రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విశాఖపట్నం లో సంఘావరోధ స్థలాన్నిఏర్పాటు చేసిన భారతీయ నౌకాదళం

Posted On: 18 MAR 2020 10:40PM by PIB Hyderabad

సిఒవిఐడి-19 (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా దాని పై దేశం లో చేప‌ట్టిన నిరోధక చ‌ర్య‌ల‌ ను బలపరచడం లో భాగం గా భార‌తీయ నౌకాదళం విశాఖపట్నం లోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఇఎన్‌సి)పరిధి లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విశ్వ‌క‌ర్మ లో ఒక సంఘావ‌రోధ శిబిరాన్ని (క్వోరన్టీన్ క్యాంపు ను) ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్నికోవిడ్‌-19 బాధిత దేశాల నుండి ఖాళీ చేయిస్తున్న భార‌త జాతీయుల కోసం ఏర్పాటు చేయ‌డ‌మైంది.

 

ఈ సంఘావరోధ శిబిరం లో సుమారు 200 మంది కి తగ్గ స‌క‌ల సదుపాయాలతోను, ఏర్పాట్లతోను ఆశ్ర‌యాన్నిచ్చే విధం గా పూర్తి స్థాయి హంగుల ను స‌మ‌కూర్చ‌డం జ‌రిగింది.

 

ఈ శిబిరం లో వ‌స‌తి ని పొందే వ్య‌క్తుల ను నిశితం గా ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమ విభాగం నిర్దేశించిన‌ ప్రోటోకాల్స్ కు అనుగుణం గా ఇఎన్‌సి యొక్క వైద్య వృత్తి నిపుణులు మ‌రియు నౌకాద‌ళ సిబ్బంది తో కూడిన ఒక బృందం వీరి ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తుంది. ఒక ముందు జాగ్ర‌త్త చ‌ర్య లో భాగం గా, నిర్వాసిత వ్య‌క్తుల ను ప‌ద్నాలుగు రోజుల పాటు సాటి స‌మాజం తో క‌ల‌వ‌నీయ‌కుండా విడి గా ఉంచుతారు. వైర‌స్ వ్యాప్తి ని నివారించ‌డం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ ఆరోగ్య సంబంధ అధికారుల తో, జిల్లా పాల‌న యంత్రాంగం తో ఇఎన్ సి క్రియాశీల సహకారాన్ని అందిస్తోంది.

 

 

 

**



(Release ID: 1607139) Visitor Counter : 121