరం అయినప్పుడు
- జాతి, లింగ, మత, జాతీయత లేక రాజకీయ అభిప్రాయల కారణంగా సదరు వ్యక్తిపై నేరముమోపి విచారణ జరుపుతున్నప్పుడు
- కాలదోషం పట్టిన కేసులో అభియోగం మోపడం లేక శిక్ష అమలు జరుపుతున్నపుడు
దేశీయులను అప్పగించడం విచక్షణాపూర్వకమైనది. నేరం చేసినప్పటి జాతీయతను నిర్ణయించడం జరుగుతుంది.
ముఖ్యమైన అంశాలు
ఈ ఒప్పందం ప్రకారం ఇతర విషయాలలో కింది అంశాలు ఉంటాయి:
ఎ. మరణ శిక్ష విధించిన కేసులో హామీ ( అధికరణం 3(7))
బి. కేంద్ర అధికారులు (అధికరణం 6)
సి. లొంగుబాటు (అధికరణం 11)
డి. ఆస్తుల అప్పగింత (అధికరణం 18)
ఇ. రవాణా (అధికరణం 19)
ఎఫ్. వ్యక్తిగత డేటాకు భద్రత (అధికరణం 21)
జి. అప్పగింతలో అయ్యే ఖర్చులు (అధికరణం 22)
హెచ్. సంప్రదింపులు (అధికరణం 24)
ఐ. అప్పగింతకు సంబంధించి ఉమ్మడి న్యాయ తోడ్పాటు (అధికరణం 25)
జె. ఒప్పందానికి సవరణ మరియు రద్దు అంశాల చేర్పు (అధికరణం 26)
ప్రయోజనాలు
టెర్రరిస్టులు, ఆర్ధిక నేరస్థులు మరియు బెల్జియంకు రాకపోకలు చేసే ఇతర నేరస్థులను రప్పించడానికి కావలసిన చట్టబద్ధమైన రూపం ఒప్పందం వల్ల లభిస్తుంది. ధృవపరచిన తరువాత ఇండియా, బెల్జియం మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి జరిగిన తేదీ నుంచి ఒప్పందం అమలులోకి వస్తుంది.
నేపధ్యం
గతంలో భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటన్ మరియు బెల్జియం మధ్య 1901లో నేరస్థుల అప్పగింత ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 1958లో లేఖల మార్పిడి ద్వారా భారత్, బెల్జియం మధ్య అదే ఒప్పందం వర్తించే విధంగా అంగీకారం కుదిరి ఇప్పటికీ అమలులో ఉంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా విధాన సంబంధమైన అవసరాలు మరియు దానిలో నేరాల సంఖ్య పరిమితంగా ఉన్నదున కాలం చెల్లిన ఆ ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు.
***
(Release ID: 1607776)
Visitor Counter : 129