ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19- పాజిటివ్గా తేలిన కొత్త కేసుల వివ‌రాలు

Posted On: 04 MAR 2020 3:07PM by PIB Hyderabad

కోవిడ్‌-19 కు సంబందించి జైపూర్ లో మ‌రో కొత్త కేసు వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే పాజిటివ్‌గా తేలిన ఇటలీ రోగి భార్య కూడా పాజిటివ్ అని తేలింది. 
జైపూర్ కు సంబంధించి కోవిడ్ 19 బారిన ప‌డినట్టు అనుమానం వున్న  14 మంది ఇట‌లీ పౌరుల‌కు, ఒక భార‌తీయునికి ఈ వైర‌స్ వున్న‌ట్టు ప‌రీక్ష‌ల అనంత‌రం తేలింది. వీటిని పాజిటివ్ కేసులుగా గుర్తించారు. 
ఆగ్రాకు చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురు కుటుంబ స‌భ్యులు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. వీరు ఢిల్లీలో కోవిడ్ 19 పాజిటివ్ అనే తేలిన వ్య‌క్తికి సంబంధించిన‌ కుటుంబ స‌భ్యులు. 
వీటికితోడు తెలంగాణ‌లో రెండు అనుమానిత కేసులు బైట‌కొచ్చాయి. 
****(Release ID: 1607093) Visitor Counter : 133