మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నోవెల్ కరోనావైరస్ (COVID-19) ఎదుర్కోవడంలో తీసుకోవలసినజాగ్రత్తలు
Posted On:
19 MAR 2020 4:17PM by PIB Hyderabad
నోవెల్ కరోనావైరస్ (COVID-19) విస్తరిస్తున్న నేపథ్యంలోచేపట్టాల్సిన నివారణ చర్యలకు సంబంధించి విశ్వవిద్యాలయాలు మరియు వాటి అనుబంధ కళాశాలలకు యుజిసి ఎప్పటికప్పుడు (05.03.2020 మరియు 14.03.2020) సలహాలను జారీ చేస్తోంది.
పైన పేర్కొన్న సూచన, కోవిడ్ -19 నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవటానికి విద్యా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉందని మార్చి 18, 2020 న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్య కార్యదర్శి నుండి మార్గనిర్దేశకాలు వెలువడ్డాయి. అందువల్ల అన్ని విశ్వవిద్యాలయాలు ఈ క్రింది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అభ్యర్థించబడ్డాయి:
జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేయాలని, 2020 మార్చి 31 తర్వాత రీ షెడ్యూల్ చేయాలని విశ్వ విద్యాలయాలకు ఆదేశాలు జారీ.
అన్ని మూల్యాంకన పనులను 2020 మార్చి 31 తర్వాత రీ షెడ్యూల్ చేయాలని ఆదేశాలు .
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులలో ఆందోళన ఉండకుండా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో క్రమం తప్పకుండా అందుబాటులో ఉండడం వల్ల వారిలో ఎలాంటి ఆందోళన ఉండకుండా ఉండడం.
విద్యా సంస్థలు హెల్ప్ లైన్ నెంబర్లు/ ఈ మెయిల్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి పరిచేలా చర్యలు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది భయపడకుండా అన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు సలహా ఇవ్వాలని మరియు COVID-19 ను ఎదుర్కోవడానికి నివారణ మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
(Release ID: 1607245)
Visitor Counter : 166